ప్రాచీన కాలానికి చెందిన జగత్తు యొక్క సృష్టిని, దేవతలను, దేవతాంశ సంభూతులను,వివిధ తెగల పుట్టుకను, వారి మూలపురుషులను, ఆచారవ్యవహారాలను వివరించేదే పురాణం

పురాణం అనగానేమి? మానవాళి ఉన్నతికి ఏ విధంగా ఉపయోగపడతాయి?
(పురాణం అంటే ఏమిటని ప్రశ్నిస్తే…ముందు ఆ పదానికి అర్థం తెలుసుకోవడానికి గూగుల్ ని జల్లెడ పట్టే పరిస్థితి.పురాణాల పట్ల అవగాహన కలిగించడానికి చేసే చిన్ని ప్రయత్నం.బెంగుళూర్ నుంచి వెంకట మధు అందించిన ఈ కథనం పై .మీ స్పందన తెలియజేయండి.ఇలాంటి పురాణం విశేషాలు మీరు కూడా పంపించవచ్చు….చీఫ్ ఎడిటర్)
పురాణం అంటే “ప్రాచీన కాలానికి చెందిన జగత్తు యొక్క సృష్టిని, దేవతలను, దేవతాంశ సంభూతులను, వివిధ తెగల పుట్టుకను, వారి మూలపురుషులను, ఆచారవ్యవహారాలను వివరించేదే పురాణం”
ప్రప్రంచం పుట్టుక దగ్గర్నుంచి ప్రపంచంలో మానవుడు నడుచుకోవలసిన విధానందాకా ఎన్నెన్నో విషయాలను పురాణాలు మనకు వివరిస్తాయి. చరిత్ర, భౌగోళికం, పౌర విజ్ఞానం…ఒక్కటేమిటి? ప్రపంచంలో ఎన్ని విభాగాల విజ్ఞానముందో అన్నీ పురాణాలలో కనిపిస్తాయి.
భారతీయ సంప్రదాయక పురాణాలు, ఇతిహాసాలు అన్నీ మానవాళికి మంచి మార్గాన్ని బోధించటానికే ఆవిర్భవించాయి.
వేద ధర్మాలను ప్రచారం చేయడానికే పురాణాలు వెలువడ్డాయి.
పురాణ కధల గురించి చెప్పుకోవాల్సి వస్తే, ఏ వ్యక్తిత్వ వికాసానికి తీసిపోని విజ్ఞాన గనులు.
విలువలు నేర్పుతూ, ఊహాశక్తిని పెంపొందిస్తూ, సమస్యల చిక్కుముడులు ఎలా విప్పదీయాలో చూపిస్తూ, క్రొత్త విషయాలు నేర్పుతూ, చరిత్రని గురించిన సంగతులు మొతాన్ని పూజ్యులు మహనీయులు ఋషులు గ్రంధాల వారీగా రాసినారు.
“పురాపినవం పురాణం” అన్నారు. అంటే ఎంత ప్రాచీనమైనదైనా కొత్తగా అనిపిస్తుందని దీని భావన. పురాణాలలో భారతీయ ఆత్మ ఉందంటారు. వేద ధర్మాలను ప్రచారం చేయడానికే పురాణాలు వెలువడ్డాయి.

 

NO COMMENTS

LEAVE A REPLY