వండర్ ఫుల్ రైటర్ తేజారాణి తిరునగరి సీరియల్ డెత్ సెంటెన్స్ (17-07-2016)

                                                   25
నిజానికి అబద్దానికి వున్న సరిహద్దు రేఖ
కళ్ళు నిజం చెబుతోన్నా, మాట అబద్దం చెబుతోన్న సందర్భం …
అనిరుద్ర ఎర్విక్ వైపు చూసి చిన్నగా నవ్వాడు.ఆ నవ్వుకు అర్థం …అర్థమైపోతుంది ఎర్విక్ కు.
“వెల్ …ఎర్విక్ ఎవరో మీకు తెలియదు..కదూ… ఎర్విక్ “సూటిగా ఆమెనే చూస్తూ అడిగాడు.
“తెలియదు…కానీ చివర మళ్లీ మీరు వాడిన పేరు ఎర్విక్ దే కదూ ” ?
“యస్సెస్ ..ఒక్కోసారి అలా అలా అలవాటైపోతుంది…ఓకే ..అని సమీర్ వైపు తిరిగి “హావ్ ఏ గుడ్ డే “అన్నాడు వెనక్కి తిరిగి…
అలా తిరుగుతూనే ఊహించని రీతిలో తన కుడికాలిని ఎత్తి సమీర్ మొహం మీద ఎటాక్ చేయబోయాడు…
క్షణంలో వెయ్యో వంతు…ప్రమాదాన్ని ముందే ఊహించిన ఎర్విక్ తన చేతిని అతని కాలుకు అడ్డుగా పెట్టింది.ఆమె తన చేతిని.
మెరుపువేగంగా కదిలింది.ఎంత వేగంగా అంటే కరాటేలో బ్లాక్ బెల్ట్ అయినా అనిరుద్ర కిందపడబోయి బ్యాలన్స్ చేసుకున్నాడు…
సమీర్ బిత్తరపోతూ చూసాడు.
“గుడ్ ..మార్షల్ ఆర్ట్స్ లో మీ ప్రతిభ తెలుస్తుంది.సెల్ఫ్ డిఫెన్స్ మాత్రమే కాదు..మిమ్మల్ని నమ్మినవాళ్లను ఎలా కాపాడుకోవాలో బాగా తెలుసు..కీపిటప్…అన్నట్టు తర్జనికి కరాటే కాదు కదా కనీసం కరాటే కు స్పెల్లింగ్ కూడా తెలియదు…ఆఫ్ కోర్స్ ..మీరే తర్జని కదూ..మీకు బాగా తెలిసి వుండాలే..అదే తర్జనికి కరాటే రాదు అన్న విషయం ..ఓకే సీయూ “అంటూ అక్కడి నుంచి బయటకు నడిచాడు.
***
అనిరుద్ర వెళ్లిన చాలా సేపటి వరకూ సమీర్ తేరుకోలేదు.అతనికి కలలా ఉంది.ఇలాంటి సంఘటనలు దృశ్యాలుగా సినిమాల్లో చూసాడు.కానీ ఇక్కడ…?
“సిబిఐ కి మన మీద అనుమానం కలిగింది కదూ”అన్నాడు సమీర్.
“అనుమానం కాదు…నమ్మకం కలిగింది..నేను ఎర్విక్ ను అన్న నమ్మకం కలిగింది “చెప్పింది ఎర్విక్.
“అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు?
“నిన్న అతను లండన్ టూర్ లో వున్న మా ఫ్రెండ్ కాథరిన్ కు ఫోన్ చేసాడు..నేను ఎప్పుడు ఇండియా వచ్చానో కన్ఫర్మ్ చేసుకున్నాడు.అంతే కాదు ఎయిర్ పోర్ట్ లో పాసెంజర్స్ లిస్ట్ ను చెక్ చేసాడు…నన్ను ఐడెంటీఫై చేయడం సిబిఐ లో అనిరుద్ర లాంటి ఆఫీసర్ కు పెద్ద కష్టం కాదు.”చెప్పింది ఎర్విక్.
“అంటే అనిరుద్ర గురించి…”
“నెట్ నుంచే కాదు నాకు తెలిసిన సోర్స్ నుంచి కూడా తెలుసుకున్నాను.ఢిల్లీ పేలుళ్ల కేసులో ప్రత్యేకంగా నియమించబడిని సిట్ ఆఫీసర్..సిన్సియర్ ఆఫీసర్ అతను “ఎర్విక్ చెప్పింది.
సమీర్ ఎర్విక్ వైపే చూస్తున్నాడు.”శత్రువును కూడా నిజాయితీగా మెచ్చుకోగల వ్యక్తిత్వం..ఒక పని చేసినప్పుడు …ఆ పని పట్ల తీసుకునే శ్రద్ధ…ముందు చూపు…అందం తెలివి షార్ప్ నెస్ వున్న ఎర్విక్ ను చూస్తుంటే “ఈ అమ్మాయి తనకు దగ్గరైన అమ్మాయా?”అని గర్వంగా ఉంది…చిన్న సందేహం కూడా కలుగుతుంది.
ఎర్విక్ ఇదేమీ ఆలోచించకుండా చెప్పింది..
“మనకు టైం లేదు…ఇప్పుడు మనకు శత్రువు అయిన విక్కీ నుంచి మాత్రమే కాదు…
చట్టానికి మిత్రుడైన అనిరుద్ర నుంచి కూడా ప్రమాదం పొంచి ఉంది.
ఈ రోజే ముఖర్జీ చాఫ్టర్ క్లోజ్ చేయబోతున్నాం”చెప్పింది స్థిరంగా…
***
కారు డ్రైవింగ్ చేస్తోన్న అనిరుద్ర ఆ మాటలు స్పష్టంగా విన్నాడు…రావి ఇంటికి వెళ్ళినప్పుడు మాట్లాడుతూనే ఫ్లవర్ వాజ్ లో అతి శక్తి వంతమైన మైక్ ను పెట్టాడు.
                                                    ***
(డెత్ సెంటెన్స్ లో చిన్న బ్రేక్)
to be continued
నిజాల నీడల్లో కనిపించే వికృత క్రీడలు …
మాటల వెనుక వ్యంగం కత్తితో గాయం చేసినట్టు .
సంస్కారం చచ్చి, వ్యక్తిత్వం చెదపట్టి..
మానవతా విలువలు వలువలు కోల్పోతే .. .
మనుష్యులను స్కాన్ చేసి ,
మనుష్యుల్లోని వికృత రూపాలను
అక్షరాల్లో విజువలైజ్ చేసే మోస్ట్ వాంటెడ్ ఫీచర్

వండర్ ఫుల్ రైటర్ తేజారాణి తిరునగరి …

షేడ్స్
*ఇది వ్యక్తులను ఉద్దేశించి రాస్తున్న ఫీచర్ కాదు …మంచితనం ముసుగులో వున్న వికృత మనస్తత్వాలకు చేస్తోన్న పోస్ట్ మార్టం అతి త్వరలో

NO COMMENTS

LEAVE A REPLY