కలగానే ఇది మిగిలిందా,నిజమైన మన ప్రేమ.పాటలతోటలో పద్మశ్రీ …(18-09-2016)

కొత్తదనాన్ని అన్వేషించే దర్సకనిర్మాతలకు ,సినీపరిశ్రమకు…
మేన్ రోబో పాటలతోట…ఒక వేదికగా,ఒక వారథిగా నిలుస్తుంది.
ఇది అక్షరస్వరం వినిపించే స్వరాల గళం …
స్వరానికి అక్షరాల అనువాదం…
స్వర సరస్వతికి కైమోడ్పు
ప్రతిభకు స్వరాభిషేకం….పాటకు పట్టాభిషేకం
ఈ వారం పద్మశ్రీ పాట

పల్లవి/---male/-----కలగానే ఇది మిగిలిందా,నిజమైన మన ప్రేమ.
 ఎండమావిల అగుపించి ,భ్రమగానే అది ముగిసింది,
 నా శ్వాసలో వుంది నీవే, అది ఆశగా మిగిలి పోయే
 నీకోసం నా కనులే వెతికేను ప్రతి క్షణమే..(కల)

చరణం 1.--male/--కాలమే కాటు వేసి గాయమే చేసి పోయే.
 బ్రతుకులోని సంతోషం నన్నొదిలి ఏటో వెళ్ళిపోయే
 బ్రహ్మదేవుడా నుదిటి రాతను మార్చే వరమే ఇవ్వవా
 గుండె కోసినా భాధ బరువునే మోసే సహనం పెంచావా
 అర్ధం కాని ఓ ప్రేమ ఇక వ్యర్ధం చెయ్యకే ఓ కాలమా.(కల)

చరణం/--female---రెప్పలా అంటి వున్నా కను చూపుకే దూరమయ్యా,
 నీడలా వెంట నడిచే నీ జ్ఞాపకం మరవగలనా..
 గుండె చప్పుడే నాకు చెప్పిన మాటను మరువను నేస్తమా
 నువ్వే నేనుగా ,నేనే నువ్వుగా ప్రేమకు సాక్ష్యం కామా
 కరువై పోయే నీ ప్రేమ పగ పట్టేసింది ఈ కాలమే..

female పల్లవి/-- మంచు చినుకుకై మన ప్రేమ,మండు టెండలో కరిగింది
 పండు వెన్నెలై మురిపించి,చీకటిలో ముగిసింది.
 నీ తీయ్యని స్వాగాతాలే,నా బ్రకులో హాయి నింపే
 నిను చూసి నా కనులే కన్నీటి ఉప్పెనై పోయే...

ఈ పాటమీద మీ విలువైన మాట/కామెంట్ మాకు పేస్ బుక్ /ట్విట్టర్ /మెయిల్/ ద్వారా పంపించవచ్చు.షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY