జీవితములో ప్రతీ క్షణాన్ని కాపాడుకోండి…డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి గెస్ట్ కాలమ్

Dear parents & teachers let us Create a happy and systematic environment for our children…at the as early as possible…..Doctor Komatiredy GopalReddy

మీ చిన్నారులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులుగా మీ పాత్ర చిరస్మరణీయమైనది.మీ పిల్లకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించండి.క్రమబద్ధమైన జీవితాన్ని నిర్దేశించండి.క్రమశిక్షణను అలవర్చుకునేలా చేయండి.వారి అభిప్రాయాలను షేర్ చేసుకోండి.కేవలం చదువుపట్ల మాత్రమే కాదు…వారి భావిజీవితాన్ని ప్రభావితం చేసే ప్రతీ అంశాన్ని వారితో చర్చించి ,వారికి గైడెన్స్ ఇవ్వండి.
డియర్ టీచర్స్
మీదగ్గర చదువునేర్చుకునే మీ విద్యార్థులకు మీరు విద్యాలయం అందించిన దేవుళ్ళు.
విద్యార్థులకు కేవలం విద్యను అందించడం…వారికి ర్యాంకులు వచ్చేలా చేయడం మాత్రమే కాదు..వారు జీవితంలో ర్యాంకులు సాధించాలి.మేధావులుగా గుర్తింపు పొందాలి.వారి అభిరుచులు,ఆశయాలు గమనించండి.వారికీ ఏ రఁగంలో ఆసక్తి వుందో.ఏ సబ్జెక్టులో పట్టు వుందో గమనించండి.
వారిలోని థింకింగ్ పవర్ ను గుర్తించండి.క్రమశిక్షణ,సంస్కారం,వినయవిదేతలు కూడా సిలబస్ లోని పాఠాలే అని వారికి తెలియజేయండి.
వారి మానసిక ఎదుగుదలకు మీరు కృషి చేయండి.
డియర్ స్టూడెంట్స్
అమ్మానాన్నలు చెప్పే ప్రతీ విషయం మీ అభివృద్ధికే బాటలు వేస్తుంది.
కళ్ళ ముందు కనిపించే దేవుళ్ళు…వారికి మీరే ప్రపంచం.మీకోసమే వారు బ్రతుకుతున్నది.వారి ఆకాంక్షలను నెరవేర్చండి.
మీకోసం వారు కన్న బంగారు కలలను నిజం చేయండి.తల్లిదండ్రులను మీ స్నేహితుల్లా భావించండి.
మీమనసులోని విషయాలను షేర్ చేసుకోండి.
టీచర్స్ మీకు బెస్ట్ ఫ్రెండ్స్..అర్థం కానీ పాఠాలను ఎలా అడుగుతారో అర్థం కానీ విషయాలను అలాగే అడిగి తెలుసుకోండి.
మీ పేరెంట్స్ కు,టీచర్స్ కు మీరు వారధి లాంటివారు.
జీవితంలో ప్రతీ క్షణాన్ని ఎదగడం కోసం .కన్నవాళ్లకు,చదువునేర్పిన గురువులకు ,ఈ దేశానికి పేరు తీసుకువచ్చేలా విజయాలను సాధించండి.
అల్ ది బెస్ట్.

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY