స్మార్ట్ రైటర్ సురేంద్ర క్షిపణి 17-07-2016

                                                     68

“ఇంతకూ నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావో చెప్పలేదు?” అగస్త్య నుండి సమాధానం రాకపోయేసరికి అసహనంగా అడిగాడు హిమాంషు
“ముందు సత్యమూర్తి ఎక్కడ ఉన్నాడో చూడు” అతని అసహనానికి నవ్వుకుంటూ అన్నాడు అగస్త్య
“నీ టెన్షన్ లో పడి ఆ విషయమే మరిచిపోయాను. థాంక్స్ ఫర్ రిమైన్డింగ్” అంటూ తాను పడ్డ ప్లేస్ కి పరుగు తీశాడు.
సత్యమూర్తి చలనం లేకుండా పడి ఉన్నాడు
“ఈ దెబ్బకు సత్యమూర్తి పోలేదు కదా… ఇతను చస్తే మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే దిక్కెవరు బాబోయ్…” అంటూ బావురుమని ఏడ్చాడు హిమాంషు
అగస్త్య సత్యమూర్తి వద్దకు వచ్చి చెక్ చేశాడు. గుండె చాలా వీక్ గా కొట్టుకుంటోంది. పల్స్ అందడంలేదు
“ఏం చేద్దాం గురూ” ఆందోళనను అణచుకుంటూ అడిగాడు హిమాంషు
అగస్త్య ఏదో చెప్పబోయేంతలో దూరంగా ఏదో శబ్దం వినపడింది.
“మళ్ళీ వచ్చేశారు గురూ… ఇది ఖచ్చితంగా ఆ భూపతి గ్యాంగ్ పనే… గెట్ రెడీ” అంటూ హిమాంషు పెద్ద గుట్ట వైపు పరుగు పెట్టబోయాడు
హడావిడి పడుతున్న హిమాంషును ఆపేశాడు అగస్త్య
“నీకు ఈ మద్య చురుకుదనం బొత్తిగా తగ్గిపోయింది. మన ఎనిమీస్ దగ్గరలో ఉంటే ఈ నిదానం ఏమిటో.. అసలు ఏమనుకుంటున్నావో…” అంటూ అగస్త్య మీద కలబడ్డానికి సిద్దమవుతూ అగస్త్యచూపిన సెల్ చూసి చటుక్కున ఆగిపోయాడు.
అగస్త్య సెల్ లోని గూగుల్ మ్యాప్ లో సాహు వెహికల్ ట్రేస్ అవుతోంది. మ్యాప్ చూస్తే వెహికల్ చాలా దగ్గరలో ఉన్నట్టు చూపుతోంది.
ఖచ్చితంగా 5 నిముషాలకు అగస్త్య సెల్ ఆధారంగా సాహు వెహికల్ అగస్త్య ఉన్న ప్లేస్ చేరింది.
“ఏమైంది బ్రో?” వెహికల్ నుండి కిందకు దూకుతూ అడిగాడు సాహు
హిమాంషు జరిగిన స్టొరీ చెప్పడం ప్రారంభించాడు.
అగస్త్య క్షణం వేస్ట్ చెయ్యకుండా సత్యమూర్తిని వెహికల్ లోకి చేర్చాడు
ఎడారి ఎండకు, భూపతి అటాక్ కు కొనఊపిరితో ఉన్న సత్యమూర్తికి ఫస్ట్ ఎయిడ్ స్టార్ట్ చేశాడు.
“సాహూ.. ఇట్స్ నాట్ సేఫ్ టు స్టే హియర్ ఫర్ లాంగ్…. మనం ఎంత తొందరగా ఇక్కడ నుండి బయలు దేరితే అంత మంచిది” అంటూ అగస్త్య సాహును తొందరపెట్టాడు
సాహు ఆలస్యం చెయ్యకుండా వెహికల్ స్టార్ట్ చేశాడు.
వెహికల్ లో ఉన్న ఏసీ కారణంగా సత్యమూర్తి నాడి రెగ్యులర్ గా కొట్టుకోవడం స్టార్ట్ చేసింది. అగస్త్య ఫస్ట్ ఎయిడ్ తో మరి కాస్త తెప్పరిల్లి మెల్లగా కళ్ళు తెరిచాడు.
అగస్త్య సత్యమూర్తికి చల్లటి నీరు తాగించాడు.
“మీ పట్ల నాకు పూర్తి నమ్మకం కలిగింది… భూపతి చాలా కన్నింగ్. అతడు అంత సామాన్యంగా వదలడు. ముందుగా మనం ఈ ప్రమాదం నుండి బయటపడాలి” సాహును తొందరపెట్టాడు సత్యమూర్తి.
“ఇక ఏ క్షణంలో ఏమి జరుగుతుందో నాకు తెలియదు. నాకు తెలిసిన విషయాలు ఏవీ మిస్ కాకుండా మీకు వివరంగా చెప్తాను” అంటూ చెప్పడం ప్రారంభించాడు సత్యమూర్తి
సాహు డ్రైవ్ చేస్తున్న వెహికల్ గూగుల్ మ్యాప్ ఆధారంగా ఎడారిలో దారిని చూసుకుంటూ గమ్యం వైపు పరుగులు పెట్టింది
***
మిగితా వచ్చేవారం

 

NO COMMENTS

LEAVE A REPLY