వండర్ ఫుల్ రైటర్ తేజారాణి తిరునగరి సీరియల్ డెత్ సెంటెన్స్ (15-05-2016)

ఒక నేరం జరిగినప్పుడు ఆ నేరం వెనుక వున్న మనుష్యలు బయటకు వస్తారు…
ఆ నేరాన్ని భూస్థాపితం చేయాలనీ…
ఒక నేరం జరిగినప్పుడు ఆ నేరం మూలాలను శోధించి ఆ నేరానికి కారణమయ్యేవారిని చట్టం ముందు నిలబెట్టడానికి …
పోలీసులు కర్తవ్యన్మోఖులు అవుతారు.
ఇక్కడ నేరానికి కారణమైన వ్యక్తుల్లో ఒకరు .ఆ నేరాన్ని శోధించి నేరస్తులను చట్టం ముందు నిలబెట్టవలిసిన పోలీసు అధికారి ముఖర్జీ కావడం  పోలీసు శాఖలో అక్కడక్కడ వున్న చెదకు నిదర్శనం.
అందుకే శర్మగారి లాంటి వాళ్ళు పోలీసు శాఖలో తులసి మొక్కల్లా వున్నారు.
నీలిమ డెడ్ బాడీ ని పోస్ట్ మార్టం చేస్తే బయటకు వచ్చే నేరస్థుల్లో ఇన్స్పెక్టర్ ముఖర్జీ కూడా వున్నాడు..చట్టాన్నిమకిలపర్చి,విక్కీ  లాంటి వాళ్ళతో కరచాలనం చేసిన ముఖర్జీ ఇప్పుడు నీలిమ డెడ్ బాడీ ని మాయం చేసే పనిలో వున్నాడు.
హాస్పిటల్ కు తను వెళ్ళకుండా విక్కీ మనిషి కరీం ను పంపించాడు. కరీం చిన్న దొమ్మీ కేసులో ఇన్స్పెక్టర్ ముఖర్జీ పరిధిలో వున్న పోలీసు స్టేషన్ లో వున్నాడు.
అతడిని కావాలనే దొమ్మీ కేసులో ముఖర్జీ అరెస్ట్ చేసి ఎఫ్ ఐ ఆర్ ఫైల్ చేసాడు ఎలిబీ కోసం.
ఇప్పుడు తనే అతడిని బయటకు తీసుకువచ్చాడు…స్టాఫ్ ను బయటకు పంపించి…
ముఖర్జీ చేసిన ఒకే ఒక పొరపాటు…ఏమిటంటే అతను శర్మ గారిని విస్మరించడం.
శర్మగారు ఈ విషయాన్ని సిబీఐ చేరవేసాడు.
అనిరుద్ర మీద హత్యాయత్నానికి ,శర్మగారి వాట్సప్ సందేశానికి వున్న లింక్ ఇక్కడే మొదలైంది.
అనిరుద్ర మీద హత్య యత్నం వార్త రావడంతోనే మీడియా ఎలర్ట్ అయ్యింది.చీమ దూరే వార్తని సైతం ఏనుగు దూరేలా చేయల అత్యుత్సాహ మీడియా ఇలాంటి హాట్ ను బ్రేకప్ లతో వదిలిపెట్టకుండా లైవ్ లతో క్యూరియాసిటి పెంచేసింది.అనిరుద్రను పథకం ప్రకారమే ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అక్కడ ఓబి వ్యాన్లు ట్రాఫిక్ జామ్ దృశ్యాన్ని తలపిస్తూ కనిపించాయి.
ఇదంతా అనిరుద్ర మైండ్ గేమ్ .
ఎప్పుడైతే అనిరుద్ర హాస్పిటల్ లో జాయిన్  అయ్యాడో బందోబస్తు పెరిగింది.
మీడియా నుంచి  మరింత హడావుడి మొదలైంది.
అక్కడే నీలిమ బాడీకి పోస్ట్ మార్టం..
ఇలాంటి సమయంలో  ఏమి చేయలేని పరిస్థితి.అప్పటికే కరీం హాస్పిటల్ కు బయల్దేరాడు.అది మాత్రమే కాకుండా అక్కడ బందోబస్తు డ్యూటీ లో సీ ఐ ముఖర్జీ ఉండక తప్పలేదు.
ఇదంతా ఒక పథకం ప్రకారం వేయబడ్డ స్కెచ్ అని  అర్థమయ్యేలోగా మరో ఉపద్రవం సునామీలా చుట్టేసింది.
స్నేక్ గ్యాంగ్ ను పోలిన దారుణాలు చేసిన కరీం ముఖర్జీ ప్రాపకంతో.విక్కీ పొలిటికల్ పవర్ తో నెట్టుకు వచ్చాడు.
తర్జనిని యాక్సిడెంట్ చేసి చంపిన కేసులో కరీం హస్తం వుందని ఎర్విక్ కు తెలిసింది.
దాంతో కరీం మీద దృష్టి పెట్టింది.
కొన్ని గంటల వ్యవధిలోనే కరీం క్రిమినల్ హిస్టరీ బయటకు వచ్చింది.
కరీం ఒంటరిగా హాస్పిటల్ కు  బయల్దేరాడు.నంబర్ ప్లేట్ లేని కారు. పోలీసు స్టేషన్ కు హాస్పిటల్ కు వెళ్ళేదారిలో మధ్యన ఓ బస్సు స్టాప్ లో ఎర్విక్ వుంది.
ముఖానికి మాస్క్ లాంటి వేసుకుని కారు డ్రైవ్ చేస్తోన్న కరీం కు బస్సు స్టాప్ లో ఒంటరిగా వున్న ఎర్విక్ కనిపించింది.ఆడగాలి సోకడంతో వచ్చినపని మర్చిపోయాడు.తనలోని పైశాచికానికి పని చెప్పాడు.అతని కాళ్ళ దగ్గర చిన్న బుట్ట వుంది.అందులో కోరల్లో విషం నింపుకున్న పామువుంది.పాము విషం కన్నా ప్రమాదకరమైన అతని శాడిజానికి ఈ పామును ఎరగా వాడుతుంటాడు.
పాములతో బెదిరించి అమ్మాయిలను దారుణంగా హింసించి అత్యాచారం చేసి చంపుతాడు.
కరీం కారు ఎర్విక్ నిలబడ్డ చోటికి రివర్స్ లో వచ్చి ఆగింది.అతని కుడిచేతిలో పాము..కాటు వేయడానికి సిద్ధం అన్నట్టు…
(డెత్ సెంటెన్స్ లో చిన్న బ్రేక్)

NO COMMENTS

LEAVE A REPLY