రొమాన్స్ ఒక గొప్ప రిలాక్సేషన్…అరగంట సేపు ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తినదానికి సమానం

రొమాన్స్…
రెండు మనస్సుల కలయిక…రెండు శరీరాల మమేకం ఒక గొప్ప ఫీలింగ్…
రొమాన్స్ ఒక గొప్ప రిలాక్సేషన్ శృంగారం…అదో తీయని అనుభవం. మాయా ప్రపంచం. అందులో పాల్గొనడం వల్ల ఇటు మైండ్‌తో పాటు అటు శారీరక తృప్తి కూడా లభిస్తుంది. ఇవన్నీ మనకు తెలిసినవే. అయితే తాజాగా మరో రహస్యాన్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు.
*శృంగారం ఆరోగ్యకరమైన జీవితానికి ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుందని చెబుతున్నారు.
*మైగ్రేన్ నొప్పి మాయం అవుతుంది. ప్రోస్టేట్ కేన్సర్ దరిచేరదు.కానీ శృంగార సమయాన్ని ఓ పదినిమిషాలకి పెంచుకోమని సలహా ఇస్తున్నారు.
ఇలా చేయడం వల్ల పురుషుల్లో సుమారుగా 100 క్యాలరీలు, స్త్రీలలో 69 క్యాలరీలు ఖర్చవుతాయి.
ఇది అరగంట సేపు ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తినదానికి సమానమట. జీవక్రియల తీవ్రత ఆరు రెట్లు పెరుగుతుంది. ఇది 20 నిమిషాలపాటు టెన్నిస్ ఆటకు లేదా 40 నిమిషాల యోగాతో సమానం.
గుండె, ఊపిరితిత్తులు, ఇతర అవయవాలన్నింటికీ ఇదో మంచి కసరత్తని తేలింది. ఎలుకలపై ఈ ప్రయోగం చేసిన అమెరికా శాస్త్రవేత్తలకు ఇంకో విషయం కూడా తెలిసింది.
శృంగారం తర్వాత కొన్ని ఎలుకల మెదడు కణాలు సైతం వృద్ధి అయినట్లు వారు కనుగొన్నారు.
(ఈ శీర్షిక మీద మీ ఫీడ్ బ్యాక్ పంపించండి…చీఫ్ ఎడిటర్)
manrobocreations@gmail.com

NO COMMENTS

LEAVE A REPLY