ఇంకెన్నో నిగూఢరహస్యాలను తనలో దాచుకున్న నార్త్ అవెన్యూ …వండర్ ఫుల్ రైటర్ తేజారాణి తిరునగరి సస్పెన్స్ థ్రిల్లర్ నార్త్ అవెన్యూ (30-10-2016)

కొత్త సీరియల్ ప్రారంభం 
దీపావళి శుభాకాంక్షలు
అక్షరాలకు అందని ఉద్వేగం .నేనేనా?అన్న సందిగ్ధం .
మేన్ రోబోలో ఇది నా అయిదవ సీరియల్.ఇది నాకు దక్కిన అదృష్టం…
మీ అభిమానం అందించిన బలం…మేన్ రోబో ఇచ్చిన వరం.
ఇంతకన్నా రాయడానికి అక్షరాలు సరిపోవడం లేదు..కృతఙ్ఞతలు చెప్పడానికి మరో పదం దొరకడం లేదు.థాంక్యూ థాంక్యూ సోమచ్….తేజారాణి తిరునగరి
ది బిగినింగ్
శూన్యం నుంచి విసిరివేయబడ్డ చీకటి గ్రహశకలం ముక్కలై ఆ ప్రాంతంలో వెదజలినట్టు వున్న దట్టమైన అడవిప్రాంతం
ఆ అడవి మధ్యలో చేతబడి చేసినట్టున్న పాడుబడిన అవెన్యూ
స్వాతంత్ర్యానికి ముందే బ్రిటిషువాడు ముచ్చటపడి నిర్మించుకున్న పురాతనకట్టడం.
చరిత్రలో మరుగున పడిన నెత్తుటి చారలు నార్త్ అవెన్యూ లో సమాధి చేయబడ్డాయన్న వదంతి నార్త్ అవెన్యూ ని నిషిద్ధ ప్రాంతంగా మార్చింది.
ఎన్నో కథలు
మరెన్నో నెత్తుటిచారికలు
ఇంకెన్నో నిగూఢరహస్యాలను తనలో దాచుకున్న నార్త్ అవెన్యూ కోరలుచాచి ఆహ్వానిస్తున్నట్టు వుంది.
నార్త్ అవెన్యూ పరిసర ప్రాంతాన్ని చాలా మేరకు కవర్ చేసి చుట్టూ ఇనుపకంచె వేసి..
నిషిధ్ధప్రాంతం…“అని రాసివున్న పాడుబడిన నలుపురంగు చెక్కబోర్డు మృత్యువులా కనిపిస్తుంది.
ఆ దారి నుంచి సిటీకి వెళ్లే మార్గం ఎప్పుడో మూసివేశారు.
అప్పుడప్పుడు దోపిడీదొంగలు,సంఘవిద్రోహకశక్తులు ,నార్త్ అవెన్యూ గురించి పరిశోధన చేయాలనుకునే వారు…అటువైపు వస్తారు.
అటుగా వచ్చినవారు ప్రాణాలతో తిరిగిపోలేదని జరిగిన సంఘటనలు చెబుతున్నాయి.
పోలీసులు పెట్రోలింగ్ చేయాలన్నా భయపడే ప్రాంతమే నార్త్ అవెన్యూ
నార్త్ అవెన్యూ కు సంబంధించిన కేసులు చాలా పెండింగ్ లో వున్నాయి.
ఆ కేసును పరిశోధించడానికి వెళ్లిన పోలీస్ అధికారులు రకరకాల కారణాలతో మరణించడం మిస్టరీగా మారింది.
***
రైల్వే స్టేషన్ లో దిగిన ఆ నలుగురు కుర్రాళ్ళు, ఒకమ్మాయి టాక్సీ స్టాండ్ దగ్గరికి వచ్చారు.అప్పటికే టాక్సీలు చుట్టుముట్టాయి.
ఏ టాక్సీలో వెళ్లాలో తెలియక సతమతమవుతూ ఉంటే…”నార్త్ అవెన్యూ”కు వెళ్ళాలి.చెప్పాడు ఆ కుర్రాళ్లలో ఒకడు.
అప్పటివరకు గుమిగూడిన టాక్సీలు అక్కడి నుంచి మాయమయ్యాయి.
“నార్త్ అవెన్యూ’అన్న మాట విని అక్కడే చిరిగిన దుప్పటి కప్పకుని ముసుగుతన్ని పడుకున్న డెబ్భయేళ్ల వృద్ధుడు ఉలిక్కిపడి దుప్పటి తొలిగించి వారివైపు చూసాడు.
ఇది జరిగిన ఇరవైనాలుగు గంటల తర్వాత…
(ఆ కుర్రాళ్ళు ఏమయ్యారు?వచ్చే సంచికలో)
వండర్ ఫుల్ రైటర్ తేజారాణి రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/ksearch.php?searchfor=tejarani

NO COMMENTS

LEAVE A REPLY