వండర్ ఫుల్ రైటర్ తేజారాణి తిరునగరి సీరియల్ డెత్ సెంటెన్స్ (10-07-2016)

                                                        24

చెమ్మగిల్లిన మనసు తల్లడిల్లిన సంఘర్షణ కన్నీటి వర్షంతో బుగ్గలను తడిపిస్తుంటే ,అక్కడ మౌనం ఒంటరిగా మిగిలింది.అప్పుడే ఆమౌనన్ని ఓదార్చడానికి ఒక స్పర్శ ఆత్మీయ అతిథిలా…సమీర్ రూపంలో వచ్చింది.

లైటు కూడా వేసుకోకుండా చీకటిలోనే చీకటిగా మారిన తన జీవితాన్ని తానే ఓదార్చుకుంటుంది.సమీర్ తలుపు తెరిచాడు..అతనితో పాటు వెలుతురూ వచ్చింది.
ఆ క్షణం ఎర్విక్ ను అలా చూస్తుంటే అతని గుండె తరుక్కుపోతుంది.ఒక్కోసారి ఎర్విక్ ఇక్కడికి రాకపోయినా బావుండేదేమో అనిపిస్తుంది.ఎయిర్ ఫోర్ట్ లో జీన్స్ తో స్టయిల్ గా రెక్ లెస్ గా డోంట్ కేర్ అన్నట్టు వుండే ఎర్విక్ కు,ఇప్పుడీ ఎర్విక్ కు ఎంత తేడా?
ఉదయం నుంచి అతని మనసులో ఆందోళన.దానిక్కారణం ఉదయమే సిబిఐ ఆఫీసర్ అనిరుద్ర వచ్చాడు.తన గురించి ఎర్విక్ గురించి అడిగాడు.తనకు ఎర్విక్ ఎవరో తెలియదన్నారు..కానీ తను చెప్పేది అతను నమ్మినట్టు అనిపించలేదు.ఈ విషయాన్ని ఎర్విక్ తో చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పాలి..లేదా వెంటనే దేశం విడిచి వెళ్ళమని చెప్పాలి.
“ఓహ్ మీరా ?సమీర్ ని చూసి అంది కళ్ళు తుడుచుకుంటూ ఎర్విక్.
“నేను కాకుండా ఇంకెవరు వస్తారు.చిన్నగా నవ్వి అన్నాడు సమీర్.
“అవును మీరు కాక నాకు ఇంకెవరున్నారు?అంది ఎర్విక్.
“సారీ నా ఉద్దేశం అది కాదు”నొచ్చుకున్నట్టు అన్నాడు.
“నేను మీ ఉద్దేశాన్ని తప్పు పట్టడం లేదు.నిజమే చెబుతున్నాను…”సిన్సియర్ గా అంది ఎర్విక్..ఎందుకో సమీర్ గుండెల మీద తల పెట్టి ఏడ్వాలని అనిపిస్తోంది.
ఏడుపు అంటే ఇలా ఉంటుంది?
కన్నీళ్లు ఇలా వస్తాయని తెలియకుండా పెరిగిన తను..చిన్నప్పటి నుంచీ దాచుకున్న కన్నీళ్లను ఇలా వర్షిస్తుందేమో...
సమీర్ ఎర్విక్ మొహాన్ని రెండు చేతుల్లోకి తీసుకున్నాడు.ఎర్విక్ అలాగే గువ్వలా ఒదిగిపోయింది.చిన్న ఆసరా…పెద్ద నిశ్చింతగా అనిపిస్తుంది.అతని వీపును ఆమె రెండు చేతులు చుట్టేశాయి.
“ఎర్విక్ నువ్వు వెంటనే వెనక్కి వెళ్ళిపో…కనీసం నువ్వైనా బాగుంటావు..ఈ పగలు ప్రతీకారాలు వదిలేయ్…తర్జనిని చంపిన వారిని ఏం చేయాలో నేను చూసుకుంటాను”చెప్పాడు సమీర్.
“ఎందుకు..ఏ బంధం ఉందని నువ్వు ప్రతీకారం తీర్చుకుంటావు? కొన్నిరోజుల పరిచయంతోనే నువ్వు తర్జని కోసం ఏం చేయడానికి అయినా సిద్ధమే అంటున్నావు..మరి తర్జని..తను నా రక్తం …”ఎర్విక్ అంది.
“నిజమే కానీ నువ్వు అనవసరంగా చిక్కుల్లో పడకూడదు..’అంటూ పొద్దునే సిబిఐ ఆఫీసర్ అనిరుద్ర తనను కలిసిన విషయం చెప్పి”సిబిఐ వాళ్లకు అనుమానం వచ్చిందంటే మనం ఎలర్ట్ గా ఉండాలి…కనీసం నువ్వు మీ దేశం వెళ్తే సేఫ్ గా ఉంటావు…”
‘సమీర్ నాకు జీవితం మీద మమకారం లేదు…తర్జనిని చంపినవారి మీద ప్రతీకారం తప్ప..కేవల్కమ్ తర్జనిని మాత్రమే కాదు…తర్జనిలాంటి ఎంతో మంది ఆడపిల్లలను క్రూరంగా హింసించి.వ్యాపార వస్తువుల్లా విక్రయిస్తూ స్త్రీ శరీరాన్ని కేవలం మాంసపుముద్దగా మార్చే విక్కీ లాంటి వాళ్లకు తగిన గుణపాఠం నేర్పాలి…అని ఆగి
“వాళ్లకు డెత్ సెంటీన్స్ విధించాలి…అమలు చేయాలి…”అంది.
“కానీ అందుకు నువ్వు జైలుకు వెళ్లాల్సి వస్తుంది..అదే నా బాధ’సమీర్ అన్నాడు.
‘నువ్వు వెళ్తే మాత్రం నాకు బాధ ఉండదా?అతని వైపే సూటిగా చూస్తూ అంది ఎర్విక్.
సమాధానం లేని ప్రశ్న …
కానీ …సమీర్ ఏదో చెప్పబోయాడు..
అప్పుడే “ఎక్స్క్యూజ్ మీ ‘అన్న మాటలు వినిపించాయి.
ఉలిక్కిపడి ఇస్ద్దరూ తలలు తిప్పారు.ఎదురుగా అనిరుద్ర ….సిబిఐ ఆఫీసర్
‘హాలో…సారీ మిమ్మల్ని డిస్ట్రబ్ చేసినట్టు వున్నాను…ఐ మీన్ మీ పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చి…”బై ద బై..అయామ్ అనిరుద్ర..ఫ్రమ్ సిబిఐ …ఆఫ్ కోర్స్ మిస్టర్ సమీర్ కు నేను బాగా తెలుసు..అని సమీర్ వైపు తిరిగి..యామై కరెక్ట్..”అని అడిగాడు.
సమీర్ మాట్లాడలేదు..
“చెప్పండి సర్..ఇంతకీ మీరుందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? అడిగింది ఎర్విక్.
“ష్యూర్ మిస్ ఎర్విక్”అన్నాడు ఆమె వైపే చూస్తూ…
“ఎర్విక్…ఎర్విక్ ఎవరు? అడిగింది ఎర్విక్.
అనిరుద్ర ఎర్విక్ వైపు చూసి “ఎర్విక్ ఎవరో మీకు తెలియదా ?అని అడిగాడు.

 

(డెత్ సెంటెన్స్ లో చిన్న బ్రేక్)
to be continued
నిజాల నీడల్లో కనిపించే వికృత క్రీడలు …
మాటల వెనుక వ్యంగం కత్తితో గాయం చేసినట్టు .
సంస్కారం చచ్చి, వ్యక్తిత్వం చెదపట్టి..
మానవతా విలువలు వలువలు కోల్పోతే .. .
మనుష్యులను స్కాన్ చేసి ,
మనుష్యుల్లోని వికృత రూపాలను
అక్షరాల్లో విజువలైజ్ చేసే మోస్ట్ వాంటెడ్ ఫీచర్
వండర్ ఫుల్ రైటర్ తేజారాణి తిరునగరి …

షేడ్స్ …
*ఇది వ్యక్తులను ఉద్దేశించి రాస్తున్న ఫీచర్ కాదు …మంచితనం ముసుగులో వున్న వికృత మనస్తత్వాలకు చేస్తోన్న పోస్ట్ మార్టం
అతి త్వరలో

NO COMMENTS

LEAVE A REPLY