సినిమాల్లో ఎన్నో ప్రేమ కహానీలు
నిజజీవితంలో లవ్ స్టోరీస్
అనుభూతిలో నుంచి మొదలైన ప్రేమ
ఆరాధనలో అంకురించిన ప్రేమ
మెచ్యూరిటీతో మొదలైన ప్రేమ నిత్యనూతనం..
అనుభూతి పర్యంతం
అలాంటి ప్రేమ కథ
అందమైన ప్రేమ కథ
ఇది ఒక అందమైన ప్రేమ పుస్తకం
పెళ్లి పుస్తకానికి ముందు ప్రోమో పుస్తకం
సీఎం రేవంత్ రెడ్డి అందమైన ప్రేమకథ
తన వ్యక్తిత్వమే తనకు ఒక అద్దం
ఆ అద్దంలో కనిపించే ప్రతిబింబం మిసెస్ గీతా రేవంత్ రెడ్డి గారు.
కాలంతో పాటు కదిలిన ప్రేమ కథ లో ఎన్నో పేజీలు
పెళ్లి పుస్తకంలో అందమైన అధ్యాయం కూతురు నైమిషా రెడ్డి.
ప్రేమ పుస్తకం లోని మొదటి పేజీలో కి వెళ్తే..
వీళ్ళ ప్రేమ కథలో ఆకర్షణ లేదు..ఆరాధన వుంది
ఒకరినొకరు అర్థం చేసుకునే మెచ్యూరిటీ ఉంది.
గీతా రెడ్డి గారి మాటల్లో చెప్పాలంటే..
ఇంటర్ నుంచే మా అందమైన ప్రేమ మొదలైంది.
నవ్వుతూ చెబుతారు గీతా రెడ్డి
తనలోని నిజాయితీ నచ్చింది.
తన వ్యక్తిత్వమే తనకు నేను దగ్గరయ్యేలా చేసింది
నేను నేనులా ఉండడమే తనకు నచ్చిందేమో..
నన్ను ఎందుకు ప్రేమించారన్న ప్రశ్నకు తన నుంచి సమాధానం ఇప్పటివరకు లేదు.ఇందాక చెప్పినట్టు నేను నాలా ఉండడమే తనకు నచ్చి ఉంటుంది.
ఇతరులను అర్థం చేసుకోవడం
ముక్కుసూటిగా మాట్లాడటం
తన అభిప్రాయాలు స్పష్టంగా చెప్పడం ..తనలో నాకు బాగా నచ్చే విషయాలు అంటారు మిసెస్ గీతా రేవంత్ రెడ్డి.
తర్వాత రెండు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
ముందు ఒప్పుకోకపోయినా రెండు కుటుంబాల అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నారు.
క్యాలెండర్ లో సంవత్సరాలు మారినా
రుతువులు కాలచక్రంలో కదిలినా,
వాళ్ళ ప్రేమ మారలేదు
చెక్కుచెదరని నమ్మకం
విడదీయలేని అనుబంధం
ఆ దంపతుల మధ్య పరిఢ విల్లుతూనే వుంది.
ప్రేమ పుస్తకం,పెళ్లి పుస్తకం గా మారింది
అందులో కూతురు అనే అందమైన అధ్యాయం చోటు చేసుకుంది
కూతురు నైమిషా రెడ్డి వివాహం జరిగింది
ప్రేమికులు దంపతులు అయ్యారు
దంపతులు తల్లిదండ్రులు అయ్యారు
వారి ప్రేమకథ ఒక మంచుపల్లకి
నిత్యం ప్రేమ పరిమళాలు వెదజల్లే వారి జీవితం ఒక పూలవనం
ప్రతి క్షణం వికసించే పుష్పం
ప్రతి జ్ఞాపకం మనసు పొరలను చుట్టేసి పరిమళం
రేవంత్ రెడ్డి గారి డీ కూతురు నైమిషా రెడ్డి ఇలా అంటున్నారు
నాన్న అందరికి సీఎం అయితే,అమ్మ నాన్నకు హోమ్ మినిస్టర్