భూతాలదీవి చుట్టూ వున్న కందకంలో అగ్నిశిఖుడు కాపలా కాస్తుంటాడు. కందకాన్ని దాటే ప్రయత్నం చేస్తే అగ్నిశిఖలు ఆకాశాన్ని అంటుతాయి.ఉత్కంఠ రేకెత్తించే జానపద నవల శ్రీసుధామయి ” భూతాలదీవి – బేతాళమాంత్రికుడు ” పుస్తక సమీక్ష ( 01-02-2019 )

దూరప్రాంతాల్లో విదేశాల్లో,వివిధప్రాంతాల్లో ఎక్కడో దూరంగా ,ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగుపాఠకులకు ఒకేఒక క్లిక్ తో ఇ బుక్స్( పుస్తకాల ) ను అందుబాటులోకి తీసుకువచ్చింది కినిగె,వందలాది రచయితలు వేలాది నవలలు లెక్కకు మించిన ఇతివృత్తాలు …విభిన్నమైన పుస్తకాలు.
ఎన్ని పుస్తకాలు చదివినా జానపద నవలలు ఎప్పుడూ మనసును కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది.
చిన్నప్పుడు ఆసక్తిగా, ఇష్టంగా చదివిన జానపద నవలలు, చందమామ కథలు అల్లావుద్దీన్ అద్భుతదీపం, సింధుబాద్ సాహసయాత్రలు.. ఒకటా రెండా.. ప్రతీ కథలో సాహసం స్ఫూర్తి ఆసక్తి ఉండేవి.
సాహసాలు మయమంత్రాలు చిత్రవిచిత్రాలు… కత్తియుద్ధాలు టక్కుటమారా విద్యలు.. చివరికి సత్యమే జయిస్తుంది. సాహసమే జానపదాల చరిత్రలో నిలుస్తుంది.
అలాంటి నవలల కోవలోకి వచ్చిన నవల శ్రీసుధామయి ” భూతాలదీవి – బేతాళమాంత్రికుడు ”
చిన్నప్పటి రోజులను రాజుల కాలాన్ని ముందుకుతీసుకువచ్చిన నవల.
శ్రీసుధామయి ఇప్పటివరకు పది నవలలు రాయగా అందులో అయిదునవలలు జానపద నవలలు కావడం గమనార్హం.అయిదు నవలలు టాప్ టెన్ లో ఉంటూ వచ్చాయి .పాఠకులను అలరించాయి.
కినిగెలో విడుదలై అయిదు వారాలుగా టాప్ టెన్ లో నిలిచినా నవల ” భూతాలదీవి – బేతాళమాంత్రికుడు “
*అది భూతాలదీవి. భూతాలు ఆ దీవిని అదృశ్యరూపంలో కొన్ని శక్తులు కాపలా కాస్తున్నాయి. భూతాలదీవిలోకి అడుగుపెట్టే సాహసం చేసినవారు ఎవ్వరూ ప్రాణాలతో మిగల్లేదు. అతిశక్తివంతమైన ఆ దీవిలోకి అన్యులెవరైనా ప్రవేశించగానే విచిత్రరూపంలోకి మారిపోతారు. తమ రూపాన్ని కోల్పోతారు.
భూతాలదీవి చుట్టూ వున్న కందకంలో అగ్నిశిఖుడు కాపలా కాస్తుంటాడు. కందకాన్ని దాటే ప్రయత్నం చేస్తే అగ్నిశిఖలు ఆకాశాన్ని అంటుతాయి. కందకాన్ని దాటేవారిని భస్మీపటలం చేస్తాయి.
*అది దట్టమైన కీకారణ్యం. మానవమాత్రులెవరూ ప్రవేశించలేని దుర్భేధ్యమైన దట్టమైన ఆ కీకారణ్యంలోకి “భేతాళ మాంత్రికుడు” అడుగు పెట్టాడు. భేతాళ మాంత్రికుడు అడుగులు వేస్తుంటే భూమి భూకంపం వచ్చినట్టు దద్దరిల్లిపోసాగింది. చేతిలో ఉన్న పొడవాటి మంత్రదండాన్ని నేలపై తాటిస్తుంటే ఆకాశం ఉరిమినట్టు మేఘాలు గర్జించినట్టు శబ్దం వస్తోంది.
*భూతాలదీవిని వశం చేసుకోవడానికి భేతాళమాంత్రికుడు క్షుద్రోపాసన మొదలుపెట్టాడు. భూతాల దీవిలోకి ప్రవేశించాడు యువరాజు విజయశీలుడు,
ఆధ్యంతం ఆసక్తిని కలిగించే కథనంతో ముందుకుసాగే ఈ నవలలోని కొంత భాగాన్ని ఫ్రీ పిడిఎఫ్

( Free PDF ) రూపంలో అందించారు.అదికూడా చదివి నవల నచ్చితే కొనుక్కోవచ్చు ( డౌన్ లోడ్ చేసుకోవచ్చు ) 
ప్రయాణంలో ,ఫ్రీగా వున్న సమయంలో మనసును వెనక్కి మళ్లించి  రాజుల కాలానికి జానపద నవల ప్రపంచంలోకి వెళ్ళవచ్చు.
” భూతాలదీవి – బేతాళమాంత్రికుడు ” నవల లింక్

http://kinige.com/book/Bhutala+Deevi+Bhetala+Mantrikudu
ఈ పుస్తకాలను మీరు కూడా సమీక్షంచవచ్చు.మీ సమీక్షలను మేన్ రోబోలో ప్రచురణకోసం పంపించవచ్చు.

NO COMMENTS

LEAVE A REPLY