ఒక వ్యక్తి తన ప్రస్థానంలో ఎదుర్కున్న సక్సెస్ లు ఫెయిల్యూర్స్.. కష్టాలు సుఖాలు కంటతడి పెట్టించిన సంఘటనలు…

రచయిత్రి మాట …

డాక్టర్ కృష్ణ పుట్టపర్తి …Penukonda To Dallas 
ఒక చిన్న ప్రకంపనం
ఒక చిన్న ఉద్వేగం
ఒక చిన్న భయం …
ఇది కలా?నిజమా?
రెండు సంవత్సరాల క్రితం అప్పుడే మొదలుపెట్టిన అక్షర ప్రయాణంలో ,అతి తక్కువ సమయంలో ఒక పెద్ద మజిలీని ఇంత తక్కువ వ్యవధిలో చేరుకోగలిగానా…?అన్న చిన్న సంశయం….?
కొన్నేళ్ల క్రితం క్యాన్సర్ నన్ను ఎటాక్ చేసినప్పుడు భయాందోళన…చిగురుటాకులా వణికిపోయాను. క్యాన్సర్ కు ట్రీట్మెంట్…రేడియో థెరపీ.కీమో థెరపీ నా శరీరాన్ని రేడియేషన్ తో నింపేసి.మరణానికి కాసింత దూరంలో ఉన్నాననే భయాన్ని కలిగించి క్యాన్సర్ వెళ్ళిపోయింది..
ఆ భయం
నాలోని భయం …
ఇతరులకు ధైర్యం చెప్పడానికి ఉపయోగపడాలని ఆలోచనతో “నేను క్యాన్సర్ ని జయించాను”రాసాను.
అది నా తొలి ధారావాహక…
నేను క్యాన్సర్ పేషంట్ గా అనుభవించిన కష్టాలు,వేదనలు,భయాలు…అన్నీ చెప్పాను …
క్యాన్సర్ ని ఎదురించడానికి ట్రీట్మెంట్ తో పాటు మనలోని ఆత్మవిశ్వసం కూడా ఒక చికిత్సేనని…గ్రహించాను…
“క్యాన్సర్ ని జయించండి “పుస్తకం చదివాకా కలిగిన స్ఫూర్తితో క్యాన్సర్ ఎవెర్ నెస్ లో నేనూభాగస్వామిని కావాలన్న చిన్న స్వార్థంతో రాసిన ఆ పుస్తకాన్ని మీరు ఆదరించారు.
ఆ తర్వాత రాసిన “అనగనగా ఒక మనస్సు కథ”ప్రతీ మనసున్న మనిషిలోని మనస్సు కథలే …
డెత్ సెంటెన్స్
మొదటిసారి సాహసించి రాసిన ఫిక్షన్..క్రైమ్ సస్పెన్స్ ,పెరుగుతోన్న క్రైమ్ రేటింగ్,అమ్మాయిల కిడ్నాప్స్..అనుబంధాలు లాంటి అంశాలతో రాసిన ఈ నవలను మేన్ రోబో పాఠకులు ఆదరించారు.
ఒక మంచి రచనకు పాపులార్టీతో సంబంధం లేదని నిరూపించారు.
ఆ ధైర్యంతోనే..
మీరిచ్చిన ఆ స్ఫూర్తితోనే…
ఇప్పుడీ ధారావాహిక రాస్తున్నాను…
ఇందుకు మొదటగా నేను కృతఙ్ఞతలు చెప్పుకోవలిసిన వ్యక్తి ….
కృష్ణ పుట్టపర్తిగారు.
“నేను మీ గురించి రాద్దామని అనుకుంటున్నాను…అని చెప్పగానే…:నేనేం సాధించానని…”వినమ్రంగా అన్న గొప్పవ్యక్తి…
చాలా సంవత్సరాల క్రిందటే…పెనుకొండ అనే ఒక చిన్న వూరు నించి డల్లాస్ వెళ్లి అక్కడ తానేమిటో,తన ప్రతిభ ఏమిటో చూపించిన వ్యక్తి…
న రంగంలో అగ్రస్థానంలో వున్న వ్యక్తి
పద్మశ్రీ అక్కినేని మొదలు
కళాతపస్వి విశ్వనాథ్
మహానటుడు కమల్ హాసన్
సుప్రసిద్ధ కన్నడ నటుడు గిరీష్ కర్నాడ్ ..లాంటి ప్రముఖులతో పరిచయాలు.
ఎన్నో చారిటీస్ కు సహాయం…మానవత్వానికి చేయూతనిచ్చే సంస్కారం…
ఇలా చెప్పుకుంటూ పొతే..ఒక మహా గ్రంథమే అవుతుంది…
ఒక వ్యక్తి అత్యున్నత స్థానానికి చేరుకోవడానికి పడిన శ్రమ…
ఎందరికో ఆదర్శం..స్ఫూర్తిమంతం అవుతుంది.
అందుకే….ఒక వ్యక్తి విజయగాథ..ఒక వ్యక్తి తన ప్రస్థానంలో ఎదుర్కున్న సక్సెస్ లు ఫెయిల్యూర్స్..
కష్టాలు సుఖాలు కంటతడి పెట్టించిన సంఘటనలు…
ఇతరులకు స్ఫూర్తిగా ఉండాలనే ఆలోచనతో నేను చేస్తోన్న ఈ ప్రయత్నానికి “తన జీవితంలోని సంఘటనలు,అనుభవాలు అక్షరబద్దం చేసే ప్రయత్నానికి అంగీకరించి అడిగిన వెంటనే తన విలువైన సమయాన్ని కేటాయించిన ”
” కృష్ణ పుట్టపర్తి” గారికి…కృతఙ్ఞతలు.
థాంక్యూ సర్..
సీరియల్ లక్షలాది పాఠకులకు చేరడానికి ,నా ప్రయత్నాన్ని నమ్మి ఈ సీరియల్ రాసే అవకాశం ఇచ్చిన మేన్ రోబో కు జీవితాంతం రుణపడి వుంటాను.
నేను రచయిత్రిగా పుట్టింది మేన్ రోబోతోనే…
ఈ రోజు నాకు వచ్చిన పేరు మేన్ రోబో వల్లనే…
థాంక్యూ మేన్ రోబో…
…తేజారాణి తిరునగరి
తేజారాణి తిరునగరి రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి…

http://kinige.com/ksearch.php?searchfor=tejarani

వచ్చేవారమే
ప్రారంభానికి ముందు…

ఈ కథనం మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…
…చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY