ప్రేక్షకులను తన నృత్యాలతో సమ్మోహనపర్చిన జ్యోతిలక్ష్మి ఇకలేరు.

చెన్నై;ఆమె అడుగు కదిలితే కుర్రకారు గుండెలయ తప్పుతుంది.హుషారెక్కించే నృత్యాలకు చిరునామా,కేవలం నృత్యాలకే కాదు యాక్షన్ సినిమాల్లోనూ తన ఐడెంటీటీని ప్రూవ్ చేసుకున్ననటి.అరవైదాటినా తనలో ఆ హుషారు తగ్గలేదని చెప్పగలిగే జ్యోతిలక్ష్మి ఇకలేరు.
కౌబాయ్ సినిమాల్లో ఆమె తుపాకీ పడితే ప్రేక్షకులు ఈలలు వేసేవారు.క్లబ్ సాంగ్స్ లో ఆమె డాన్స్ చేస్తే తెర మీద కాగితాల వర్షం.
మనం ఐటెం సాంగ్ అని పిలుచుకునే సాంగ్స్ జ్యోతిలక్మి 1970 ల్లోనే చేసింది.
జ్యోతిలక్ష్మి ఐదేళ్ళ వయసులోనే సినీరంగ ప్రవేశం చేసింది.
1967లో విడుదలైన పెద్దక్కయ్య అనే సినిమాతో జ్యోతిలక్ష్మి కెరీర్ ప్రారంభమైంది.
ఇదాలోకం, మోసగాళ్లకు మోసగాడు, గండరగండడు, పిల్లాపిడుగా, గంధర్వ కన్య తదితర చిత్రాల్లో నటించింది.జ్యోతిలక్మి సినిమా కోసమే సినిమాకు వెళ్లే ప్రేక్షకులు ఉండేవారు.
జ్యోతిలక్ష్మి మృతికి మేన్ రోబో నివాళి తెలియజేస్తుంది.. పాఠకుల కోసం జ్యోతిలక్ష్మి ఛాయాచిత్రమాలికను స్లైడర్ షో గా అందిస్తున్నాం.

ఈ కథనం మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…
…చీఫ్ ఎడిటర్
మేన్ రోబో నివాళి

NO COMMENTS

LEAVE A REPLY