ఇది ఒక వ్యక్తి శక్తిగా ఎదిగిన వైనం ఇది ఒక వ్యక్తి వ్యవస్థగా ఎదిగిన నేపథ్యం…డాక్టర్ కృష్ణ పుట్టపర్తి …(14-08-2016)

ప్రారంభానికి ముందు…

black
మేన్ రోబో ఎన్నారై స్టోరీస్ ను ” డాక్టర్ కృష్ణ పుట్టపర్తి …Penukonda To Dallas “తో ప్రారంభిస్తున్నాం.
వ్యక్తిత్వ వికాస ధారావాహికలు,ఫిక్షన్,నాన్ ఫిక్షన్…వీటికి ఇంకొంత కాస్త భిన్నంగా,విభిన్నంగా ఈ సీరియల్ ను మీకు అందించే ప్రయత్నానికి ఇది శుభారంభం.
విదేశాల్లో ఇలాంటి పుస్తకరచనలు కొత్తకాదు.ప్రముఖుల జీవితాల్లోని ఆసక్తికరమైన,ఉపయోగకరమైన,స్ఫూర్తికరమైన అంశాలతో,సంఘటనలతో తమ స్వీయకథనాన్ని పుస్తకరూపంలో విడుదల చేయడం సాధారణ విషయం.
అలాగే ఒక సెలబ్రిటీ మరో సెలబ్రిటీ గురించి రాయడం కూడా ఆనవాయితీగా వస్తూనే వుంది.ఇది ఒక ఆరోగ్యకరమైన పరిణామం.
వృత్తిపరమైన బిజీ కావచ్చు,తమ భావాలను చెప్పడానికి ప్రతీ సెలబ్రిటీ రచయిత కాలేకపోవచ్చు.అయితే జీవితంలో జీరో స్థాయి లేదా..ఒక సాధారణ స్థాయి నుంచి సెలబ్రిటీ స్థాయికి ఎదిగిన వ్యక్తి కథనం ఆసక్తికరమే కాదు…స్ఫూర్తిని కలిగించేలా కూడా ఉంటుందన్నది చరిత్ర చెప్పే వాస్తవం.అంతే కాదు ఇలాంటి పుస్తకాల అవసరం కూడా వుంది.
ఒక ఫిక్షన్ కాలక్షేపాన్ని అందిస్తుంది.
ఒక వార్తాకథనం విశేషాలు వర్తమాన పరిస్థితులు తెలియజేస్తుంది.
ఒక వ్యక్తిత్వ వికాసపుస్తకం గైడ్ చేస్తుంది.
ఒక వ్యక్తి విజయగాథ ..ఒక వ్యక్తి తన జీవితంలో సాధించిన విజయాలు..ఎదుర్కున్న వైఫల్యాలు…మర్చిపోలేని సంఘటనలు..కష్టాలు కన్నీళ్లు…జీవితంలో ఎదిగిన వైనాలు…ప్రత్యక్ష ప్రేరణ కలిగించే విజయసూత్రాలు అవుతాయి.
ఎక్కడో అబ్రహం లింకన్ పడ్డ కష్టాలు
ఆత్మస్థయిర్యంతో విదేశాల్లో విజయాలు సాధించిన ప్రముఖుల జీవితాల్లోని సంఘటనలు మాత్రమే కాదు…
మన కళ్ళ ముందు
మన దేశంలో..
మన రాష్ట్రంలో..
మన నగరంలో..వున్న మనవాళ్ళు
మనతో పాటు వున్న వ్యక్తి,
మనతో మాట్లాడుతోన్న వ్యక్తి…
సాధించిన విజయాలు,అంచెలంచెలుగా ఎదిగిన నేపథ్యాలు…ఆ క్రమంలో ఎదురుకున్న ఎన్నో ఎన్నెన్నో ఆటుపోట్లు…ఈ తరానికి,ఒక ఉదాహరణగా…ఒక అక్షరసత్యంగా నిలుస్తుంది.వారిని ముందుకు నడిపిస్తుంది.
ఒక వ్యక్తి చదువు కోసమో.ఉద్యోగం కోసమో వేరే దేశానికి వెళ్లాల్సి వస్తే..అక్కడి పరిస్థితులు.సంప్రదాయాలు,మనం బ్రతకడానికి కావాల్సిన డబ్బు సమకూర్చుకోవడం..ఎలా?
ఒక వ్యక్తి తన అనుభవాలను అక్షర కథనంగా అందిస్తే..ఆ అక్షరాలు పుస్తకంగా..ఒక గైడ్ లా…దారి చూపే భగవద్గీతే అవుతుంది..
ఇది సత్యం..ఇది తథ్యం..ఇదే అక్షర సత్యం…
పాతికేళ్ల క్రితం కట్టుబట్టలతో.భవిష్యత్తు మీద ఆశతో,తన వాళ్ళను ఉన్నత స్థానాల్లో చూడాలన్న శ్వాసతో జీవితంలో ఏదైనా సాధించాలన్న పట్టుదలతో వెళ్లి…క్షణాలను లెక్కిస్తూ.ప్రతీ క్షణం శ్రమిస్తూ…సాగించే తపస్సు…లక్ష్యాన్ని చేరుకోవాలనే తపన…అక్షరాల్లోకి అనువదిస్తే…
డాక్టర్ కృష్ణ పుట్టపర్తి …Penukonda To Dallas
ఒక సాధారణ వ్యక్తిగా ఆకాశంలో పయనించి జీవన పోరాటాన్ని మొదలు పెట్టిన డాక్టర్ కృష్ణ పుట్టపర్తి..
ఈ రోజు డల్లాస్ లో ఒక సెలబ్రిటీ…
భారతదేశం గర్వించే ప్రముఖులతో,వారి సరసన చేరిన ప్రవాస భారతీయుడు…
సుప్రసిద్ధ వైద్యులు…
సామాజికసేవ పట్ల ఆసక్తి,,మానవత్వాన్ని ప్రేమించే కమిట్మెంట్..అన్నింటికీ మించి హ్యుమానిటీ…ఈ క్వాలిటీస్ ను అక్షరాల్లోకి అనువదించే ప్రయత్నమే ఈ ధారావాహిక.


తాను క్యాన్సర్ బారిన పడి,మరణం అంచులవరకూ వెళ్లి..క్యాన్సర్ ని జయించి,తన స్వీయ అనుభవాలను “నేను క్యాన్సర్ ని జయించాను “ధారావాహికగా రాసి తనలా క్యాన్సర్ బారిన పడేవారికి ధైర్యాన్ని చెప్పే ప్రయత్నం చేసారు తేజారాణి తిరునగరి.
అనగనగా ఒక మనస్సు కథ,డెత్ సెంటీన్స్ సీరియల్స్ ద్వారా తనలోని ప్రతిభను పాఠకలోకం గుర్తించే స్థాయికి చేరుకున్నారు.
ప్రతిభ వున్న రచయితలను మేన్ రోబో ఎప్పుడో ప్రోత్సహిస్తుంది.
మూడు సీరియల్స్ తోనే “వండర్ ఫుల్ రైటర్ గా” గుర్తింపు పొందిన తేజారాణి తిరునగరి అక్షర కథనంతో ..
డాక్టర్ కృష్ణ పుట్టపర్తి …Penukonda To Dallas
సీరియల్ ప్రారంభం వచ్చే సంచికలోనే…
ప్రతీ ఆదివారం…మిమ్మల్ని పలకరిస్తుంది.

tejup
ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY