మిట్ట మద్యాహ్నం కావడం వల్ల ఎండ మండిపోతోంది….స్మార్ట్ రైటర్ సురేంద్ర క్షిపణి (21-08-2016)

సాహుకి నెక్స్ట్ స్టెప్ అర్థం కాలేదు.
అయినా ఏమీ ఆలోచించక వెహికల్ ను ముందుకు దూకించాడు.
హిమాంషు వెహికల్ టాప్ లో శత్రువులను టార్గెట్ చేస్తూ షూట్ చేస్తున్నాడు.
షార్ప్ షూటర్ కావడంతో గురి తప్పడంలేదు. శత్రువులు పిట్టల్లా రాలిపోతున్నారు
సాహు వెహికల్ ను శత్రువుల బుల్లెట్స్ కు దొరకకుండా డ్రైవ్ చేస్తున్నాడు.
అగస్త్య వెహికల్ నుండి జంప్ చెయ్యగానే లేవకుండా దొర్లుకుంటూ వెళ్లి దగ్గరలో డీప్ గా ఉన్న ఇసుకలోకి జారాడు. ఖలీల్ కూడా అతని వెనుకనే వచ్చి పడ్డాడు.
మిట్ట మద్యాహ్నం కావడం వల్ల ఎండ మండిపోతోంది.
“బ్రో! మండిపోయే ఎండలో ఎక్కువసేపు ఉండలేం” చుర్రుమంటున్న చేతులను రుద్దుకుంటూ అన్నాడు ఖలీల్
“ఒక్క 3 మినిట్స్ ఖలీల్. టార్గెట్ ఇస్ వెరీ నియర్” శత్రువుల కదలికలను చూస్తూ అన్నాడు అగస్త్య.
అతను అంచనా వేసినట్టే ఖచ్చితంగా 3 నిముషాలలో శత్రువులు వారిని దాటుకుంటూ ముందుకు వెళ్ళారు
“ఖలీల్ అటాక్ ” అంటూ అగస్త్య డెస్పరేట్ గా వెనుక నుండి కాల్పులు ప్రారంభించాడు.
ఖలీల్ క్షణం ఆలస్యం చెయ్యకుండా అగస్త్య పక్కన నిలబడి షూట్ చెయ్యడం స్టార్ట్ చేశాడు
ఒక్కసారిగా వెనుక నుండి అటాక్ జరగడంతో ఎక్స్ పెక్ట్ చెయ్యని ఇన్సిడెంట్ నుండి తేరుకునేలోపలే సగం మంది బలైపోయారు.
అటాక్ వెనుక నుండి జరగడంతో శత్రువులు వెనుకకు తిరిగి ఫైర్ చెయ్యడం ఆలస్యం చేశారు.
ఆ సందర్భాన్ని బాగా యుటిలైజ్ చేసుకున్న హిమాంషు మిగిలిన వారిని పడగొట్టాడు. శత్రువుల నుండి రెస్పాన్స్ లేకపోవడంతో సాహు వెహికల్ ను నిలిపి హిమాంషుతో జాయిన్ అయ్యాడు.
నాలుగు వైపుల నుండి అటాక్ జరగడంతో శత్రువులకు ఊపిరి తీసుకునే వ్యవధి కూడా లేకుండా హతమారిపోయారు.
“గుడ్ షో గైస్” అంటూ హిమాంషు డ్రైవర్ సీట్ లో కూర్చున్నాడు.
అంతవరకు భయంతో బిగుసుకుపోయిన సత్యమూర్తిలో కళ వచ్చింది
“మీపై నాకు నమ్మకం కలుగుతోంది. విదిశ ఎక్కడ ఉందో నాకు తెలుసు” అంతవరకు తనలోనే దాచుకున్న నిజాన్ని చెప్పడానికి రెడీ అవుతూ అన్నాడు సత్యమూర్తి
“అబ్బ.. ఇప్పటికైనా మాపై నీకు నమ్మకం కలిగింది. అంత హ్యాపీగా ఉందో” అంటూ హిమాంషు వెక్కిరించాడు
“చెప్పు భాయ్… ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా చెప్పు. మా విదిశ ఎక్కడ?” అడిగాడు ఖలీల్.
“సాదియత్ ఐలాండ్”
ఖలీల్ ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు
“ఆర్ యు ష్యూర్” అనుమానం తీరక అడిగాడు
“హా భాయ్.. విదిశ సాదియత్ ఐలాండ్ లో ఉంది”
“ఏమైంది బ్రో!” మాట్లాడకుండా కూర్చున్న ఖలీల్ ను కుదుపుతూ అడిగాడు సాహు
(ఈ సస్పెన్స్ వచ్చేవారం వరకు)

ఈ సీరియల్ మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
ఈ సీరియల్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…
…చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY