క్రీడాకారులకు స్ఫూర్తినిచ్చే స్నేహహస్తం రియో పారా ఒలింపిక్స్ విజేతలకు చాముండేశ్వరనాథ్ చేయూత

(విజయార్కె,డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి)
ముంబై ;ఒక అద్భుతసంఘటనకు ముంబై వేదిక అయ్యింది.యావత్ క్రీడాప్రపంచం మురిసిపోయింది.రియో పారా ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన నలుగురు అథ్లెట్స్ కు జరిగిన ఘనసన్మానం.అద్భుతసత్కారం.
దేవేంద్ర ఝఝారియా (స్వర్ణం-జావెలిన్ త్రో)
మరియప్పన్ తంగవేలు (స్వర్ణం-హైజంప్)
దీపా మాలిక్ (రజతం-షాట్ ఫుట్ )
వరుణ్ సింగ్ భాటి (కాంస్యం హైజంప్ )
వీరితో పాటు గత పోటీల విజేతలకు కూడా తలో రూ(15) పదిహేను లక్షల చొప్పున అందజేశారు.
స్నేహహస్తానికి క్రీడలకు చేయూతనిచ్చే దాతృత్వానికి చిరునామా…సుప్రసిద్ధ క్రీడాకారుడు బ్యాట్స్ మేన్ చాముండేశ్వరనాథ్ అక్షరాలా యాభై లక్షల రూపాయల సాయాన్ని అందించి క్రీడాకారుల పట్ల,క్రీడల పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.
మాస్టర్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ యాభై లక్షల సాయాన్ని అందించారు.
ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ఇరవై అయిదు లక్షలు, కొల్లి రవికుమార్ అయిదు లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు.
డబ్బులు అందరి దగ్గర ఉంటాయి.కానీ క్రీడాస్ఫూర్తి కొందరిలోనే ఉంటుంది.
ఈ క్రీడాస్ఫూర్తి ఇలానే కొనసాగాలని మేన్ రోబో ఆకాంక్షిస్తోంది.
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

http://kinige.com/ksearch.php?searchfor=vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…చీఫ్ ఎడిటర్

 

 

NO COMMENTS

LEAVE A REPLY