మధుమేహానికి నేరేడుపండుతో చెక్…

చూడగానే నోరూరించే నేరేడు పండు రుచిలోనే కాదు..మధుమేహాన్ని (షుగర్)ని తరిమేయడంలోనూ ముందుంటుందని నిపుణులు చెబుతున్నారు.నేరుడులో విషాన్ని హరించే శక్తి కూడా ఉంటుందని పురాణ వైద్యశాస్త్రంలో విస్తృతంగా వాడేవారూ..ట.
ఆయుర్వేదంలో అమరసంజీవనిగా నేరుడుకు పేరుంది.
నిరుడు పండు కడుపులో వున్న నులిపురుగులను చంపేస్తుందిట…మధుమేహ వ్యాధిగ్రస్తులకు నేరేడు పండు వరప్రసాదిని. నేరేడు పండు గింజలను కాల్చి పొడి చేసిన తరువాత నీటిలో కలిపి తాగితే చక్కర శాతం అదుపులో ఉంటుంది.
మూత్రాశయ సమస్యలు ఉన్న వారికి టానిక్‌లా పని చేస్తుంది. డయేరియాను కూడా నివారిస్తుంది.
నేరేడు ఆకులు కూడా ఔషధ గుణం కలిగి ఉంటాయి. శరీరంలో ఎక్కడైనా గాయమైతే నేరేడు ఆకును గాయంపై ఉంచి కట్టు కడితే నయమైతుంది.
నోటిపూత, చిగుళ్ళవ్యాధులు, దంతక్షయం ఉన్నా నేరేడు ఆకుల రసాన్ని పుక్కిలిస్తే ఉపశమనం పొందవచ్చు.
ఈ సీజన్ లో దొరికే నేరేడు ఆరోగ్యానికి,రుచికి రారాజు…కూల్డ్రింక్స్ పిజ్జాలు బర్గర్లేనా ?
నేరేడు తిని చూడండి..ఆరోగ్యమస్తు…
*ఆరోగ్యానికి పనికి వచ్చే చిట్కాలు విశేషాలు మీరు కూడా పంపించవచ్చు .
మా మెయిల్ ఐడి
manrobocreations@gmail.com

NO COMMENTS

LEAVE A REPLY