వండర్ ఫుల్ రైటర్ తేజారాణి తిరునగరి సీరియల్ డెత్ సెంటెన్స్ (03-07-2016)

విజయం తాలూకు ఆనందం కన్నా పోరాటంలో ముందున్నామన్న ఆనందం గొప్పగా ఉంటుంది.కొన్నివిజయాలు సంతృప్తిని ఇస్తాయి తప్ప సంతోషాన్ని కలిగించవు. కరీమ్ ఆల్బర్ట్ లను శిక్షించడం చంపడం విజయమే తప్ప ఆనందం కాదు.ఎర్విక్  కు ఎందుకో అమ్మ ఒడిలో తలపెట్టి ఏడ్వాలన్నబలమైన కోరిక కలిగింది.
పెంచినతల్లి కన్నతల్లి ఇద్దరూ లేరు…కన్నవాళ్ళు లేరు…తోడబుట్టిన సోదరి లేదు…జీవితమంటే ఒంటరితనమేనా ? బంధాలు తాత్కాలిక అనుబంధాల?మరణం మనిషిని మాత్రమే కాదు అంత కన్నా విలువైన జ్ఞాపకాలనూ బాధిస్తుంది.కన్నీళ్లు ఆమె చెంపలను పరామర్శిసూ బుగ్గలపై నుంచి జారిపోతూ ఉంటే రెండు చేతులు ఆ కన్నీళ్లను పలకరించాయి.
కళ్ళు తుడుచుకుని చూసింది.ఎప్పుడొచ్చాడో సమీర్..మోకాళ్ళ మీద కూచోని ఎర్విక్ చుబుకాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు.కన్నీళ్లను తుడుస్తున్నాడు…కాదు కాదు ఆమె వేదనను ఓదారుస్తున్నారు.
ఎడారిలో మండుటెండలో నడుస్తోన్న బాటసారికి నేనున్నానంటూ ఆకాశంలోని ఒక మేఘం కిందికి దిగివచ్చి వర్షపుజల్లులో తడిపేస్తే…
ఆమె ఎడారిలోని ఒంటరి  బాటసారి
అతను మేఘమయ్యాడు…ఆమెకు ఆ క్షణం ఓదార్పు అయ్యాడు.
ఒక స్పర్శ  గొప్ప భద్రతాభావాన్ని కలిగిస్తుందని ఆ క్షణం అర్థమైంది ఎర్విక్ కు…
అలాగే అతడిని చుట్టేసుకుంది.అది ఫిజికల్ ఎట్రాక్షన్ కాదు…మానసికమైన సాన్నిహిత్యం.
“ఎవరూ లేని ఈ ఒంటరి జీవితం నాకు వద్దనిపిస్తోంది సమీర్ “అంది ఎర్విక్.
“నేనున్నాను అనలేదు సమీర్ కానీ నేను నీ వెంటే  ఉంటాను అన్న అనుభూతిని ఆమెకు అందించాడు.అది చాలు ఒక గొప్ప భావాన్ని కమ్యూనికేట్ చేయడానికి
                                                            ***
విక్కీ తన ఎదురుగా నిలబడ్డ ,ముఖర్జీ వైపు చూసాడు.
“ముఖర్జీ నీ యూనిఫామ్ తీసేయ్….నీకు వాచ్ మేన్ కు తేడా తెలియడం లేదు…వాచ్ మేన్ ఇంటిని జాగ్రత్తగా చూస్తాడు..నువ్వు అందుకు కూడా పనికిరావని నా ఉద్దేశం.”నిర్లక్ష్యంగా అన్నాడు విక్కీ.
ముఖర్జీ మొహంలో రంగులు మారాయి.కేవలం తాను విక్కీ దగ్గర డబ్బులు తీసుకోవడమే తనను అతని చేత మాటలు పడేలా చేస్తుంది.
“కోపం వస్తుందా?లాకప్ లో వేసి నన్ను చితక్కొట్టాలని అనిపిస్తోందా?నీలాంటి వాళ్ళు “లైటు లేదని లైసెన్స్  లేదని రోడ్డు మీద బండ్లు పెట్టారని బెదిరించడానికే పనికి వస్తారు.”తాపీగా అన్నాడు.
“మీరిలా మాట్లాడ్డం బావోలేదు “కోపాన్ని అణుచుకుంటూ అన్నాడు ముఖర్జీ.
“మరి ఇంకెలా మాట్లాడాలి?కరీమ్ చచ్చాడు…ఆల్బర్ట్ చచ్చాడు…నెక్స్ట్  నువ్వో నేనో…ఇద్దరం వెళ్లి రోడ్డు మీద నిలబడి బాబూ అమ్మా మమ్మల్ని ఎవరో చంపడానికి వస్తున్నారు…మేము చేతకాని వెధవలం…కాపాడండి బాబూ “అని అడుక్కుందామా?
“నేను చేతులు ముడుచుకు కూచోలేదు…నా పోలీస్ బుర్రకు పదును పెట్టాను.నాలోని క్రిమినల్ అన్ని కోణాల్లో ఆలోచిస్తున్నాడు.కరీమ్ ను చంపింది ఆల్బర్ట్ ను చంపింది ఒక్కరే..”ముఖర్జీ అన్నాడు.
“ఇందులో నువ్వు గొప్పగా చించింది ఏమిటో అర్థం కావడం లేదు ముఖర్జీ…ఆ విషయం పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తే ఎవరికైనా అర్థం అవుతుంది.
“మీకే ఒక విషయం అర్థం కావడం లేదు…వీళ్ళిద్దరిని చంపింది అమ్మాయి..అదీ మీరు యాక్సిడెంట్ చేసి చంపించిన  అమ్మాయి…తర్జని…”నింపాదిగా చెప్పాడు.
పక్కనే బాంబు పడ్డట్టు ఉలిక్కిపడ్డాడు.”ఏమిటి నువ్వు చెప్పేది?విక్కీ కి అది నిజమేనన్న అనుమానం కొద్దికొద్దిగా బలపడుతుండగా అడిగాడు
“కొత్తగా నగరంలో చాలా చోట్ల ముఖ్యమైన కూడళ్లలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసాం.వాటి ఫుటేజ్ చూస్తే తెలిసింది.కరీమ్ దగ్గరికి వచ్చిన అమ్మాయి…ఆల్బర్ట్ ను చంపడానికి ముందు పబ్ లోకి వచ్చిన అమ్మాయి పోలికలు ఒక్కటే…”ముఖర్జీ తేల్చి చెప్పాడు.
అప్పుడే విక్కీ దగ్గరికి శామ్యూల్ వచ్చాడు.అతని చేతిలో పబ్ లో జరిగిన గొడవ తాలూకూ వీడియో ఫుటేజ్  ఉంది…
అదే సమయంలో అనిరుద్ర కారు ఎర్విక్  వున్న ఇంటి వైపు బయల్దేరింది.తర్జని హత్య జరిగిన రోజు ఇండియా కు వచ్చిన ప్యాసింజర్లు లిస్ట్ లో వున్న పేర్లలో ఎర్విక్ పేరుకు ఫోటో మ్యాచ్ అయ్యింది.
తర్జని రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తర్వాతే కరీమ్ ఆల్బర్ట్ చనిపోయారు.సో …ఏదో జరిగింది…తర్జని మరణం మిస్టరీ వీడాలన్నా…ఆల్బర్ట్ ను కరీమ్ ను చంపినవారిని పట్టుకుని కారణం తెలుసుకోవాలన్నా వాళ్లకు వున్నది ఒకే ఆధారం…స…మీ…ర్
పబ్ లో గొడవ జరిగినప్పుడు అక్కడ దొరికిన సిసి ఫుటేజ్ ఆధారంగా సమీర్ ను గుర్తించడానికి అనిరుద్రలాంటి తెలివైన అధికారికి ఎక్కువ సమయం పట్టదు.
కారు డ్రైవ్ చేస్తూనే చెప్పాడు…”మిస్టర్ శామ్యూల్ …ఆల్బర్ట్ ను చంపిన వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ ముఖర్జీ,..బీ ఎలర్ట్ “
(డెత్ సెంటెన్స్ లో చిన్న బ్రేక్)
   to be continued
నిజాల నీడల్లో కనిపించే వికృత క్రీడలు …
మాటల వెనుక వ్యంగం కత్తితో గాయం చేసినట్టు .
సంస్కారం చచ్చి, వ్యక్తిత్వం చెదపట్టి..
మానవతా విలువలు వలువలు కోల్పోతే  …
మనుష్యులను స్కాన్ చేసి , మనుష్యుల్లోని వికృత రూపాలను
అక్షరాల్లో విజువలైజ్ చేసే మోస్ట్ వాంటెడ్ ఫీచర్
వండర్ ఫుల్ రైటర్ తేజారాణి తిరునగరి …
షేడ్స్ …
*ఇది వ్యక్తులను ఉద్దేశించి రాస్తున్న ఫీచర్  కాదు …మంచితనం ముసుగులో వున్న వికృత మనస్తత్వాలకు చేస్తోన్న పోస్ట్ మార్టం                                                     అతి త్వరలో
ఈ సీరియల్ లోని గడిచిన భాగాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

NO COMMENTS

LEAVE A REPLY