బెటరాఫ్ తో రొమాన్స్ కన్నా మత్తెక్కించే ఆల్కాహాల్ మరోటి లేదని అతనికి చాలా ఆలస్యంగా తెలిసింది.విజయార్కె కథ ఏం “మాయ” చేసింది…?

17-06-2016 స్వాతి సపరివారపత్రికలో ప్రచురించబడిన సరసమైన కథ
మందులో మత్తును, కిక్కును వెతుక్కునే అతనిలో, మందును మించిన కిక్కు, మత్తు మరోటి వుందని అతనికి తెలిసోచ్చేలా చేసింది.
ఆ మరోటి ఏమిటీ? ఆమె పేరు మాయ…ఏం “మాయ”చేసిందో మరి.
                                                    ***
బెటరాఫ్ తో రొమాన్స్ కన్నా మత్తెక్కించే ఆల్కాహాల్ మరోటి లేదని అతనికి చాలా ఆలస్యంగా తెలిసింది.ఆ రాత్రి తోటి మందుబాబులకు మందుకు గుడ్ బై చెబుతూ ఇచ్చిన ఫేర్ వెల్ పార్టీలో అతనేం చెప్పాడంటే….
                                                       ***
పచ్చికబయళ్ళ మధ్య విచ్చుకున్న స్వప్నం
జలపాతాల హోరులో వినిపించే ఉచ్వాస నిశ్వాసాల సవ్వడి…
కురిసే వర్షంలో ఆమె తనువు తడిసిపోతుంది.ఆమె మనస్సు వేడెక్కిపోతుంది.
కోరికల అచ్చాధనలు శరీరం నుంచి వేరైపోతున్నాయి.
ఆమె ప్రకృతిగా మారింది…తన పురుషుడిని ఆహ్వానిస్తోంది.
ఉరుముల నుంచి మెరుపుల మధ్య పిడుగులా అతను ప్రత్యక్ష్యమయ్యాడు.
ఆమె దేహాన్ని చుట్టేసాడు…తన తనువును దుప్పటిలా కప్పేసాడు
వర్షంలో అనుభవాల రాపిడి మొదలైంది….కోరికల మంట రాజుకుంది…
ఆ దృశ్యాన్ని చూసిన ఇంద్రధనుసు తుళ్ళిపడింది….జారిపడింది…ఆమె నడుం ఓంపులో మడతలా స్థిరపడింది.
పచ్చగడ్డి పాన్పు మీద పరువాల తారట్లాట.
రెండు శరీరాల భావోద్వేగాల క్రీడ …
ఆపాదమస్తకం ఆమెను ఓ పుస్తకంలా చదివేస్తున్నాడు…కొత్త అధ్యాయాలను ఆ పుస్తకంలో తన పెదవులతో లిఖిస్తున్నాడు.
ఆమె ఉక్కిరి బిక్కిరి అవుతోంది.
ఇష్టంతో కూడిన ప్రేమ…
కోరికతో కూడిన ఇష్టం …
శృంగారంతో ఒక్కటయ్యే రెండు దేహాల మధ్య కెమిస్ట్రీ …
ఫిజికల్ అటాచ్ మెంట్ బాడీ కెమిస్ట్రీ తో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది.
దాంపత్యం ఇంత మధురంగా ఉంటుందా?
శృంగారం ఇంత గొప్పగా ఉంటుందా?
ఆమె అతడిని అల్లుకు పోతుంది …తనూలతగా మారి.
కళ్ళు తెరిస్తే కలై పోతుందన్న భయం..
కళ్ళు మూసుకుంటే ఈ అనుభవాన్ని చూసి అనుభూతించలేక పోతున్నాననే దిగులు…
కళ్ళు తెరిచింది మాయ…
                                                      ***
కరిగిపోయిన స్వప్నం ఒంటరితనం కాన్వాసు మీద విరహం అనే చిత్రాన్ని చిత్రించింది.
కరిగిపోయిన కాలాన్ని కాకుండా మిగిలి వున్న కాలాన్ని సూచిస్తున్నట్టు గడియారం పన్నెండు గంటలను చూపించి మళ్ళీ ముందుకు కదిలింది సెకను ముళ్ళు.
విశాలమైన పడగ్గదిలో.ఒంటరిగా మాయ.
విశాలమైన ఆ బెడ్ మీద ఆ చివరి నుంచి ఈ చివర వరకూ తనే…సాయంత్రం అయ్యిందంటే ఆఫీసు నుంచి వచ్చే భర్త కోసం అభిసారికలా తను ఎదురు చూస్తుంది….డైనింగ్ హాల్ లో బెటరాఫ్,బెడ్ రూం లో విరహొత్కంఠిత…
ఇప్పుడు…ఇప్పుడే కాదు ప్రతీ రాత్రి ఒంటరితనంతో జత.
భార్యల ఫీలింగ్స్ ను పట్టించుకోని భర్తలు తెలుసుకోలేని నేకేడ్ ట్రూత్ కి పచ్చి ఉదాహరణ మాయ.
ఆమె మాయ…ఆమె భర్త పేరు శ్రీహర్ష
తన పెళ్లి ఒక మాయలా అనిపిస్తుంది
తన వర్తమానం ఒక ప్రశ్నలా కనిపిస్తుంది ..
కానీ తన భవిష్యత్తు ఒక అయోమయంగా మారకూడదు…
తల విదిల్చింది మాయ…
                                               ***
డిగ్రీ పూర్తి కాగానే తల్లిదండ్రులు తెచ్చిన సంబంధాన్ని ఓకే అంది.
భర్త శ్రీహర్ష గొప్ప బిజినెస్ మాగ్నేట్ …కరెన్సీ తో దేన్నైనా కొనేయవచ్చు అనుకునే మనిషి.అతని దృష్టిలో ప్రతీది వ్యాపారమే…అతనికి కిక్కును ఇచ్చేది డబ్బు..నెక్స్ట్ ఆల్కహాల్…మందు..
అతని దృష్టిలో భార్య స్టేటస్ సింబల్…అందమైన భార్య పార్టీల్లో తన పక్కన వుంటే..అందరి కళ్ళు తనను ఈర్షగా చూస్తుంటే అదో ఐడెంటిటీ క్రైసిస్ .
భార్య అంటే ఇష్టమే..అంత కన్నా పార్టీలు మద్యం అంటే ఇంకా ఎక్కువ ఇష్టం…
పెళ్ళైన కొత్తలో బిజినెస్ లో ఇవి “అప్పుడప్పుడు” తప్పవు అనేవాడు.
ఆ తర్వాత “ఎప్పుడూ తప్పవు” అన్నాడు..
ఇక ఇప్పుడు “ఇదీ ఒక బిజినెస్సే” అనే స్థితికి వచ్చాడు.
తనూ తన భర్త…బొమ్మరిల్లు లాంటి ఇల్లు..సాయంకాలాలు అలా భర్త పక్కన నడుస్తూ వెళ్తే చాలు…భర్త కోసం ఎదురు చూడడంలో ఆనందం…భర్తను ప్రేమించడంలో సంతృప్తి …వెన్నెల రాత్రులే కాదు వర్షపు రాత్రుళ్ళు…హేమంతాలు వసంతాలు..ఋతువులు ఏవైనా కాలం ఏదైనా ప్రతీ రాత్రి తమకే స్వంతమైన అనుభవాల జాతర..అనుభూతి యాత్ర…అందమైన రోమాంచిత దొంతరను గుండెల్లో భర్తను పదిలపర్చుకున్నంత పదిలంగా దాచుకోవాలనుకునే అమ్మాయి.
తను చదివిన నవలల ప్రభావమో,చూసిన సినిమాల ఆలోచనో ..జీవితం పట్ల అందమైన ఫీలింగో…
కానీ ఆమె ఫీలింగ్ లో ఎంత గొప్ప ఫీల్ వుందో కదా..?
ప్రతీ భార్య భర్త నుంచి ఇంత కన్నా గొప్ప కానుక ఏం కోరుకుంటుంది?
                                                   ***
హాల్లో కూచోని భర్త కోసం ఎదురుచూస్తోంది.ఆఫీసు నుంచి వచ్చే భర్త కోసం సాయంత్రం కాగానే గుమ్మం దగ్గర ఎదురు చూసే తను..కొత్తగా చేసుకున్న అలవాటు…అర్థరాత్రి వేళ భర్త రాక కోసం ఎదురు చూడడం.
ఎందుకంటే భర్త వచ్చేది బార్ నుంచి…
                                                    ***
మె వేసుకున్న పింక్ కలర్ నైటీ ఆమె అందాలను ర్యాంప్ మీద క్యాట్ వాక్ లా చూపిస్తున్నాయి.కళ్ళు మూతలు పడుతున్నట్టు అనిపించింది.
వాష్ రూం లోకి వెళ్లి కళ్ళు కడుక్కుంది.అద్దంలో తన ఎద అందాలు తనకే జెలసీగా అనిపిస్తున్నాయి.భర్త చేతిలో సేద తీరాల్సిన ఈ అందాలూ..విరహంతో కలిసి ఆవిరి అయిపోతున్నాయి.కోపంగా కసిగా నైటీ ముడిని లాగింది.
నైటీ నేల జారింది. ఆమె అనాచ్చాదిత దేహాన్ని చూసి అద్దం ఆమె దేహాన్ని తను ప్రతిబింబంగా తనలో చూపించినందుకు గర్వంగా పొంగిపోయింది.షవర్ ఆన్ చేసింది.నీటి ధార …చల్లని నీళ్ళు వేడెక్కిపోయాయి… తల మీదుగా పడుతూ జారిపోతున్న నీటి ముత్యాలు ఆమె శంఖంలాంటి మెడను దాటి…లోయ మధ్యగా జారుతున్నట్టు….ఆమె నాభిని చేరి సుడులు తిరిగి..మరులు గొలిపే మెస్మరైజింగ్ దృశ్యం అక్కడ నిస్సహాయంగా కనిపిస్తోంది…
అలానే బెడ్ రూం లోకి నడిచి వచ్చింది.బెడ్ కు అడ్డంగా పడుకుండి పోయింది.
అర్థరాత్రి దాటాకో వచ్చిన శ్రీహర్ష బెడ్ రూం లో తన కోసం వర్ష సుందరిలా వున్న భార్యను చూసి ..ప్చ్…తనకు రేపే ఓ డజన్ నైటీలు కొనాలి…పాపం చలికి వణుకుతుంది..అనుకుంటూ మందు మత్తులో అలానే సోఫాలో పడుకున్నాడు.
అతను మందు తాలూకు మత్తులో వున్నాడు.
                                        ***
ప్రతీ కథకు ఫ్రీ క్లయిమాక్స్ వుంటుంది…క్లయిమాక్సూ వుంటుంది.
మాయ ఆలోచనలో పడింది.ఇది తన సమస్యే కాదు తాలాంటి ఎందరిదో ఈ సమస్య కాబోలు…
డబ్బు వున్న లేకున్నా ఈ మద్యం మత్తులో కాపురాలు కూల్చేసుకునే వాళ్ళు ఎందరో…రాత్రుళ్ళు అందమైన దాంపత్య జీవితాన్ని అనుభవించవలిసిన తను ఇలా నిస్సారమైన విరహాల మధ్య గడిపేస్తుంది.
భార్యా భర్తల మధ్య అనివార్యమైన ఈ అందమైన అనుభవాల అనుబంధం …దూరమై జీవిత భాగస్వామికి శాపమైతే….ఎప్పుడో ఓ అర్థరాత్రి తాగిన మత్తులో కేవలం కోరిక తాలూకు ఉధృతిలో దగ్గరికి వచ్చినప్పుడు ఆల్కాహాల్ వాసన అందమైన మూడ్ ను,భర్త మీద ఇష్టాన్ని నిర్ధాక్షిణ్యంగా తరిమేస్తుంది.
ఈ విషయాన్ని తాగుబోతు భర్తలు ఎప్పుడు తెలుసుకుంటారు ?ఆమెను…సగటు మధ్య తరగతి భార్యను వేధిస్తోన్న ప్రశ్న.
ఉదయమే పత్రికల్లో వచ్చిన ఓ వార్త ఆమెకు గుర్తుకు వచ్చింది.రోబోటిక్ టెక్నాలజీతో పడగ్గదిలో సెక్స్ ను అందించే రోబోలు రాబోతున్నయన్న వార్త.
యాంత్రికమైన రోబోలకూ మనస్సును స్పందించే ఫీలింగ్స్ ను కనిపెట్టే ఈ సైంటిస్ట్ లు అమ్మాయిల ఫీలింగ్స్ ను తాగుబోతు భర్తలకు తెలియజేసే పరికరం కనిపెడితే బావుండు.
                                           ****
రాత్రి తూలుతూ వచ్చాడు.శ్రీహర్ష….పొద్దునే ఫ్రెష్ అయి ఆఫీసు కు వెళ్ళాడు..ఇదీ లైఫ్…మళ్ళీ రాత్రి మందు కొట్టి వస్తాడు…గురక పెట్టి నిద్రపోతాడు.
ఒక నిట్టూర్పు ఆమెను కర్తవ్యోన్ముఖురాలిని చేసింది.రెండు రోజులుగా ఆమె ఓ పుస్తకం చదువుతుంది.
ఆ పుస్తకం పేరు అసంతృప్తిని జయించండి.
         ***
రాత్రి ఎప్పటిలానే ఆలస్యంగా వచ్చిన శ్రీహర్ష తన బెడ్ రూం లో ఆ దృశ్యాన్ని చూసి అలానే ఉండిపోయాడు
భార్యను ఆ భంగిమలో చూసి ఒక్క క్షణం ..ఒకే ఒక్క క్షణం షాకయ్యాడు.
ఎప్పుడూ కట్టుకోవడానికి బట్టలు లేనట్టు…(అతనికి ఆ విధంగా అర్థమైంది) అనచ్చాదితంగా మంచానికి అడ్డంగా పడుకుండిపోయే భార్య …,తెల్లటి చీర..మత్తెక్కించే మల్లెలు…ఒళ్ళు విరుచుకున్న భంగిమలో పడుకుని వుంది.అప్పటికే అతనికి మత్తు తలకు ఎక్కి వుంది.తనలో తను ఏదో గొణుక్కుంటూ అటు తిరిగి పడుకున్నాడు శ్రీహర్ష .
                                                                    ***
పొద్దునే బద్దకంగా కళ్ళు తెరిచాడు.మందు తాలూకు హ్యాంగోవర్ ఇంకా కొద్దిగా బాలెన్స్ వుంది.
పక్కనే వున్న భార్య వైపు చూసి ఖంగు తిన్నాడు.శ్రీహర్ష. భార్య మోహంలో అలసట వుంది.మల్లె పువ్వులు మంచమంతా పరచుకుని వున్నాయి.భార్య చేతి మట్టి గాజులు ఒకట్రెండు పగిలిపోయి వున్నాయి.ఆమె జాకెట్ హుక్స్ మొదటి రెండు స్థానభ్రంశం చెందాయి.
కళ్ళు తెరిచి భర్త వైపు చూసి భర్తకు దగ్గరగా జరిగింది.భర్తను గట్టిగా వాటేసుకుని పెదవుల మీద ముద్దు పెట్టుకుని “థాంక్యూ”అంది.
అతను అవాక్కయ్యాడు ..”దేనికి?ఎందుకు?అన్నాడు అయోమయంగా
ఎన్ని రోజులు,… ఊహూ…..నెలల తర్వాత మీతో ఈ కలయిక ఎంత అందంగా ,అద్భుతంగా వుందో..ఒక్క క్షణం తట్టుకోలేకపోయాను.మీ చేతలతో ఉక్కిరి బిక్కిరి చేసారు.
“నేనా?నిన్నా?”మరింత విస్మయంగా అడిగాడు.
“మీరు కాకపోతే ఈ సామ్రాజ్యంలో మీ పట్టమహిషిని టచ్ చేసే ధైర్యం ఎవరికీ వుంటుంది?అయినా నేనా?అని ఎలా అడుగుతున్నారు…కాసింత అలక నటిస్తూ అంది.తర్వాత చీర సర్దుకుంటూ లేచి బాత్ రూం వైపు నడిచింది…సిగ్గు పడుతూ…నటిస్తూ…
                                                        ***
న బెడ్ రూం లో ఆ దృశ్యాన్ని చూసి అలానే ఉండిపోయాడు శ్రీహర్ష .మత్తుకే మత్తెక్కించే భంగిమ…పింక్ కలర్ నైటీలో పడుకుని వుంది.మన్మథుడు విల్లు దొరక్క తన భార్యనే విల్లుగా మార్చినట్టు..విల్లులా, మార్చినట్టు వుంది.ఆమె చూపుల శరాలు మెల్లిగా తగులుతున్నట్టు అనిపించింది.మందు మత్తులోనూ చిన్న గమ్మత్తైన ఫీలింగ్….అడుగులు తడబడుతున్నాయి,శరీరం తూలుతుంది.అలానే వెళ్లి ఆమె పక్కనే మంచంలో పడిపోయాడు.భార్య అనే గమ్మత్తైన మత్తును వదిలిపెట్టి.
                                                ***
పొద్దునే లేచాడు…కాదు తన మొహమ్మీద ఏదో స్పర్శ పడేసరికి మెలుకువ వచ్చింది.తలంతా భారంగా వుంది.భార్య చేయి తన మీద పడింది.
పక్కనే భార్య…తన మాయ.ఆమె మోహంలో అలసట..జుట్టంతా చిందర వందరగా వుంది. సింగల్ పీస్ నైటీ పక్కకు తొలిగింది.మల్లెలు యాజిటీజ్ గా వాడిపోయినా ఇంకా ఆ ఫ్లేవర్ ను మంచమంతా పరుస్తూ…వున్నాయి,మాయ చేయి భర్తను దగ్గరకు లాక్కుంది.”ఎంత బావుందో…”ఆమె పెదవులు గొణుగుతున్నాయి.
దిగ్గున లేచాడు శ్రీహర్ష …భార్యను తట్టి లేపాడు “మాయా…మాయా…మాయా “
బద్దకంగా కళ్ళు తెరిచింది .భర్తను గట్టిగా చుట్టేసింది “రాత్రంతా నిద్ర పోనివ్వలేదు…కాసేపు పడుకోనివ్వండి ప్లీజ్…కావాలంటే ఈ రోజు రాత్రంతా మెలుకువగానే వుంటాను “భర్త నడుం చుట్టూ చేయివేసి కళ్ళు మూసుకుంది.
“రాత్రంతా నిద్ర పోనివ్వలేదు…”ఆ మాటలు రీ సౌండ్ లా వినిపిస్తున్నాయి.రాత్రు తను ఫుల్లుగా తగి నిద్రపోయాడు…మరి మాయేమిటి ఇలా అంటుంది.నిద్రలో లేచి నడిచే అలవాటు వున్నట్టు…మత్తులో చేసే జబ్బు తనకు…చ చ తన ఆలోచన తనకే కరెక్ట్ గా అనిపించలేదు…భార్య వైపు చూసాడు…తనను గట్టిగా కరుచుకు పడుకుంది.ఆ టచ్ అతనికి బాగా అనిపించింది.కానీ రాత్రి జరిగిన సంఘటనే….నమ్మశక్యంగా లేదు…కానీ కళ్ళ ముందు కనిపిస్తుంది.
                                                      ***
డైనింగ్ టేబుల్ ముందు కూచున్నాడు .భర్తకు ఇష్టమైన ఐటమ్స్ ప్రిపేర్ చేసింది మాయ .శ్రీహర్షకు తినాలని అనిపించడం లేదు.తను భ్రమలో వున్నాడా?
శ్రీహర్ష భార్య వంక చూసి “మాయా రాత్రి నిజ్జంగా అది జరిగిందా?కాసింత ఇబ్బందిగా,మరి కాసింత సిగ్గుగా అడిగాడు.
“మన ఇద్దరి మధ్య జరిగిన దానికి మరొకరిని సాక్ష్యం తీసుకురాలేను కదా …అయినా నా కన్నా మీకు మందు తాలూకు మత్తే ఎక్కువ…అందుకే మత్తులో అన్నీ మర్చిపోతారు”నిష్టూరంగా అంది మాయ.
“అంత గుర్తు ఉండనంత…?
“మీర్ ఫీల్ అవ్వనంటే ఒకటి చెబుతా…ఆ మధ్య మీ ఫ్రెండ్ ఇంట్లో పార్టీకి వెళ్ళినప్పుడు మీరు బాగా తాగి మీ ఫ్రెండ్ వాళ్ళ స్టోర్ రూం లోకి వెళ్లారు బెడ్ రూం అనుకుని…అక్కడే స్టోర్ రూం లో పడుకున్నారు”
“అవును..ఆ సంఘటన గుర్తు చేసుకుంటూ అన్నాడు.
“ఆ రాత్రి ఓ పంది కొక్కు మీ కాలుని కరిచేసింది.మీకు రక్తం కూడా వచ్చింది.అయినా మీకు స్పృహ రాలేదు …గుర్తు కూడా లేదు కదూ”
“అవును కాసింత సిగ్గుగా అన్నాడు.తన కాలును కొరికి గాయపరచిన ఆ పందికొక్కు తెల్లారేసరికి చచ్చి పడివుంటే తన ఫ్రెండ్స్ జోక్ కూడా చేసారు.
“లిమిట్ మించి తాగితే ఏదీ గుర్తు వుండదు కదండీ..గుడ్ ఆర్ బాడ్..మంచి ఫీలింగ్స్ ను మిస్సవుతాం…మంచి అనుభవాన్ని కోల్పోతాం…నిద్రలోనే జస్ట్ లైక్ దట్ అన్నట్టు…”భర్త మొహంలోకి చూస్తూ అంది.
మౌనంగా ఉండిపోయాడు శ్రీహర్ష,అతనికి పజిల్ గా వుంది.తాగితే అంతగా స్పృహ లేకుండా ఉంటామా?                                                            ***
చాలా నార్మల్ గా అనిపించే విషయం మనల్ని సైకలాజికల్ గా డిస్ట్రబ్ చేస్తుంది.అందుకు శ్రీహర్ష మినహాయింపు కాదు.ఏ విషయాన్నీ అయినా పూర్తిగా తెలుసుకోకుండా వదిలిపెట్టడు.అది అతని నేచర్.మొదట్లో అప్పుడప్పుడు అనుకున్నది ఆ తర్వాత ఎప్పుడూ గా మారింది ఈ వ్యసనం.వ్యసనం చేయిదాటితే ఆ వ్యసనంలో ప్రముఖులు చితికిపోయి చరమదశలో విషాదాన్ని అనుభవించారు.
శ్రీహర్ష తెలివైన వ్యాపారవేత్త ..ఏదైనా తనకు బలమే కావాలి గానీ బలహీనత కాకూడదు.
ఆఫీసు లో ఎక్కువసేపు ఉండలేకపోయాడు.సాయంత్రం కాగానే బార్ దగ్గరికి వెళ్ళాడు.లోనికి వెళ్ళలేదు.నిషా మత్తులో తూగి బయటకు వస్తున్న వాళ్ళను చూసాడు.బార్ కు ఆనుకునే ఉన్న సారాకొట్టులో తాగి బయటకు వచ్చి రోడ్డు మీద పడిపోయిన వాళ్ళను చూసాడు.
వాళ్ళు దగ్గరికి వస్తుంటేనే కంపు కొడుతుంది.మరి తను తాగినా ఇంతేనా?
చీప్ లిక్కర్ తాగి రోడ్డు మీద పడిపోయే వాళ్ళు కొందరైతే…
ఖరీదైన మద్యం తాగి కారుల్లో తూలుతూ వెళ్ళిపోయేవాళ్ళు మరికొందరు.
స్టేటస్ లో తేడా…
అల్కాహాల్ బ్రాండ్ లో తేడా..
కానీ మత్తు…అది ఇచ్చే కిక్కు వేరు వేరైనా రిజల్ట్ ఒక్కటే..బ్రతుకు పతనమే….
మొదటిసారి చాలా కాలం తర్వాత తాగకుండా ఇంటికి వెళ్ళాడు.
                                                            ***
ర్త ఎదురుగా వుంది మాయ
ఆమెనే చూస్తోండిపోయాడు శ్రీహర్ష.”మాయా ఈ రోజు నన్ను నేను చెక్ చేసుకుంటాను..ఇలాగే నిన్ను చూస్తూ వుంటాను.ఈ రోజు తాగలేదు కూడా…నాకు తెలియకుండా నేనేం చేస్తున్నానో నాకు ఈ రోజు తెలియాలి”అన్నాడు.
రాత్రి పది దాటింది.
ఏసీ తాలూకు చల్లదనం…కోరిక తాలూకు వెచ్చదనం ముందు ఓడిపోతూ…వాళ్ళ శరీరాల్లోకి పాకిపోతూ…
అలానే చూస్తున్నాడు శ్రీహర్ష.
తనకు ఇష్టమైన పింక్ కలర్ చీర,,అలా తన ఎదురుగా కూచున్నప్పుడు తొలిగిన పైట నుంచి కనిపించే తనకు అత్యంత ఇష్టమైన మడత…నడుమ్మీద అందమైన పుట్టుమచ్చాలా…. జడలోని మల్లెలు ,గదిలోని వెదర్..వాళ్ళ శరీరాల్లోని కోరికల ఫ్లేవర్ …
భార్య మొహాన్ని రెండు చేతుల్లోకి తీసుకున్నాడు.ఆమె చేయి భర్త భుజాన్ని చుట్టింది.అతని చేయి ఆమె వీపును పరామర్శించింది.
“విస్కీని హస్కీగా టచ్ చేసినట్టు “ఉందా?ఆమె పెదవులు గొణిగాయి
అతని పెదవులు ఆమె మెడ ఒంపు తో మంతనాలు కొనసాగిస్తున్నాయి.
“బ్రాందీని సోడా తో కలుపుకోకుండా రా గా తగినట్టు ఉందా?మాయా గుసగుసగా అంది.
శ్రీహర్ష హిప్నటైజ్ అయినట్టు అక్కడితో ఆగకుండా మెడ ఒంపు సరిహద్దు దాటి ముద్దులతో ఆమె ఎదను శృతి మీటాడు.
జిన్ సిప్ చేస్తున్నట్టు ఉందా?అతడి వీపును చుట్టేస్తూ అడిగింది మాయ
అతను మాత్రం ఏకాగ్రతగా లోతైన ఆమె నాభిని చుంబనంతో బంధించేసాడు.
ఆమె శరీరం అతనికి అయస్కాంత క్షేత్రమైంది .
అతని చేతులు చేతలు ఆమెను సృష్టి సరిహద్దులు దాటించి మరో సృష్టిలోకి తీసుకు వెళ్తున్నాయి.
చెమటే పట్టని పెదవులు స్వేదంతో మెరిసిపోతున్నాయి.
అతని వీపు ఆమె నఖక్షతాలతో గోరింట పెట్టినట్టు ఎర్రబడింది.
ఇద్దరి మధ్య ఓటమి లేని యుద్ధం.
ఆ యుద్ధంలో ఇద్దరూ విజేతలే….
కాక్ టెయిల్ లా ఉందా? భర్తను గట్టిగా హత్తుకుని అడిగింది మాయ.
“కాదు మాయలా వుంది.నా మాయలా వుంది”ఆమె నుంచి విడిపడి.ఆమె ఒడిలో తలపెట్టి ఆమె మంగళ సూత్రాలతో ఆడుకుంటూ అన్నాడు.శ్రీహర్ష.
                                                         ***

ద్దకంగా కళ్ళు తెరిచాడు.పక్కనే ఉన్న భార్యను పొదవిపట్టుకున్నాడు.మాయ భర్త పెదవుల మీద తన పెదవులతో సంతకం చేస్తూ అడిగింది.
“మళ్ళీ రాత్రంతా నిద్ర లేకుండా చేసారు.అందమైన కంప్లయింట్…”
ఒక క్షణం ఖంగు తిన్నాడు.?”మళ్ళీ “అంటున్నావు…సందేహంగా భార్య వంక చూసాడు.ఆమె పెదవులు అందంగా నవ్వుతున్నాయి.కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపించినట్టు….
“అయాం సారీ మాయా…ఈ ప్రపంచంక్లో డబ్బు ఎక్కువ కిక్కు ఇస్తుందనే నమ్మకం..మందు అంత కన్నా ఎక్కువ మత్తు కిక్కూ ఇస్తుందన్న ఫూలిష్ ఫీలింగ్…పగళ్ళు డబ్బు సంపాదించి భార్య బిడ్డలను ప్రేమగా చూసుకోవడానికి
రాత్రుళ్ళు ఆ పని అలసటను,సృష్టి అనివార్యమైన కలయికను ఆస్వాదించడానికే రాత్రుళ్ళను దేవుడు సృష్టించాడేమో …
లిమిట్ దాటి తాగాక మనిషిలో స్పృహ వుండదు.పరువు గురించ ఆలోచించడమూ వుండదు.
తప్పతాగి అ మత్తులో కర్తవ్యాన్ని విస్మరించే నాలాంటి వాళ్ళకు నువ్వు సృష్టించి చూపించిన అందమైన మాయ అద్భుతంగా వుంది.ఇన్నాళ్ళు నా తాగుడును భారించావు.ఏ రోజు నన్ను అసహ్యిన్చుకోలేదు.పైగా నన్ను మార్చుకోవడానికి ప్రయత్నించావు…జయించావు…
రొమాన్స్ ని ,శారీరక కలయికను మించిన మత్తు కిక్కు ఏ మగాడికి,ఏ మొగుడికీ దొరకవు..థాంక్యూ మాయా…”భార్యను చుట్టేసాడు …మరో సారి ఆ మత్తును కిక్కునూ స్వంతం చేసుకోవడానికి సిద్ధమవుతూ….
ఆ క్షణం అతనికి ఓ విషయం గుర్తొచ్చింది.”రాత్రి బుక్ షెల్ఫ్ లో ఉన్న భార్య డైరీ …అ పక్కనే ఉన్న ఓ పుస్తకం చదివాడు..భార్య డైరీతో పాటు…”
ఆ పుస్తకం పేరు మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి.
                                                       ***
రుసటిరోజు రాత్రి చివరిసారిగా అతను బార్ కు వెళ్ళాడు,ఇన్నాళ్ళు తనతో మందును షేర్ చేసుకున్నవారికి ఫేర్ వెల్ పార్టీ..తాగుడుకు గుడ్ బై చెబుతూ ఇచ్చిన పార్టీలో వారికీ ఒకే ఒక విషయం చెప్పాడు..చీర్స్ అంటూ తన చేతిలోని పెగ్ ని బద్దలు కొడుతూ…
“డియర్ ఫ్రెండ్స్..కేవలం నిరర్థకమైన కిక్కుని మత్తును ఇచ్చే ఈ మందు కన్నా మన ఇంట్లో మన భార్యలు మన కోసం ఎదురుచూసే నిరీక్షణ…ఏంటో కిక్కును ఇస్తుంది.వారితో కలిపి షేర్ చేసుకునే ఫిజికల్ అటాచ్మెంట్ ఎంతో మత్తునూ ఇస్తుంది.భార్యను మించిన కిక్కు,,రొమాన్స్ ను మించిన మత్తు మరోటి లేదు..గుడ్ బై ఫ్రెండ్స్…
తాగకుండా అందమైన కిక్కు కోసం అంత కన్నా అద్భుతమైన మత్తు కోసం ఇంటికి బయల్దేరాడు.
మాయ అభిసారికలా ఎదురు చూస్తుంది.
ఒక్కరాత్రి అయినా తాగుడికి గుడ్ బై చెప్పి మీ జీవితభాగస్వామి అందించే కిక్కును మత్తును ఆస్వాదించి చూడండి.
దట్సిట్ .

                                                                           ***
అందుబాటులో వున్న విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

http://kinige.com/ksearch.php?searchfor=vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY