vrk1

1

మేన్ రోబో నేపథ్యం  …

పత్రిక అందుబాటులో లేని తెలుగువారికి.పాఠకులకు ఒక చిన్న క్లిక్ తో చేరువ కావాలన్న ప్రయత్నానికి ఇది శుభారంభం.
2002 లో ప్రముఖ రచయిత విజయార్కె రాసిన పాపులర్ నవల మేన్ రోబో అదే పేరుతొ ఆన్ లైన్ మేగజైన్ గా 2011 లో ప్రారంభమైంది.
1980 లో రచయితగా కెరీర్ ప్రారంభించిన విజయార్కె నలభైకి పైగా నవలలు .దాదాపు ఆరు వందలకు పైచిలుకు కథలు,పది వ్యక్తిత్వ వికాస పుస్తకాలు రాసారు…
జర్నలిస్ట్ గా కాలమిస్ట్ గా వందలాది వార్తాకథనాలు పరిశోధనాత్మక రచనలు చేసారు.
మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి..అసంతృప్తిని జయించండి ..నిర్ణయం (స్వాతి మంత్లీ నవల)సెక్షన్ 494 (ఆంధ్రభూమి నవల)లాంటి రచనలు కన్నడ బాషలోకి అనువదించబడ్డాయి.
జైలు గోడల మధ్య హీరో సుమన్,లాంటి పరిశోధనాత్మక రచన ఆంధ్రభూమి వీక్లీ లో సంచలనం సృష్టించింది.
క్యూ.మేన్ రోబో లాంటి ఫిక్షన్ థ్రిల్లర్స్.
సెక్షన్ 494…అండర్ వరల్డ్..,జడ్జ్ మెంట్ .నిర్ణయం …కుబేరాయనమః వారసుడు హీరో పోలీస్ భస్మ సింహాసనం లాంటి  విభిన్న రచనలు…హాస్యం క్రైమ్ థ్రిల్లర్ రొమాన్స్ ఇలా విభిన్న ప్రక్రియల్లో తెలుగులోని అన్ని ప్రముఖ పత్రికల్లో(స్వాతి ఈనాడు ఆంధ్రభూమి ఆంధ్రజ్యోతి చతుర విపుల నవ్య ఇండియా టుడే ) రచనలు చేసిన విజయార్కె చీఫ్ ఎడిటర్ గా …
మనిషి మేథస్సు,యంత్రం (టెక్నాలజీ )జీనియస్ కలిసిన మీ ముందుకు వచ్చిన అక్షరాల అంతర్జాల పత్రిక మేన్ రోబో.
రచయితల పాపులార్టీతో పాటు ప్రతిభావంతులైన పాఠకుల్లొ వున్న రచయితలను పాపులర్ రైటర్స్ గా మార్చడానికి మేన్ రోబో ఒక వేదిక కావాలన్న ఆకాంక్ష.
ప్రపంచమంతా విస్తరించి వున్న వున్న తెలుగు వారిని ప్రతీ క్షణం పలకరించే అక్షరాల సవ్వడి.అరచేతి (మొబైల్)లో సైతం మీకు అక్షర ప్రపంచం చూపించాలనే ఆలోచనకు అంకురార్పణ.
మీరు ఏ రాష్ట్రంలో వున్నా.ఏ దేశంలో వున్నా సముద్రాల ఆవల వున్నా మీరు పుట్టిన ఊరుని మర్చిపోలేరు.
ఆ జ్ఞాపకాలను మీరు మేన్ రోబో ద్వారా పంచుకోవచ్చు. మీలో వున్న ప్రతిభను మేన్ రోబో ద్వారా ఆవిష్కరించవచ్చు.
మీరు విదేశాల్లో లేదా ఇతర రాష్ట్రాల్లో ..మీరు ఏ ప్రాంతంలో వున్నా అక్కడి విశేషాలు.సాంప్రదాయాలు ఆసక్తికర అంశాలు మాకు రచనల రూపంలో పంపించవచ్చు.
మేన్ రోబో తెలుగు ఇండియా యు ట్యూబ్ చానెల్ లో మేన్ రోబో నిర్మించిన షార్ట్ ఫిల్మ్స్ వార్త విశేషాలు చూడవచ్చు.మీ ప్రాంత విశేషాలను వీడియో రూపంలో పంపించవచ్చు.
ఆ లింక్ మీ కోసం

సూపర్ స్టార్ రజనీకాంత్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన రోబో సినిమా సమయంలో చిన్న వివాదానికి తెర లేసింది.
రోబో మేన్ రోబో లో కనిపించే రెండు పోలికలు …హీరో ద్విపాత్రాభినయం …హీరో రోబో గా నటించడం …హీరో రోబో రెండు పాత్రలను ఒకే వ్యక్తి పోషించడం…క్లారిఫికేషన్ కోసం మీడియా ముందుకు రాక తప్పని పరిస్థితి.టీవీ చానెల్స్ లో వచ్చిన లింక్ చూస్తే…మేన్ రోబో వివాదానికి కారణం తెలుస్తుంది.

రోబో పేరుతొ సూపర్ స్టార్ రజనీ కాంత్ సినిమా విడుదలకు ముందే మేన్ రోబో కు రోబో కు మధ్య కాంట్రవర్సీ మీడియాలో వచ్చింది.ఎందుకంటే ఒకే వ్యక్తిని పోలిన మరో వ్యక్తి వున్నప్పుడు మన తాలూకు వ్యక్తి ఎవ్వరో పోల్చుకోవడం తప్పనిసరి. తెల్చుకోవదమూ తప్పనిసరి.ఆ ప్రయత్నమే నేను చేశాను.వీలయితే యు ట్యూబ్ లో మీడియాలో వచ్చిన కథనాలు.నా ఇంటర్ వ్యూ చూడవచ్చు.ఈ విషయంలో నా ఫీలింగ్స్ ని అర్థం చేసుకుని సపోర్ట్ చేసిన ఎలక్ట్రానిక్ ప్రింట్ వెబ్ మీడియాకు కృతఙ్ఞతలు. నా నవల కోమా స్థితిలో ఉండకూడదనే ఉద్దేశంతోనే మీడియా ముందుకు రావడం జరిగింది.
రోబో మేన్ రోబో వేరు వేరు ….అని ట్విన్స్ మాత్రమే అని ఈ వివాదం ద్వారా తెలియజెప్పడం నాకు అనివార్యం అయ్యింది.
మేన్ రోబో నవల చదివితే ఈ విషయం మీకు స్పష్టమవుతుంది.
ఒక విధంగా రోబో మేన్ రోబో కవలలు లా అనిపిస్తారు.ఒకే కాన్సెప్ట్…కథాంశం వేరు కావచ్చు.అసలు విషయం తెలియనప్పుడు కన్ఫ్యూజన్ తప్పనిసరి కదా ! ఒక హీరో…మరో హీరో ..ఇద్దరు ఒకేలా వుంటారు ..కానీ అన్నదమ్ములు కారు…మిత్రులు కారు…అసలు ఇద్దరిలో ఒకరు మనిషి కాదు.అచ్చు హీరోలా వున్న రోబో (యంత్రం) సినిమా పరిభాషలో ద్విపాత్రాభినయం.
మేన్ రోబో లోనూ.సూపర్ స్టార్ రజనీ కాంత్ రోబో లోనూ వున్న అతి కీలకమైన పోలిక…
2002 లో నేను రాసిన మేన్ రోబో నవలకు ..
2010 లో వచ్చిన రోబో సినిమా కాంట్రవర్సీకీ ముఖ్యమైన కారణం ఇదే…
ఈ నవలలో అగ్నిహోత్ర పాత్రను మేన్ రోబో డామినేట్ చేస్తుంది…
మేన్ రోబో ఎవ్వరో తెలియక అగ్నిహోత్రగా భావించి మేన్ రోబోప్రేమలోపడ్డ సిబీఐ డిప్యూటీ చీఫ్ షర్మిల…కు ఆ నిజం తెలిసేసరికి ఏమవుతుంది? భార్యాబిడ్డలు ప్రపంచం పిచ్చివాడుగా ముద్ర వేసిన రిచర్డ్ చేసిన ప్రతిసృష్టి మేన్ రోబో కు అగ్నిహోత్రకూ సంబంధం ఏమిటి?
ఈ ప్రశ్నలకు సమాధానమే మేన్ రోబో…
మనిషికీ మరమనిషికీ వున్న అనుబంధం ,సంబంధం భావోద్వేగాల సమ్మేళనం ఈ నవల.
మేన్ రోబో నవల ఇప్పుడు ద్వితీయ ముద్రణతో ఇ బుక్ గా మీ ముందు వుంది.
ఆ లింక్ మీ కోసం.

Follow Us

0FansLike
0FollowersFollow
24FollowersFollow
47SubscribersSubscribe