స్వరాలకే స్వరవరాన్ని వరంగా ఇచ్చిన మహనీయుడు …సప్తస్వరాలకు తనస్వరాన్ని జతచేసిన విద్వత్తుశిఖరం.
(తేజారాణి తిరునగరి)
ఆ గానం అనితరం…ఆ గళం అపూర్వం… ఆ స్వరం హిమవన్నగం.
ఒక స్వరఝరి మహాప్రస్థానం …వేనవేల కోయిలల మౌనానివాళి..స్వరాల శ్రద్ధాంజలి
మూగబోయిన స్వరప్రపంచం..విస్తుపోయిన గానసంద్రం….
ఏమి సేతురా లింగా అంటూ జీవితసత్యాలను ఆవిష్కరించిన గళం అమరపురికి చేరింది
తత్వాలతో జీవనసారాన్ని సృజించిన గొంతుక ఇక సెలవంది..
బొడ్డుతాడు బంధాన్ని పదిహేను రోజులకే తెంపేసుకుని వెళ్లిపోయిన అమ్మప్రేమను, గోరుముద్దలను, లాలిపాటలనూ ఎరుగని ఆయన తనకు జన్మనిచ్చిన ఆమె పేరుతో ఆ తర్వాత ‘సూర్యకాంతి’ పేరుతో అపూర్వ రాగాన్ని సృజించిన ఘట్టం..విధాతనే నివ్వెరపర్చింది.
అన్నమాచార్య కీర్తనకు ‘సూర్యకాంతి’ని అద్దారు. వేనవేల గొంతుకల్లో తన తల్లి రాగమై పలికేలా అజరామరం చేశారు.
రాగాల సృజనతో అపరబ్రహ్మ…కనుమరుగైన రాగాలకు స్వర శ్వాసను అందించిన మురళీకృష్ణుడు.
ఆ స్వరం గురించి చెప్పాలంటే అక్షరాలు సరిపోవు…
డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ …అన్నపేరు వింటేనే రాగాలు కైమోడ్పు అంటాయి.
కోట్లాది శ్రోతల హృదయాలు జేజేలు పలుకుతాయి
కోట్లాది హృదయాల్లో నిలిచిన ఆ స్వరమాంత్రికుడి మహాప్రస్థానానికి అక్షరనివాళి
ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్