విదిశ అగస్త్యను మోసం చెయ్యలేక తనలో తానే చాలా మదనపడింది. ఆత్మహత్య ప్రయత్నం చేసింది.స్మార్ట్ రైటర్ సురేంద్ర క్షిపణి 31-07-2016

69
సత్యమూర్తి కంటిన్యూ చేశాడు…
“విదిశ అగస్త్యను మోసం చెయ్యలేక తనలో తానే చాలా మదనపడింది. ఆత్మహత్య ప్రయత్నం చేసింది. కానీ మార్తాండభూపతి తనను ఎల్లవేళలా కనిపెట్టుకుని ఉండేవాడు. విదిశ ప్రయత్నాలను భగ్నం చేశాడు”
“అతనికి ఇంతకూ కావలసింది ఏమిటి?” అడిగాడు హిమాంషు
“విదిశ ముత్తాతగారు మహాదేవుని భక్తుడు. పరమ నిష్టాగరిష్టుడు. ఆయనతో మహాదేవుడు ప్రత్యక్షంగా మాట్లాడేవాడని జనం అనుకునేవారు. కాశీ క్షేత్రాన్ని ఎన్నోసార్లు కాలినడకన దర్శించాడు.”
అందరూ శ్రద్దగా వింటున్నారు.
“ఆయనకు ఆ మహాదేవుడు అరుదైన శివలింగాన్ని బహూకరించారు అని చెప్పుకుంటారు. మహా మహిమాన్వితమైన ఆ శివలింగం ఎక్కడ ఉంటే అక్కడ సిరిసంపదలకు కొదవ ఉండదు. దీర్ఘాయువు ఇచ్చే ఆ శివలింగం ఉంటే సమస్త శుభాలు కలుగుతాయి. దుష్టగ్రహ పీడలు, శని ప్రభావం ఇసుమంతైనా సోకదు. ఆ శివలింగం సహాయంతో గుప్త నిధులు ఎక్కడ ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు. దాన్ని చాలా పవిత్రంగా పూజించాలి. ఏ మాత్రం అశ్రద్ద చేసినా లేక అపవిత్రం చేసినా ఆ వ్యక్తి చేజారిపోతుంది.”
లాండ్ క్రూజర్ ఇసుకలో దూసుకుపోతోంది. అగస్త్య పరిసరాలను అబ్జర్వ్ చేస్తున్నాడు. తన అంచనా ప్రకారం మహేంద్రభూపతి కామ్ గా ఉండే ఛాన్స్ లేదు. తాము తప్పించుకున్న సంగతి ఈ పాటికి అతనికి చేరి ఉంటుంది.
సత్యమూర్తిని వదిలితే కష్టం అని అతనికి తెలుసు.
“ఖలీల్… ఇంకా ఎంత దూరం ఉంది?” అడిగాడు అగస్త్య
ఖలీల్ కూడా ఇదే పాయింట్ ఆలోచిస్తున్నాడు. ముందుగా తాము సేఫ్ ప్లేస్ చేరుకోవాలి. లేదంటే కష్టం.
ఎడారి మద్యలో ఒంటరిగా ఉండే వెహికల్ ను టార్గెట్ చెయ్యడం పెద్ద కష్టం కాదు. పైగా ఆకాశం నుండి ఎటాక్ చేస్తే తిరిగి ఎటాక్ చెయ్యడానికి ఆప్షన్ కూడా ఉండదు.
“మరో 10 మైళ్ళు పొతే మా నేటివ్ ప్లేస్ వస్తుంది. అక్కడకు చేరితే కాని మనం సేఫ్ కాదు బ్రో…” అగస్త్య అంతరంగాన్ని పసిగట్టిన ఖలీల్ చెప్పాడు.
“నేను డ్రైవ్ చేస్తా…” సాహు స్టీరింగ్ అందుకుంటూ అన్నాడు.
ఆ మాటతో అందరికి కాస్త రిలీఫ్ కలిగింది.
సాహు డ్రైవర్ గా ఉన్నప్పుడు అతని టాలెంట్ చూశారు. అతనిలా డ్రైవ్ చెయ్యడం సాధ్యం కాదు.
వెహికల్ లో ఉన్నవారికి ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా అతి వేగంగా నడపడం సాహుకు వెన్నతో పెట్టిన విద్య.
సాహు స్టీరింగ్ మీద చెయ్యి వెయ్యగానే వెహికల్ చిరుతలా ముందుకు దూకింది.
అదే సమయంలో దూరంగా ఏదో చెప్పుడు వినిపించింది.
“బ్రో! మనల్ని పలకరించడానికి ఫ్రండ్స్ వస్తున్నారు…” నవ్వుతూ చెప్పాడు సాహు.
అగస్త్య ఆల్రెడీ సౌండ్ వచ్చిన దిక్కుగా చూస్తున్నాడు.
అదే సమయంలో వెనుక వైపు నుండి ఆకాశంలో ఏదో శబ్దం విన్పించింది
“గైస్… మన ఫ్రెండ్స్ ఈ సారి పెద్ద బలగంతో వస్తున్నారు. గెట్ రెడీ..” అంటూ డాష్ బోర్డ్ లో ఉన్న గన్ అందుకున్నాడు.
ఖలీల్ బ్యాక్ సీట్లో ఉన్న బ్యాగ్ ను ముందుకు లాగాడు. జిప్ ఓపెన్ చెయ్యగానే తమకు కావలసిన ఆటోమేటిక్ వెపన్స్ కనిపించాయి.
హిమాంషు ఉత్సాహంగా తనకు కావలసిన వెపెన్స్ అందుకున్నాడు.
సాహు వెహికల్ ను ఫుల్ స్పీడ్ లో దూకించాడు…
ఎగ్జాక్ట్ గా రెండు నిముషాల తరువాత లీలగా కొన్ని వెహికల్స్ కనపడ్డాయి.
ఎడారిలో వాడే మోటార్ బైక్స్, టయోటా వెహికల్స్ దుమ్ము రేపుకుంటూ వస్తున్నాయి.
హిమాంషు వెనుక వైపు చూశాడు.
ఆకాశంలో సింగల్ సీటర్ విమానం పొగలు కక్కుతూ తమ వెహికల్ వైపు దూసుకు వస్తూ కనిపించింది.
“అందరూ ఒక్కసారే దాడి చెయ్యడానికి వచ్చినట్టు ఉన్నారు బ్రోస్” ఉత్సాహంగా అన్నాడు హిమాంషు..
***

(ఈ సస్పెన్స్ వచ్చేవారం వరకూ)
స్మార్ట్ రైటర్ సురేంద్ర రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

http://kinige.com/ksearch.php?searchfor=surendra

 

NO COMMENTS

LEAVE A REPLY