కోరిక పుట్టినప్పుడు భర్తలకు మాత్రమే ఆ సుఖం అవసరమా?భార్యలకు కోరికలు ఉండవా?వుండకూడదా ?ఈ మగాళ్లు మారారా?

“ప్రతీ రాత్రి నా దృష్టిలో గడిచిపోయినా ఒక రోజు మాత్రమే…కానీ ఆ రోజు నేను మిస్సయిన ఫీలింగ్స్..నేను కోల్పోయిన ఫిజికల్ టచ్ నన్ను జాలిగా చూస్తోంటే భరించలేకపోతున్నాను…ఒక్కోసారి చచ్చిపోవాలని అనిపిస్తుంది.విశాలమైన మంచం మీద నేను …తను…

“మా ఇద్దరి మధ్య మరో ఇద్దరు పడుకోవడానికి సరిపడా స్థలం…దూరం మా శరీరాలకు మాత్రమే కాదు..మనస్సులకు కూడా అని నాకు అర్థమవడానికి…పట్టిన సమయం..పదేళ్లు…నేను కోల్పోయిన రాత్రుళ్ళు కొన్ని వందలు…”
జీవితమంటే సెక్సేనా?అని నిలదీసేవారు..సెక్స్ లేకుండా ఈ సృష్టి లేదనే నిజాన్ని ఒప్పుకోరా?
పెళ్లయ్యాక ఆ సుఖం ..పచ్చిగా చెప్పాలంటే ఎడిట్ ..ఎడిట్… ఎడిట్…కోరిక పుట్టినప్పుడు భర్తలకు మాత్రమే ఆ సుఖం అవసరమా?భార్యలకు కోరికలు ఉండవా?వుండకూడదా ?
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేవారెవరు?
రొమాంటిక్ ఫ్లేవర్ లో …ఒకమ్మాయి నిలదీసి నిగ్గదీసి నిప్పుతో కడిగేయమని చెప్పిన ఓపెన్ హార్ట్ సర్జరీ
ఈ మగాళ్లు మారారా?

మేన్ రోబో రొమాంటిక్ ఫ్లేవర్ లో …

romantic flavour

త్వరలో …

మీకు తెలుసా?

జీవితంలో శృంగారానికి ముసుగేసి,శృంగారం గురించి తెలుసుకోవడం ఇబ్బందిగా భావించేవారు ఆ భావం నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిదని సర్వేకారులు చెబుతున్న నిష్ఠురసత్యం.శృంగారానికి దోహదం చేసే ఆహారం గురించి మీకు తెలుసా…ఓ సారి ఈ క్రిందివిషయాల మీద ఓ లుక్కేయండి.
మంచి ఆహారంతో శృంగార సామర్థ్యం పెరుగుతుంది
*స్ట్రాబెరీస్‌లో యాంటీఆక్సిడెంట్లు (విటమిన్‌ సీ కూడా దీని ద్వారా లభిస్తుంది)పురుషుల్లో వీర్య సామర్ధ్యాన్ని కూడా స్ట్రాబెరీస్‌ పెంచుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
*గ్లాస్ వైన్ తాగితే కిక్కిచ్చి రిలాక్స్ ఇస్తుందేమో కానీ అదే డ్యూటీగా (పనిగా)తాగితే శృంగార సామర్థ్యం తగ్గిపోతుందని ఓ సర్వేలో తేలింది.
*జీడిపప్పు, రత్నపురి గడ్డ(కందగడ్డ లేదా స్వీట్ పొటాటో ), నువ్వులు, పుచ్చ కాయలు వంటివి శృంగార జీవితానికి మేలు చేస్తుండగా, మాంసం, నూనె పదార్థాలు వంటివి రతిక్రీడకు చేటు చేస్తాయని శాస్త్రవేత్తలు నొక్కి వక్కాణిస్తున్నారు.
అన్నింటికన్నా శృంగారం జీవితంలో అతి ముఖ్యమైన అధ్యాయం అనే విషయాన్నీ గుర్తుంచుకోవాలి.
రొమాన్స్ తరువాత మీలో కనిపించే మార్పును మీరెప్పుడైనా గమనించారా?రొమాన్స్ (సెక్స్)గొప్ప రిలాక్సేషన్ ..అన్న విషయాన్నీ మర్చిపోకూడదు.

NO COMMENTS

LEAVE A REPLY