శాశ్వతమైనది దేహం కాదు…ధనం కాదు…డాబుదర్పం కాదు…డాక్టర్ కృష్ణ పుట్టపర్తి…Penukonda To Dallas వండర్ ఫుల్ రైటర్ తేజారాణి తిరునగరి అక్షర కథనంతో(02-10-2016)

(7)

ఈ రుణం…మీ రుణం ఎలా తీరేది?
నన్నుఅభినందిస్తూ,ఆశీర్వదిస్తూ,అభిమానిస్తూ మీలో ఒక్కరిగా మీ ఆత్మీయుడిగా అక్కున చేర్చుకున్న మీ రుణాన్ని ఎలా తీర్చుకోను? అక్షరాలు కలిపిన ఈ మైత్రీబంధం కలకాలం ఇలానే ఉండాలి.
*కృష్ణ పుట్టపర్తిగారు వృత్తిరీత్యా డాక్టరా?డాక్టరేట్ పట్టా పొందారా?విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిందా?ప్రస్తుతం కృష్ణ పుట్టపర్తి గారు ఏం చేస్తున్నారు?వారు చేస్తోన్న ఉద్యోగం ఏమిటి? పెనుకొండ నుంచి డల్లాస్ చేరిన ఒక ప్రముఖుడి గురించి తెలుసుకోవాలన్న మా తపన అర్థం చేసుకోండి…సుమతీశర్మ(గుంటూరు)
ధన్యవాదాలు అమ్మా…
‘నేను గౌరవ డాక్టరేట్ పొందినవాడిని కాదు..డాక్టర్ కోర్స్ చేసి వైద్యుడిని అయినవాడిని కాను..కర్ణాటక యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ డిగ్రీ పొందాను.రీసెర్చ్ సైంటిస్ట్ గా పనిచేస్తున్నాను.
I am working as Research Scientist in UT Southwestern Medical School,Dallas,Texas…I got my doctorate degree in the year 1986.
After my MSc degree i have joined PhD program in Karnatak University. I have to earn my degree not given.’
ఇలా మేన్ రోబో పాఠకులతో ప్రతీవారం ముచ్చటించడం,మీ అభిమానాన్నిపంచుకోవడం ఆనందంగా వుంది.ఈ ప్రపంచంలో శాశ్వతమైనది దేహం కాదు…ధనం కాదు…డాబుదర్పం కాదు…
మనం సాధించుకున్న అభిమానం…మనం సముపార్జించుకున్న కీర్తిప్రతిష్టలు.
అందుకే నేను మానవత్వాన్ని ప్రేమిస్తాను..మంచితనాన్ని అభిమానిస్తాను…ఒక మంచిపని చేయడానికి సదా సిద్ధంగా వుంటాను.
గతవారం నేను రాసిన బాల్యం అధ్యాయంలో నా అల్లరి నాలోని అమాయకత్వం మీకు నచ్చిందని మీ స్పందన వల్ల అర్థమైంది..అయితే అదే అధ్యాయంలో చివరలో చెప్పినట్టు..నేను తల్లితండ్రులకు ఒక విన్నపం చేస్తున్నాను.
“మీ పిల్లల బాల్యాన్ని ఇంధ్రధనుసులా మార్చండి.అన్ని రంగులూ కలిస్తే ఇంధ్రధనుసు ఎంత అందంగా ఉంటుంది?
మరీ మాటలురాని వయసులోనే స్కూల్ కు పంపకండి.బాల్యం తాలూకూ అనుభూతిని మిస్ చేయకండి.అలాగే చదువు ఒక్కటే పరమార్థం అని భావించకండి.ఆటలు పాటలు అల్లరి ..అన్నీ ఆ వయసులో అందంగా ఉంటాయి.అలానే ఉండనివ్వండి.
ఇప్పటి జనరేషన్లో మార్పు వచ్చింది.ఒకప్పటి ఉమ్మడి కుటుంబాలు లేవు.అమ్మ నాన్న మామయ్యలు పిన్ని బాబ్బాయి తాతయ్య బామ్మా అంతా కలిసి ఉంటున్నారా?సంవత్సరంలో ఒక్కసారైనా కలుసుకుంటున్నారా?
సాయంత్రాలు ఆరుబయట ఆడుకుంటున్నారా?బామ్మా చెప్పే చందమామ కథలు వింటున్నారా? వెండిగిన్నెలో అన్నం తింటున్నారా?
నెట్ చూస్తూ,కార్టూన్స్ పెట్టుకుంటూ,నూడుల్స్ తింటూ…వీడియో గేమ్స్ ఆడుకుంటూ…స్కూల్ కు వెళ్లొచ్చాక ఒంటరిగా లేదంటే ఆయా తోడు…
ఇది నేను అంటున్న మాట కాదు కొన్నిసర్వేలు తేల్చిన నిష్టుర సత్యాలు.ఒక వ్యక్తిత్వ వికాస పుస్తకంలో నేను చదివిన వాక్యాలు.
దయచేసి సాధ్యమైనంతవరకు మీ పిల్లలకు మీ ప్రెజెన్సీ ని మిస్ కాకుండా చూసుకోండి.వీకెండ్స్ సరదాగా బయటకు తీసుకువెళ్ళండి.వారికీ స్పోర్ట్స్ మీద లేదా మరో సబ్జెక్టు మీద ఇంట్రెస్ట్ ఉంటే ప్రోత్సహించండి.
ఏమో భవిష్యత్తులో మీ బిడ్డ ఒక గొప్ప క్రికెటర్ కావచ్చు.ఒక గొప్ప నటుడు కావచ్చు.ఒక గొప్ప సైంటిస్ట్ కావచ్చు.
మన కోరికలు మన పిల్లల మీద రుద్దితే వాళ్లలో ప్రతిభ ఆసక్తి కనుమరుగైతే ప్రమాదమే కదా…ఆలోచించండి.
***
జీవితమనే రైలు సాఫీగా ప్రయాణించాలి అంటే రెండు చక్రాలు ఒకే దిశగా సక్రమంగా ముందుకు కదలాలి.నా ప్రయాణం ఎక్కడి నుంచి మొదలైంది?ఎక్కడ పెనుకొండ?ఎక్కడ డల్లాస్? జీవితం ఒక అబ్బురమే…
జీవితాన్ని “మనకు మనమే తీర్చిదిద్దుకోవచ్చు” అన్నది నా నమ్మకం.
మనం మొక్కను పెంచిపెద్ద చేస్తే ఆ మొక్క పెరిగి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా మనకు నీడను ఇస్తుంది.ఫలాలను ఇస్తుంది.చివరికి ఎండిపోయాక తన శరీరాన్ని ఇస్తుంది..వాడుకోమని.
మనం మొక్కపాటి చేయమా? నా తల్లిదండ్రుల నుంచి నాకు వచ్చిన గొప్ప సంపద ఈ సాయపడే మనస్తత్వమే అని గర్వంగా సవినయంగా చెప్పుకోగలను.
మా పక్కింటి అంకుల్ చనిఫ్యారు.వల్ల కుటుంబానికి ఎలాంటి ఆసరా లేదు.నాన్న ఆ కుటుంబాన్ని తన సోదరి కుటుంబంగా భావించి చేరదీసాడు.సాయం చేసాడు.ఇప్పటికీ ఆ కుటుంబం కళ్ళలో కనిపించిన కృతజ్ఞతాభావం చూస్తుంటే ఓకే మనిషి సాయం చేస్తే,ఒక కుటుంబానికి చేయూతనిస్తే ఆ ఆనందం ఇంత గొప్పగా ఉంటుందా..అనిపిస్తుంది.
అలా మా నాన్న దగ్గరకి చాలామంది నిస్సహాయ స్థితిలో వచ్చేవాళ్ళు.నాన్నగారు చేతనైన సాయం చేసేవారు.ఆ మనస్తత్వం నాకు సంక్రమించడం పూర్వజన్మ సుకృతం కావచ్చు.
ఎందుకంటే ఇక్కడికి డల్లాస్ కు వచ్చేవాళ్ళు కొందరు నా సాయం కోరుతారు.అది నాకు వచ్చిన మంచి అవకాశంగా,అవసరంలో వున్నవారికి ఆ దేవుడు నాతో చేయించే సాయంగా భావిస్తాను.
***
కానీ నా జీవితంలో ఆ దేవుడు నాకు మిగిల్చిన విషాదాలు రెండు వున్నాయి.అవి ఇప్పటికీ నా కళ్ళలో కన్నీళ్ళుగా మిగిలివున్నాయి.ఆ విషాదాలు ఏమిటి?
***
(జర్నీ లో చిన్న బ్రేక్…వచ్చేవారం వరకూ)

(ప్రవాస భారతీయులకు…
ప్రవాస భారతీయుల నుంచి ఎన్నారై స్టోరీస్ ను ఆహ్వానిస్తున్నాం.మీ సక్సెస్ కథనాలు,మీ అనుభవాలు మేన్ రోబో పాఠకులతో షేర్ చేసుకుంటే సంతోషిస్తాం.
అలాగే డాక్టర్ కృష్ణ పుట్టపర్తిగారి గురించి తెలిసిన మిత్రులు,అభిమానులు,సన్నిహితులు వారితో( డాక్టర్ కృష్ణ పుట్టపర్తిగారితో మీకు వున్న అనుబంధాన్ని కూడా తెలియజేయవచ్చు.
ఈ ధారావాహిక ఒక స్ఫూర్తికథనంగా మారుతుందని ,అందుకు మీ స్పందన ఒక దిక్సూచిలా నిలుస్తుందని భావిస్తున్నాం …)
ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY