సక్సెస్ స్టోరీ…అనగనగా ఒక గృహిణి ..యు ట్యూబర్ గా మారి…

( మేన్ రోబో ) ఆగష్టు 28
ఓటమి అంటే గెలవలేకపోవడం కాదు.గెలిచేవరకు పోరాడలేకపోవడం
జీవితంలో ఒక అచీవ్మెంట్..ఒక పాజిటివ్ ఆలోచన ఒక వ్యక్తి జీవితాన్నే కాదు…ఎందరి జీవితాలనో ప్రభావితం చేస్తుంది.ఎవరో వస్తారని,ఎదో చేస్తారని కాదు..మనం ఒక్కడుగు ముందుకు వేస్తే వేనవేల అడుగులవుతాయి.సక్సెస్ మంత్రం అవుతుంది.
ఇది యువతరం నవతరం గృహిణి ఆలోచన
ఆమె ఒక సాధారణ గృహిణి.
సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంది.స్వయం ఉపాధితో తన ఐడెంటిటీని కోల్పోకుండా నిలుపుకుంది..అందుకు ఆమె భర్త తోడుగా నిలిచాడు.మారుతున్న టెక్నాలజీ,కొనసాగుతున్న యు ట్యూబ్ ట్రెండ్ ఆమెను సక్సెస్ వైపు అడుగులు వేయమని చెప్పింది.

సక్సెస్ స్టోరీ ని ఆ గృహిణి మాటల్లోనే వినండి.
అది నేను 2022 ఏప్రిల్
” జీవితంలో ఏదైనా సాధించాలి,కొండంత కాకపోయినా గోరంత తోడుగా నిలబడాలి.సమయాన్ని సద్వినియోగం చేసుకుకోవాలి.ఈ ఆలోచనతోనే ప్రారంభించిన ఛానల్  BS Stories Telugu.
ఛానల్ Monetization అయ్యింది..ఆ ఆనందకర క్షణాలను అనుభూతించేలోగా మాతృత్వపు అనుభూతి నన్ను స్పృశించింది.నేను కన్సీవ్ అయ్యాను.ఇంత కన్నా ఆనందకర క్షణాలు ఏముంటాయి.? అలా ఛానల్ కు కొంత అనివార్యమైన గ్యాప్ వచ్చింది.
నా నిరీక్షణకు తెరదించుతూ మా ఇంట్లోకి మా జీవితాల్లో వెలుగు నింపుతూ పాప…
ఓ పక్క పాప ఆలనాపాలనా,మరో పక్క ఛానల్.
ఈ సమయంలో నా వెన్నంటి వెన్నుతట్టిన నా భర్త
నాతో కలిసి ఛానల్ నిర్వహణలో సహకారం  అందించిన స్నేహ బృందం.
పత్రికలు దాదాపు కనుమరుగయ్యాయి.వేళ్ళ మీద లెక్కించే పత్రికలు
కథలు చదివే తీరిక లేని వారికి,
ప్రయాణంలో కాలక్షేపాన్ని కోరుకునేవారికి
కళ్ళకు శ్రమ లేకుండా ఒంటరిగా ఉన్నప్పుడు కథాప్రపంచం లో విహరించాలని అనుకునేవారికి ..
వీనులవిందుగా కథలు వినిపించడం వృత్తిపరమైన సంతృప్తి.”అంటున్నారు.
తను ఉపాధి పొందుతూ మరికొంత మందికి ఉపాధి కలిగిస్తూ,శ్రోతలకు ఆహ్లాదాన్ని కాలక్షేపాన్ని కలిగిస్తూ,తెలుగు కథలకు తన స్వరాన్ని జోడించి మరికొందరికి స్ఫూర్తిగా మారింది.
ఆ ఛానల్ పేరు BS Stories Telugu  ..
ఆమెకు సహకారం అందించిన స్నేహితులు,
వెన్నంటి అండగా నిలిచిన భర్త
సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన ఐడెంటిటీని ఇన్స్పిరేషన్ గా పరిచయం చేసిన ఒక గృహిణి..
ఇదీ BS Stories Telugu  .సక్సెస్ స్టోరీ…
BS Stories Telugu  ఛానల్ లింక్ మీ కోసం !

NO COMMENTS

LEAVE A REPLY