నగర పౌరులకు హెచ్చరిక …నగరంలో జరుగుతున్నాఅర్థరాత్రి హత్యలను దృష్టిలో ఉంచుకుని రాత్రి పది దాటగానే పౌరులు రోడ్డు మీదికి రాకూడదని హెచ్చరించడమైనది.శ్రీసుధామయి అపరాధ పరిశోధన కథ…అర్థరాత్రి హత్యలు (10-02-2019 )

( గత సంచిక తరువాయి భాగం )
నగర పౌరులకు  హెచ్చరిక 
నగరంలో జరుగుతున్నా అర్థరాత్రి హత్యలను దృష్టిలో ఉంచుకుని రాత్రి పది దాటగానే పౌరులు రోడ్డు మీదికి రాకూడదని హెచ్చరించడమైనది.మొదటిఆట సినిమాలు తొమ్మిదిలోపే పూర్తవ్వాలి.పదితరువాత బస్సు సర్వీసులు ఉదయం తెల్లవారు ఝామువరకూ వుండవు.తిరిగి ఉదయమే బస్సులు మొదలు అవుతాయి.
అర్థరాత్రి పోలీస్ గస్తీ ముమ్మురంగా వుంటున్ది.అనుమానాస్పదంగా ఉండేవారిని.అర్హరాత్రి రోడ్డుమీద కనిపించేవారిని ” షూట్ ఎట్ సైట్ ” ఆర్డర్ ద్వారా షూట్ చేయడం జరుగుతుంది.కావున ప్రజలు సహకరించి రోడ్డుమీదకు రావద్దని మనవి.అంతేకాకుండా అర్థరాత్రి అపరిచితులు తలుపుతడితే తలుపులు తీయకుండా ఆ సమాచారాన్ని మాకు అందించి సహకరించండి.
రైలుదిగే  ప్రయాణీకులు రాత్రి స్టేషన్ లో గడుపవలిసి ఉంటుంది.
పోలీస్ జీపులో లౌడ్ స్పీకర్స్ లో అనౌన్స్ చేస్తున్నారు .
అప్పటికే అర్థరాత్రి హత్యలతో అట్టుడుకిన నగరం పెందరాళే ఇంటికి చేరుకోవడానికి సిద్ధమైంది.
                                                     ***
హోమ్ టౌన్ సిటీ సెంటర్ లో వున్న బిగ్ క్లాక్  పన్నెండుగంటలు కొట్టింది.ఆ గంటల శబ్దం హోమ్ టౌన్ సిటీలో మార్మోగింది.
అప్పుడే ఒక జంట రోడ్డుమీదికి వచ్చింది.యువతీ వయసు ఇరవైఐదు యువకుడి వయసు ఇరవై తొమ్మిది ఉంటుంది.ఇద్దరూ మెల్లిగా దిక్కులు చూసుకుంటూ రోడ్డుమీదికి వచ్చింది.ఆమె ఒంటి నిండా బంగారం కనిపిస్తోంది…ఆమె చేతిలో సూట్ కేసు …అతను ఆమె పక్కనే నడుస్తున్నాడు.
“అర్థరాత్రి తోడేళ్ళ హత్యల పుణ్యమా అని మనం పారిపోగలుగుతున్నాం.లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు నిన్ను నన్ను కలిపి లేపేసేవాళ్ళు ” అతను అంటున్నాడు
” ముందు రైలువే స్టేషన్ కు వెళ్దాం….ఆ ఇంట్లో వాళ్ళు చూసిన అర్థరాత్రి బయటకు రాలేరు…అర్థరాత్రి రెండు గంటల రైలుకు మనం వెళ్ళిపోదాం ” ఆ యావతి అంది.అప్పుడే ఓ పోలీస్ జీపు వస్తున్న శబ్దం వినిపించింది.ఆ పక్కనే వున్న చిన్న సందులోకి వెళ్లారు.పోలీస్ జీపు సైరన్ మోగించుకుంటూ వెళ్ళిపోయింది.పోలీస్ జీపు కనుమరుగై పోగానే ” హమ్మయ్య ” అని ఊపిరి పేల్చుకుని బయటకు రాబోతుంటే వెనక నుంచి అడుగుల శబ్దం వినిపించాయి.తలతిప్పి చూసారు ఇద్దరూ .వాళ్ళ కళ్ళు భయంతో వెడల్పు అయ్యాయి.వాళ్ళ గొంతులో నుంచి కేక బయటకు వచ్చింది.
                                    ***
హోమ్ టౌన్ లో అర్థరాత్రి జరిగిన హత్య సిటీలోనే అల్లకల్లోలాన్ని సృష్టించింది.”తోడేళ్ళ దాడిలో ఇద్దరు యువతీ యువకుల మృతి” అన్న వార్త పత్రికల్లో పతాకశీర్షికల్లో వచ్చింది.
హాస్పిటల్ లో మార్చురీలో వున్న రెండుశవాలు గుర్తుపట్టడానికి వీల్లేకుండా వున్నాయి.యువతీ హ్యాండ్ బ్యాగ్ ను బట్టి ఆ యువతీ సిటీలో బిజినెస్ మేన్ గా పేరున్న చావ్లా కూతురి ప్రీతి చావ్లాది అని నిర్ధారించారు.ఆ యువకుడిని గుర్తుపట్టడానికి పోలీసులు విశ్వప్రయత్నం చేస్తున్నారు.
చావ్లా హాస్పిటల్ కు వచ్చాడు.కూతురి శవాన్ని చూడడానికి వచ్చిన చావ్లా ముఖంలో నెత్తురు చుక్కలేదు.కూతురి మృతదేహాన్ని అంబులెన్స్ లో కాకుండా తన వెహికల్ లో ఇంటికి తీసుకు వెళ్ళాడు.చావ్లాకు ఒక్కర్తే కూతురు.తల్లి పుట్టగానే చనిపోయింది.
ఈ సంఘటనతో రాత్రి తొమ్మిదిగంటలకు తలుపులు బిడాయించుకున్నారు ప్రజలు.
                                               ***
స్టేషన్ లో నుంచి బయటకు వచ్చాడు ఆ యువకుడు.చుట్టూ చూసాడు.తనను ఎవ్వరూ గమనించడం లేదనుకున్నాడు.తలమీద వున్న టోపీని మరింతగా కిందికి జరిపాడు.వడివడిగా ముందుకు తడుముకుంటూ నడవసాగాడు.అతని చేతిలో వాకింగ్  స్టిక్ వుంది.కళ్ళకు నల్లటి   కళ్ళజోడు.నగరం కొత్త కర్ఫ్యూ వాతావరణం.హోమ్ టౌన్ సిటీ నిర్మానుష్యంగా వుంది.రోడ్డు పక్కన వుండే టీ అమ్మే బండ్లు కానీ హోటల్స్ కానీ లేవు.సినిమా థియేటర్స్ మొదటిఆట పూర్తవ్వడంతోనే మూసేసారు.
రోడ్డుమీద పోలీస్ వెహికిల్స్ శబ్దాలు మాత్రమే వినిపిస్తున్నాయి.సడెన్ గా ఆ యువకుడి ముందు పోలీస్ జీపు ఆగింది.
” హేయ్ ఎవర్నువ్వు ఇంత అర్థరాత్రి ఎందుకు బయటకు వచ్చావు.బయటకు రాకూడదని తెలియదా ? ” ఓ పోలీస్ అధికారి దిగి ఎగాదిగా తన ఎదురుగా వున్న అపరిచిత యువకుడిని గద్దించాడు
” సారీ సర్ మాది ఈ సిటీ కాదు.నా ఫ్రెండ్ ను కలవడానికి వచ్చాను.నేను బ్లైండ్ చూడలేను ” అన్నాడా యువకుడు.” చూడలేనప్పుడు ఎలా వెళ్తున్నావ్ ? ఎక్కడికి అని వెళ్తున్నావ్ ? మరింత అనుమానంగా అడిగాడు పోలీస్ అధికారి.” చూడలేను అని చెప్పను కానీ నడువలెను అని చెప్పలేదు ఆఫీసర్.అంతకు మునుపు ఒక్కసారి వచ్చాను.ఫర్ యువర్ కింద ఇన్ఫర్మేషన్ ..ఒక్కసారి  చూస్తే మేము తడుముకుంటూ జాగ్రత్తగా వెళ్ళగలం …అన్నట్టు సారీ..మా ఫ్రెండ్ అడ్రెస్ ఈ కాగితంలో ..” అంటూ కోటుజేబు తడుముకుని ఒక చీటీ తీసి ఇచ్చాడు.” ఇదే అడ్రస్ ..కాస్త ఎలా వెళ్ళాలో చెబితే మీకు రుణపడి వుంటాను.” అన్నాడు  ఆ యువకుడు
పోలీస్ ఆ అధికారి ఆ చీటీ వంక ,ఆ యువకుడి వంక చూసి ఎటువెళ్ళాలో చెప్పాడు..ఆ యువకుడి చేతిని పట్టుకుని అతడిని ఎడమవైపుకు తిప్పి…
ఆ యువకుడు ముందుకు కదిలాడు.పోలీస్ జీపు అక్కడి  నుంచి ముందుకు కదిలింది.
ఆ యవకుడు పోలీస్ అధికారి చెప్పిన దిశలోకి వెళ్ళాడు  పదినిమిషాల్లో ఒక మూలమలుపు వచ్చింది.
ఆ మూలమలుపు తిరుగుతుండగా వెనుక నుంచి ఎదో అలికిడి.అతను తలతిప్పే లోగానే అతని ముందు రెండు తోడేళ్ళు ప్రత్యక్షమయ్యాయి.
                                                                                 ***
చావ్లా తన ముందు టేబుల్ ముందు వున్న తన కూతురి శవం   వంక చూస్తున్నాడు.అదే సమయంలో హాస్పిటల్ లో మార్చురీ ముందుకు రెండు తోడేళ్ళు వచ్చాయి.
మార్చురీ ముందు కునికిపాట్లు పడుతున్న బాయ్ ఆ శబ్దానికి కళ్ళు తెరిచి తన ఎదురుగా వున్న తోడేళ్ళను చూసి భయంతో స్పృహతప్పి పడిపోయాడు.
మార్చురీ లోకి అడుగుపెట్టిన ఆ తోడేళ్ళు ” చావ్లా కూతురితో పాటు తోడేళ్లదాడిలో మరణించిన శవాన్ని గుర్తుపట్టాయి…”
                                                                     ***
చావ్లా గది తలుపులు తెరుచుకున్నాయి.ఒక వీల్ చైర్ లోపలికి వచ్చింది.అందులో ఒక యువకుడు వున్నాడు.కాసేపటిక్రితం హోమ్ టౌన్ లోకి అడుగుపెట్టిన యువకుడు.మెల్లిమెల్లిగా స్పృహలో నుంచి బయటకు  వచ్చాడు.
” నేను ఎక్కడున్నాను ? అని తనలో తనే గొణుక్కున్నాడు.
” నాటకం ఆపి కళ్ళు తెరువు మాస్టర్ డిటెక్టివ్ సిద్దార్థ ” అన్నాడు చావ్లా రివాల్వర్ అతని వైపు గురి పెడుతూ
వీల్ చైర్ లో వున్న అంధుడిగా నటించిన డిటెక్టివ్ సిద్దార్థ వీల్ చైర్  లో నుంచి లేచి కళ్లజోడును ఓ పక్కన పెట్టి చావ్లా వైపు చూసి ” వెరీ గుడ్ మిస్టర్  చావ్లా ఉరఫ్ షరీఫ్ ,,” అన్నాడు డిటెక్టివ్ సిద్దార్థ .
ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు షరీఫ్
” షాకయ్యావా మిస్టర్ షరీఫ్ ..నీకు గుర్తుందో లేదో కానీ నేనే నిన్ను షూట్ చేశాను.అప్పుడు నువ్వు చచ్చావు..సారీ చచ్చావని నమ్మించావు.కానీ నువ్వు బులెట్ గాయంతో తప్పించుకుని ఒక హాస్పిటల్ కు వెళ్లవు.అక్కడ నీ ఒడ్డూ పొడవు వున్న ఒక వ్యక్తిని చూసావు.నీ క్రిమినల్  మైండ్ లో క్రైమ్ మొదలైంది.ఆ వ్యక్తిని హత్య చేసావు…తావతా తోడేళ్లతో తోడేళ్ళ వేషంలో వున్న నీ మనుష్యులతో గుర్తు పట్టకుండా ముఖం చెక్కెసావ్..నీ ఐడెంటిటీ అక్కడ వదిలేసావ్…నువ్వో చచ్చావనుకుని కేసు మూసేసారు.
తరువాత నువ్వు చంపినా వ్యక్తి ప్లేసులోకి నువ్వొచ్చావ్…చావ్లా ప్లేసులోకి.అటవీప్రాంతం హోమ్ ఓన్ సిటీకి అనుకునే ఉండడంతో నీ నేరాలకు షెల్టర్ దొరికింది.
తోడేళ్ళ నాటకంతో అటవీ ప్రాంతంలో స్మగ్లింగ్ చేస్తూ పోలీసులను ప్రెస్ ను పక్కదారి పట్టించడానికి సిటీలోకి ప్రవేశించి తోడేళ్ళు అర్ధరఃత్రి హత్యలు చేస్తున్నాయని ప్రచారం మొదలుపెట్టావు.నమ్మించడానికి తోడేళ్ళ వేషంలో వున్న నీ మనుష్యులను ఉపయోగించావు…
ఆరునెలల క్రితమే ప్రీతి చావ్లా నన్ను సంప్రదించింది.తన తండ్రితో మార్పు వచ్చిందని..కూతురి కన్నా ఏదీ ముఖ్యం కాదనుకుని తన తండ్రి డబ్బు కోసం వెంపర్లాడడం..ఆమెలో అనుమానాన్ని కలిగించింది.ఎంత ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నా తండ్రి ప్రేమపూర్వక వాత్సల్య స్పర్శను కూతురు గుర్తు పడుతుంది…
నేను నా పరిశోధన మొదలుపెట్టాను…నీకు తెలియకుండా నీ ఎడమభుజంలో వున్న బుల్లెట్ గాయాన్ని ప్రీతి చావ్లా గుర్తుపట్టింది.తాను ప్రేమించావడితో లేచిపోతున్నట్టు నాటకం ఆడింది.అయినా తను నీ కూతురు కాదు కాబట్టి,తన ఆస్తి  కూడా నీకు కలిసి వస్తుంది కాబట్టి మిన్నకుండిపోయావు…పనిలో పనిగా నీ తోడేళ్ళ మనుష్యులను పంపింబిచావు.అంతకన్నా ముందే నేను ఏర్పాటు చేసిన పోలీసులు ప్రీతి చావ్లాను ,ఆమె ప్రేమికుడిగా నటించిన మా డిపార్ట్మెంట్ మనిషిని సురక్షితంగా కాపాడాం.
నీ తోడేళ్ళ మనుష్యులను ఉతికిఆరేస్తే నిజం కక్కారు.రెండు అనాథశవాలను తీసుకువచ్చాం.కూతురు చనిపోయిందని చెప్పినా నీ మోహంలో ఏ రియాక్షన్ కనిపించలేదు..ప్పుడే అర్థమైంది ” అంటూ షరీఫ్ దగ్గరికి వచ్చాడు.
ఇన్నాళ్లు చావ్లా గా నటించిన షరీఫ్ తన నిజస్వరూపం డిటెక్టివ్ సిద్దార్థ బట్టబయలు చేసి తన స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని కూల్చివేయడంతో తట్టుకోలేకపోయాడు. రివాల్వర్  సిద్దార్థ వైపు గురిపెట్టాడు .
అప్పటికే అతని గుండెలోకి ఓ బుల్లెట్ దూసుకువచ్చింది.ఎదురుగా కమ్లి ..ఆమె చేతిలో భర్త తుపాకీ.
పోలీస్ రికార్డ్స్ లో నువ్వెటూ చనిపోయావు.కమ్లి భర్తను పోతనపెట్టుకుని తనకు తీరని ద్రోహం చేసావు.అందుకే ఆమె భర్త తుపాకీ చేతిలో నీ చావును నేను డిసైడ్ చేశాను.ఇది చట్టం బదులు ధర్మం  విధించిన శిక్ష, ” అన్నాడు అప్పటికే షరీఫ్ చనిపోయాడు.
డిటెక్టివ్ సిద్దార్థ కమ్లి దగ్గరికి వచ్చి ” నీ భర్తను బ్రతికించలేను.కానీ నీ  భర్తను చంపినవాడికి సరైన శిక్ష నీ ద్వారా విధించాను.షరీఫ్ అక్రమంగా దాచిన డబ్బు నీదే.” అంటూ ముందుకు కదిలాడు.
” మా నాన్నను చంపినవాడికి కూడా శిక్ష పడింది”  అంది  డిటెక్టివ్ సిద్దార్థకు కృతఙ్ఞతలు చెబుతూ ప్రీతి చావ్లా.
సింహంలా డిటెక్టివ్ సిద్దార్థ ముందుకు నడుస్తుంటే ఈ కేసును సాల్వ్ చేసిన డిటెక్టివ్ సిద్దార్థకు అటెన్షన్ లో నిలబడి సెల్యూట్ చేస్తున్నారు పోలీసులు.
                               ***
” అపరాధ పరిశోధన కథలు ” ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జ్వాలాముఖి…మంత్రాలదీవి జానపద నవల ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Jwalamukhi+Mantrala+Deevi
డిటెక్టివ్ సిద్దార్థ ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Detective+Siddartha
ఘోస్ట్ స్టోరీస్ .ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Ghost+Stories+13
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

డిటెక్టివ్ స్టోరీస్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY