సర్వశుభాలు ఒసగే సర్వమంగళకారిణివి శ్రీ దుర్గా జయ దుర్గా జయహే దుర్గా…

నవరాత్రుల శోభల వెలిగే జగజ్జనని
నవదుర్గవై విలసిల్లే మణి ద్వీపనివాసిని
శుభములనొసగే శక్తి స్వరూపిణి వి
సృష్టి స్తితిలయకారిణి మంజుభాషిణి
ముగురమ్మల మూలపుటమ్మవు
కోటి సూర్య తేజస్సుల వెలిగే దివ్య ప్రకాశిని
నీ పదకమలములు మనసెరిగి పూజింతు
షోడశకళామతల్లికి షోడశోపచారములు
నీకృపాకటాక్షవీక్షణాలతో ధన్యతచెందేము
దుష్టులశిక్షించి..సజ్జనుల రక్షించు దేవి
ఆపన్నులకు అభయమిచ్చే ఆర్తత్రాణపరాయణివి
సర్వశుభాలు ఒసగే సర్వమంగళకారిణివి
శ్రీ దుర్గా జయ దుర్గా జయహే దుర్గా

…మైథిలి 

రాజమండ్రిలో శ్రీశ్రీ కళావేదిక నుంచి విద్యారత్న బిరుదును స్వీకరిస్తోన్న ములుగు చంద్రశేఖరరావు (ఉపాథ్యాయులు)

chandhra

NO COMMENTS

LEAVE A REPLY