రాకేశ్ ఆ రాత్రి తన గదిలో శవమై తేలాడు…దీని కారణం ఎవరు?

న్యూ ఢిల్లీ
ఖరీదైన ప్రాంతం
రాకేశ్
పదకొండేళ్ళ అబ్బాయి
(ప్రాంతం పేరు మార్చబడింది)
రెండు చేతులతో తల పట్టుకుని కూచున్నాడు.అతని ముందు నోట్ బుక్స్ వున్నాయి.టెక్స్ట్ బుక్స్ వున్నాయి.అతని మనస్సులో చికాకు వుంది.అతని ఆలోచనల్లో విపరీతమైన ఒత్తిడి వుంది.రెండు చేతుల మధ్య తల బద్దలయ్యే బాధ విలవిల్లాడుతుంది.
స్కూల్లో ఒత్తిడి…తన కన్నా ఒక మార్క్ ముఖేష్ కు వచ్చినందుకు కూడా ఒత్తిడి.
అతను చదివే స్కూల్ ఖరీదైనది.
ఆ స్కూల్లో విద్యార్థులకు పాఠాలతో పాటు ఒత్తిడినీ బోధిస్తారు.
టార్గెట్ ..ర్యాంకుల టార్గెట్…పుస్తకాలను మిక్సీలో వేసి జ్యూస్ గా తాగించినట్టు….
హోం వర్క్..స్పెషల్ క్లాసులు.
పిల్లల గ్రహణ శక్తి ఎంత?
పిల్లలలోని ఆలోచనలు ఎలా వుంటాయి?
ఎంత వరకు పిల్లలకు ఒత్తిడి లేకుండా చూడవచ్చు?
అనే ఆలోచనలతో సంబంధం లేని టార్గెట్స్…
పిల్లల మీద ప్రతికూల ప్రభావాన్ని చూపించే ఒత్తిడి పిల్ల మీద రుద్దబడుతుంది.
రాకేశ్ ఆ రాత్రి తన గదిలో శవమై తేలాడు.
ఈ ఒత్తిడి భరించలేకపోతున్నాను అని సూసయిడ్ నోట్ లో అక్షరాలు కూడదీసుకుని రాసాడు.
ఆ కుటుంబంలో రాకేశ్ ఒక్కడే సంతానం…
కోట్ల ఆస్తి వుండి కూడా రాకేశ్ ఆత్మహత్య చేసుకోవడం వెనుక కారణం ఏమిటి?
అతని చావుకు కారణమైన ఒత్తిడిని శిక్షించాలా?
ఆ ఒత్తిడిని కలిగించిన ర్యాంకుల టార్గెట్స్ తో విద్యార్థులు జీవితాలతో ఆడుకునే కార్పోరేట్ స్కూల్స్ వైఖరిని శిక్షించాలా?
కొన్ని కార్పోరేట్ విద్యాసంస్థలు వీటికి మినహాయింపు అయితే కావచ్చు.
విద్యార్థుల మీద పడుతున్న ఈ ఒత్తిడిని గమనించక,తమ పిల్లలు అనుభవిస్తున్న మానసిక క్షోభ కు పరోక్షంగా,కారణమయ్యే తల్లిదండ్రులను శిక్షించాలా?
బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులకు ఇంత కన్నా కఠినమైన శిక్ష ,విషాదం ఏముంటుంది?
(ప్రముఖ రచయిత విజయార్కె  ఒత్తిడిని జయించండి పుస్తకం నుంచి…)
అందుబాటులో వున్న విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

vijayarke rachanalu

http://kinige.com/ksearch.php?searchfor=vijayarke

 

NO COMMENTS

LEAVE A REPLY