అదేపనిగా కూచుంటే మీ గుండెపని తీరు ప్రమాదంలో పడిపోతుంది…ఇంకా ….

అదేపనిగా కూర్చుంటున్నారా?అయితే ఈ ప్రమాదం పొంచి వుంది…
కంప్యూటర్ ముందు కూచోని పనిచేసేవారు…డైలీ సీరియల్స్ చూస్తూ అదే పనిగా కదలకుండా ఉండేవారు…ఆలోచించవలిసిన విషయం.
కొన్ని ఉద్యోగాలు ఎప్పుడూ కూచోనే పనిచేయాలి.అయితే అలా అదేపనిగా కూచుంటే మీ గుండెపని తీరు ప్రమాదంలో పడిపోతుంది.రక్తనాళాలపై నెగిటివ్ రియాక్షన్ చూపిస్తుంది.
ఈ విషయాన్నీ సౌత్ కాలిఫోర్నియాలోని బిహేవియరల్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ డెబోరా రోహమ్ యంగ్ తెలిపారు.
ఎక్కువసేపు కూర్చుంటే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది.. అలాగే దీర్ఘకాలం పాటు కూర్చోవడం వల్ల డయాబెటిస్, హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉందన్నారు. ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా మందగిస్తుందని పేర్కొన్నారు. ఫలితంగా ఏ కారణంగానైనా చనిపోయే ప్రమాదం ఉందని అధ్యయనకారులు తెలిపారు.

ఎంతసేపు కదలకుండా కూర్చుంటే ఈ జబ్బులు వస్తాయన్న కచ్చితమైన సమాచారం తమవద్ద లేదన్నారు. అందుకే ‘‘తక్కువ సేపు కూర్చోండి.. ఎక్కువ సేపు కదలండి’’ అని సూచిస్తున్నామని యంగ్ అన్నారు. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నవారు కూడా ఎక్కువ సేపు కూర్చుంటే ఈ వ్యాధుల బారిన పడక తప్పదని పేర్కొన్నారు.
కూర్చోవడం, కింద పడుకుని చదువుకోవడం, టీవీ చూడడం, కంప్యూటర్‌పై పనిచేయడం కూడా నిశ్చల ప్రవర్తన కిందికే వస్తుందన్నారు. ఇటువంటి క్రియా రహిత కార్యకలాపాల వల్ల శరీరంలోని శక్తి చాలా తక్కువగా ఖర్చవుతుందన్నారు. అది 1.5 జీవక్రియా సమానత(ఎంఈటీస్) కు సమానమని యంగ్ వివరించారు. దీనికంటే ఇంట్లో తేలికపాటి పనులు చేయడం, నెమ్మదిగా నడవడం వల్ల 2.5 ఎంఈటీస్, శారీరక శ్రమ చేసే వారికి 3.0 అంతకంటే ఎక్కువ ఎంఈటీస్ ఖర్చవుతుందని తెలిపారు.
అదే పనిగా కూచోని పనిచేసే వారు జాగ్రత్తగా ఉండాలని ఈ అధ్యయనం చెబుతుంది.

NO COMMENTS

LEAVE A REPLY