భావ కవిత్వం ఎప్పుడు చిరస్థాయిగా ఉంటుంది …డాక్టర్ కత్తిమండ ప్రతాప్

                                    (తేజారాణి తిరునగరి)

డాక్టర్ కత్తిమండ ప్రతాప్
కవితాభిమానులకు చిరపరిచితమైన పేరు.
ఆయన కవిత్వంలో సామాజిక సాంద్రత కన్నీటి చెలమను సృజిస్తుంది.అవార్డులు ఆయన్ని అక్కున చేర్చుకున్నాయి.
కవనమే నా అక్షరానికి ప్రాణం అని చెప్పే డాక్టర్ కత్తిమండ ప్రతాప్ తో నాలుగు మాటలు…
1)కవిత్వానికి సామాజిక ప్రయోజనం అవసరమా?
*ఖచ్చితంగా అవసరం . రచన ఏదైనా కానివ్వండి సామాజిక ప్రయోజనం ఆశించాలి . కవిత్వం ద్వారా సామాజిక స్పృహ కలిగిస్తే ఆ కవిత్వం జీవిస్తుంది .. నిలుస్తోంది
2)భావకవిత్వం మీద మీ అభిప్రాయం ఏమిటి ?
*భావ కవిత్వం ఎప్పుడు చిరస్థాయిగా ఉంటుంది .చెప్పదలచుకున్న అంశాన్ని చక్కగా కవిత్వకరించడమే !
3)కవిత్వం తన ఉనికిని కోల్పోతుందా ?
*లేదు … ఒకప్పుడు కొందరి గుప్పెట్లో ఉండే కవిత్వం ఇప్పుడు అందరి చేతుల్లోకి వచ్చింది . వర్ధమాన కవులు ఎక్కువగా వస్తున్నారు . కవిత్వానికి సంబంధించి కవి సంగమం ఆరభించిన ఫేసు బుక్ కవిత్వం ద్వారా కవిత్వానికి పునాది దొరికింది ఇప్పుడు సోషల్ మీడియా , ఇతర కవిత్వ గ్రూపుల ద్వారా కవిత్వం మరింత ఉనికి పెరిగిందనే చెప్పవచ్చు
4)కవిత్వంలో మీకు ఇష్టమైన ప్రక్రియ ఏది?
*ఇష్టమంటూ ఏమీ లేదండి . రాయాలనుకున్నది రాసెయ్యడమే ! అదే నా శైలి .
అంటూ తన భావాలను అర్థవంతంగా చెప్పే డాక్టర్ కత్తిమండ ప్రతాప్ నుంచి మరెన్నో పురస్కారాలను,అందుకోవాలని ఆకాంక్షిద్దాం.

NO COMMENTS

LEAVE A REPLY