మనకు ప్రతీదీ నిర్లక్ష్యమే…అక్కడ కిండర్‌జాయ్‌ బ్యాన్…ఎందుకంటే…?

మనకు ప్రతీదీ నిర్లక్ష్యమే…చాలా సందర్భాల్లో మనం చాలా మందంగా ఉంటాం.కొన్ని రకాల కూల్ డ్రింక్స్ తుప్పు పట్టిన ఇనుమును క్లీన్ చేయడానికి వాడుతారని చెప్పినా,మీడియాలో వచ్చినా తాగేస్తాం.రోడ్డు పక్కన తయారయ్యే నూడుల్స్,చికెన్ సిక్స్టీ ఫైవ్ లాంటివి వాడిపారేసిన నూనెను మళ్ళీ మళ్ళీ కూడా వాడుతారని తెలిసినా తింటాం.కానీ అమెరికాలో పిల్లలు ఇష్టంగా తినే కిండర్‌ జాయ్‌ను నిషేధించారు.
ఎందుకో తెలుసా?. .
కిండర్‌జాయ్‌లో చాక్లెట్‌తో పాటు ఓ ప్లాస్టిక్‌ బొమ్మ వస్తుంది కదా ఆ ప్లాస్టిక్‌ బొమ్మని పిల్లలు చాక్లెట్‌ అనుకుని తినే ప్రమాదం ఉందని భావించిన అమెరికా అధికారులు బాలల ఆహారభద్రత నిమిత్తం దాన్ని నిషేధించారు.కిండర్‌జాయ్‌ని మన వెంట తీసుకెళ్ళడాన్ని, తినడాన్ని కూడా ఒప్పుకోరట..

ఇలాంటి భద్రతా ప్రమాణాలు మనవాళ్ళు కూడా అమలు చేస్తే బావుంటుంది కదా…?
పిల్లలను ఆకర్షించడానికి ఉత్పత్తిదారులు ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తారు.ప్లాస్టిక్ బొమ్మ కోసం పిల్లలుకిండర్‌జాయ్‌ కావాలని మారాం చేస్తారు.పేరెంట్స్ కూడా ఈ విషయంలో ఆలోచించాలి.
ఈ కథనంపై మీ అభిప్రాయాలు తెలియజేయవచ్చు…

about manrobo

http://manrobo.com/?page_id=87

NO COMMENTS

LEAVE A REPLY