వృక్షో రక్షతి రక్షితః —డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి

ప్రపంచమంతా సస్యశ్యామలమై ,హరితవర్ణమై ,ప్రకృతితల్లి పచ్చదనం ఆచ్ఛాదనతో మురిసిపోవాలి
విధాత చిత్రించిన వర్ణచిత్రంలా,ప్రకృతిలో పచ్చదనమే సప్తవర్ణాల ఇంద్రచాపమై వర్ధిల్లాలి
పచ్చదనం ఆరోగ్యాన్ని ప్రసాదించే సంజీవని …పచ్చదనం కోసం ప్రతీ ఒక్కరం ఒక్కో మొక్క నాటుదాం…రేపటి అద్భుత సస్యశ్యామల హరితవర్ణ ప్రపంచానికి నేడే శ్రీకారం చుడదాం…”అంటున్నారు లోటస్ ల్యాప్ విద్యాసంస్థల డైరెక్టర్ రచయిత కాలమిస్ట్…అన్నింటికి మించి ప్రపంచాన్ని హరితవర్ణంగా చూడాలనుకునే..పర్యావరణవేత్త ..విద్యావేత్త డాక్టర్ కోమటిరెడీ గోపాల్ రెడ్డి.
తన విద్యాసంస్థల విద్యార్థులతో కలిసి గ్రీనరీ వరల్డ్ కు శ్రీకారం చుట్టారు.
దాదాపు ఏడువందల మొక్కలు నాటారు…
అక్షరాన్ని దిద్దే చేతులు మొక్కలు నాటాయి.
సరస్వతీదేవి ముచ్చటపడింది..వనదేవత సంతోషపడింది.
పుట్టినరోజు కేకులు కట్ చేయడం కన్నా ఒక మొక్క నాటడం …గొప్ప సంతోషాన్ని ఇస్తుందన్నారు డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి.
“మీరు నాటే మొక్క ఫలాలు ఇస్తుంది.పూలనూ ఇస్తుంది…స్వచ్ఛమైన గాలిని…ఆహ్లాదంగా ఆనందాన్నీ ఇస్తుంది..
నీడనూ ఇస్తుంది
తన ఆకులను కొమ్మలను చివరికి తనను తానే మీకోసం త్యాగం చేస్తుంది.
ఈ రోజే ఒక మొక్కను నాటండి…ప్రపంచాన్నిహరితవనంగా మార్చండి.అంటూ పిలుపునిచ్చారు డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి.

 

NO COMMENTS

LEAVE A REPLY