నలుగురు చేతులు పైకెత్తి చిటికెలు వేశారు.వాళ్ళు ఎందుకు చిటికెలు వేసారో అర్థమయ్యేలోపే…పెద్ద శబ్దం..తోడేళ్ళ అరుపులు ….అప్పటికే ఆలస్యమైంది…శ్రీసుధామయి అపరాధ పరిశోధన కథ…అర్థరాత్రి హత్యలు (03-02-2019 )

హోమ్ టౌన్ సిటీని అనుకుని వున్న అటవీప్రాంతం
అర్థరాత్ర్హి పన్నెండు కావడానికి ఇంకా పదినిమిషాల వ్యవథి వుంది.అక్కడక్కడా పులులు సంచరిస్తున్నాయి.ఆ అటవీప్రాంతంలోకి ప్రవేశించే ధైర్యం ఎవ్వరూ చేయరు.ఎందుకంటే క్రూరమృగాలు యథేచ్ఛగా సంచరించే ప్రాంతం.
చిన్నప్ప తన తుపాకీని భుజాన వేసుకున్నాడు.అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకున్నాడు.కిచెన్ లోకి తొంగి చూసాడు.భార్య తనకోసం వేడివేడి చపాతీలు తయారుచేస్తుంది.ఎప్పుడూ వేడివేడిగా తనకు వండిపెట్టడమే ఇష్టం.తనంటే కమ్లికి తనకోసం తన ప్రాణాలు ఇచ్చేంత ఇష్టం.
” కమ్లి త్వరగా రా” అయినా ఉదయం చేసిన చపాతీలు వున్నాయిగా అన్నాడు చిన్నప్ప
” చల్లారిన చపాతీలు నా మొగుడికి పెడతానా ఏమి ? ముద్దుగా అంటూ చపాతీలను తీసుకువచ్చింది.బంగాళాదుంప కూరతో చపాతీలు ఆబగా తిన్నాడు.భార్య చేసిన చపాతీలా రుచి భార్య తనమీద చూపించే ప్రేమలా చాలా బావుంటాయి.
” ఏంటో నువ్వు అడవిలోకి వెళ్తున్నావంటే దిగులుగా ఉంటుంది.తెల్లారి నువ్వొచ్చేవరకూ ప్రాణాలు ఉగ్గబట్టుకుంటాను ” అంది మొగుడి మూతిని తన చీరకొంగుతో తుడుస్తూ ” చేసేదే ఫారెస్ట్ రేంజర్ ఉద్యోగం..అయినా నేను తుపాకీ గురిపెడితే నాకెదురు యేటి ఉంటాదే పిచ్చి మొహమ..అయినా జంతువులు మనుష్యుల్లా దుర్మార్గులు కారు..అవి వాటిపని అవి చేసుకుపోతాయి.” అన్నాడు భార్యను దగ్గరికి లాక్కొని..అసలే చలికాలం..అందులో బొద్దుగా వుండే భార్య.భర్త స్పర్శకు కరిగిపోతో వేడెక్కిపోతూ ..” ఈరాత్రికి వెచ్చగాఉండిపోవచ్చుగా” ఆశగా అడిగింది.
” రేప్పొద్దునే వస్తాగా..రేపంతా నీదగ్గరే ఉండిపోతా” అంటూ బయటకు నడిచాడు.భర్త కనుమరుగయ్యేవరకూ చూస్తూ ఉండిపోయింది.
***
చిన్నప్ప డ్యూటీని సక్రంగా చేస్తాడు.డబ్బుకు ఆశ పడడం లాంటివి చేయడు.అడవిని చూస్తుంటే చిన్నప్పకు విచిత్రంగా అనిపిస్తుంది.అడవిదాటితే మనుష్యులు,
అడవిలోకి అడుగుపెడితే జంతువులు..ఇద్దరి మధ్య తను..
జంతువుల ప్రేమ చూసాడు..మనుష్యుల స్వార్థం చూసాడు.
చిన్నప్ప కాళ్ళకింద ఎండుటాకులు నలిగి శబ్దం చేస్తున్నాయి.దానితో పాటు మరో శబ్దం.తుపాకిని చేతిలోకి తీసుకుని ముందుకు కదిలాడు.అడవిలో చెట్లచాటున ఒక లారీ.అందులోకి ఎర్రచందనం తరలిస్తున్నారు కొందరు.
క్షణం కూడా ఆలస్యం చేయలేదు చిన్నప్ప.తుపాకిని గురిపెట్టి వారికే ఎదురువెళ్ళాడు.నలుగురు వ్యక్తులు వున్నారు.వాళ్ళు చిన్నప్పను చూసి కంగారుపడలేదు.
“మర్యాదగా చేతులు పైకెత్తి నేలమీద కూచోండి ” తుపాకిని వాళ్లకు గురిపెడుతూ అన్నాడు.
నలుగురు చేతులు పైకెత్తి చిటికెలు వేశారు.వాళ్ళు ఎందుకు చిటికెలు వేసారో అర్థమయ్యేలోపే…పెద్ద శబ్దం..తోడేళ్ళ అరుపులు .చిన్నప్ప తోడేళ్ళ అరుపులు వినిపించిన వైపు తుపాకీ గురిపెట్టాడు.అప్పటికే ఆలస్యమైంది.తోడేళ్ళు చిన్నప్ప మీద ఎటాక్ చేసాయి.
***
చిన్నప్ప మృతదేహం మీద పది విలపిస్తోంది కమ్లి వాళ్ళ పెళ్లయి మూడేళ్లే అయ్యింది.అన్యోన్య దాంపత్యం.పొద్దున్నే వస్తానన్న భర్త మాటలు గుర్తొచ్చో వెక్కివెక్కి ఏడుస్తోంది.
అడవిలో తోడేళ్లదాడిలో చిన్నప్ప మృతి చెండిన వార్తతో పాటు ఆ తోడేళ్ళు నగరంలోకి ప్రవేశించాయన్న వార్త కలకలం లేపింది.
అర్థరాత్రి తోడేళ్లదాడి నగరంలో ప్రకంపనలు సృష్టించింది.
***

హోమ్ టౌన్ సిటీ
రాత్రి పదకొండు గంటలు కావస్తుంది.
డిసెంబర్ నెల
చలికి అందరూ మునగదీసుకుని పడుకున్నారు.
దేశంలో జరిగెనేరాల్లో హోమ్ సిటీ మొదటిస్థానంలో ఉండడం అక్కడి పోలీస్ శాఖకు తలవంపులుగా ఉండడమే కాక .ఈ నేరాలను అదుపు చేయాలనే పట్టుదల ఎక్కువైంది.కానీ అప్పటికే పులిమీద పుట్రలా మరోసమస్య వచ్చి పడింది.
హోమ్ టౌన్ లో అర్థరాత్రి హత్యలు పెను సంచలనాన్నిసృష్టించాయి.మొదటిసారిగా అర్థరాత్రి హత్యకు గురైంది సోనూలాల్ మిశ్రా.
అయితే ఆ హత్య చేసింది తోడేళ్ళని పోస్ట్ మార్టం రిపోర్ట్ లో రావడంతో పోలీస్ శాఖ ఎలర్ట్ అయ్యింది.
సిటీలో టాప్ వన్ బిజినెస్ మేన్..అలాంటివ్యక్తిని అందులోనూ ఎప్పుడూ బౌన్సర్లు అతని వెంటే వుంటారు.
ఈ కేసును నగర పోలీస్ కమీషనర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటు చేసాడు.సిట్ ( స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) కు ఆఫీసర్ గా అండర్ కవర్ కాప్ శ్యామ్ ను నియమించాడు.
ఇలాంటి ఎన్నో కేసులను డీల్ చేసిన శ్యామ్ మరుసటిరోజు అర్థరాత్రి హోమ్ టౌన్ సిటీ నడిబొడ్డున సరిగ్గా అర్థరాత్రి సమయంలో చనిపోయాడు.అతడి బుల్లెట్ అతని శవానికి పదిఅడుగుల దూరంలో పడివుంది.శ్యామ్ వంటి మీద కత్తిపోట్లు లేవు.అతని ఒంట్లో బుల్లెట్స్ దిగబడలేదు.తోడేలు దాడి చేసి చంపిన గుర్తులు వున్నాయి.
బుల్లెట్ వెహికల్ అదుపుతప్పి పడిపోయింది అనడానికి బుల్లెట్ కేవలం పదిఅడుగులదురంలోనే వుంది.
ఆ తరువాత వరుసగా పన్నెండు హత్యలు జరిగాయి..అర్ధరఃత్రి పన్నెండు గంటల సమయంలోనే…
అందులో ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తోన్న ముగ్గురు అండర్ కవర్ కాప్స్..ఇద్దరు పోలీస్ అధికారులు వున్నారుఅన్ని హత్యలూ అర్ధరాత్రే జరగడం విశేషం ఆ హత్యలు తోడేళ్ళు చేస్తున్నాయని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చి చెప్పారు.హత్యలు చేసేది తోడేలు అని నిర్ణయించేసారు.
కేసును సాల్వ్ చేయడం కన్నా ముందు అర్థరాత్రి హత్యలను అరికట్టలేకపోతే పోలీసుశాఖ పరువుపోతుంది.ప్రభుత్వం కూలిపోతుంది.సిటీలో అలజడి మొదలు అవుతుంది.
వెంటనే హెచ్చరిక జారీచేశారు.వేటగాళ్లనూ రంగంలోకి దించారు.
***
ముగింపు వచ్చేవారం

జ్వాలాముఖి…మంత్రాలదీవి జానపద నవల ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Jwalamukhi+Mantrala+Deevi
డిటెక్టివ్ సిద్దార్థ ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Detective+Siddartha
ఘోస్ట్ స్టోరీస్ .ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Ghost+Stories+13
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

డిటెక్టివ్ స్టోరీస్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY