ఇద్దరి మధ్య పెరుగుతోన్న దూరం…?సెక్స్ గురించి ఆలోచించడం తప్పా?

ఉదయం లేవగానే ఆఫీస్ గురించి ఆలోచిస్తాం.కెరీర్ గురించి ఆలోచిస్తాం.ఫ్యూచర్ గురించిఆలోచిస్తాం.షాపింగ్ గురించి,సరదాల గురించి ఇలా ఎదో ఒకదాని గురించి ఆలోచిస్తూనే ఉంటాం.
మరి మీ వ్యక్తిగత జీవితం గురించి?
మీ దాంపత్యజీవితం గురించి?
రాత్రి కాగానే,కోరిక పుట్టగానే ఏదో మొక్కుబడిగా కోరికల్ని ఒక డ్యూటీలా ఫీల్ అయ్యి బ్రతికేస్తున్నామా?
అవుననే అంటున్నాయి కొన్ని సర్వేలు.
ప్రాక్టికల్ గా అలోచించి చూడండి.ఒక సర్వే ప్రకారం ఒకరోజు ఎక్కువసార్లు సెక్స్ గురించి ఆలోచించే వ్యక్తి ఆరోగ్యవంతుడై వుంటాడుట…
ఈ అసంతృప్తులే పెరిగిపెద్దవై, మహావృక్షాలుగా మారి అక్రమ సంబంధాలకు దారితీస్తున్నాయని, అవికూడా తృప్తినివ్వలేక హింసాత్మకంగా మారుతున్నాయనీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పురుషులవైపు నుంచి వచ్చే కంప్లైంట్స్ …
తమకు మూడ్ వచ్చినప్పుడు పార్టనర్ సహకరించకపోవడం..
ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడం
మూడ్ లేదనడం
సెక్స్ కు ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వకపోవడం
తమను సెక్స్ పిచ్చోడిలా చూడ్డం.
మహిళల వైపు నుంచి …
తాము చొరవ తీసుకుంటే “తమ వైపు అనుమానంగా చూడ్డం”
లేట్ నైట్ రావడం…మూడ్ వచ్చినప్పుడే తప్ప మిగితా సమయాల్లో ప్రేమగా దగ్గరికి తీసుకోకపోవడం..
సిగరెట్ ,ఆల్కహాల్ తోదగ్గరికి రావడం,ఆ వాసన తమ ఇష్టాన్ని చంపేయడం…
తమ అనుభూతితో సంబంధం లేకుండా యాంత్రికమైన సెక్స్ చేయడం.
సెక్స్ కాగానే అటుతిరిగి పడుకోవడం…
ఇది వ్యక్తిగత సమస్యే…కానీ ప్రమాదకరమైన విషయం.
ఇలాంటి సందర్భంలో దంపతులు కలిసి ఓపెన్ గా మాట్లాడుకోవడం.తమ ఫీలింగ్స్ షేర్ చేసుకోవడం..
అవసరమైతే కౌన్సెలింగ్ తీసుకోవడంవల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
కెరీర్,కామన్ నీడ్స్ ఎంత ముఖ్యమో…దంపతుల మధ్య సెక్స్ అంత కన్నా ముఖ్యం …ఆరోగ్యకరం..
ప్రేరణ కలిగించే విషయం.
దీనికి సంబంధించిన ప్రత్యేక కథనాలు మేన్ రోబో త్వరలో సీరియల్ గా అందిస్తుంది.

NO COMMENTS

LEAVE A REPLY