Happy Christmas
(9)
పోలీస్ వెహికల్ హాస్పిటల్ ముందాగింది.అందులో నుంచి ఇన్స్పెక్టర్ జేమ్స్,స్వాప్నిక దిగారు.ఇన్స్పెక్టర్ తనను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చాడో అర్థం కావడం లేదు స్వాప్నికకు.ఇన్స్పెక్టర్ జేమ్స్ ఆమెను సరాసరి ఐసియు కు తీసుకువెళ్లాడు.ఐసీయూలోకి అడుగుపెట్టిన స్వాప్నిక షాక్ తింది.బెడ్ మీద కోమాలో తను వెతుకుతున్నవ్యక్తి…వంశీకృష్ణ
“చూడండి మేడం…చాలా జాగ్రత్తగా చూడండి.ఇవ్వాళ ఉదయం మీఇంటికి వచ్చి బెదిరించిన వ్యక్తి ఇతనే కదా?నార్త్ అవెన్యూ దగ్గర ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది..ఇతను తీవ్రమైనగాయాలతో కోమాలోకి వెళ్ళిపోయాడు.నిన్నసాయంత్రమే కోమాలోకి వెళ్ళినవ్యక్తి ఈ రోజు ఉదయమే ఎలా మీ ఇంటికి వచ్చి మిమల్ని బెదిరిస్తాడు ?స్వాప్నిక వంక సూటిగా చూస్తూ అడిగాడు.
“లేదు ఇతన్ని ఈ రోజు ఉదయమే నన్ను బెదిరించాడు”స్వాప్నిక కవర్ చేసుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తోంది.ఒక తప్పును కప్పి పుచ్చుకోవడానికి మరోతప్పు చేయవలిసి వస్తుంది.
“వెళ్ళండి మేడం మీరు అమ్మాయి కాబట్టి,అందులోనూ డాక్టర్ వృత్తిలో వున్నారు కాబట్టి మీమీద ఆక్షన్ తీసుకోవడం లేదు..”చెప్పాడు ఇన్స్పెక్టరు జేమ్స్.
పరిస్థితి అంచనా వేసుకుంది.ఈ పరిస్థితిలో తనేం చేసినా కష్టమే.అందుకే కామ్ గా బయటకు నడిచింది.
సరిగ్గా గంట తర్వాత తనకు తెలిసిన డాక్టర్ ఫ్రెండ్ ద్వారా ఎంక్వయిరీ చేసింది.అతడిని నిన్న సాయంత్రమే అడ్మిట్ చేసినట్టు రికార్డ్స్ లో వుంది.అయితే అతను కూడా నార్త్ అవెన్యూ కి వెళ్ళాడు.ఎలాగైనా ఈ రోజు అతడిని ఫినిష్ చేయాలి.తన అన్నయ్య చావుకు కారణం అయిన వ్యక్తిని చంపేయాలి.అప్పటికే స్వాప్నిక ఓ నిర్ణయానికి వచ్చింది.
***
స్వాప్నిక హాస్పిటల్ నుంచి వెళ్లిపోయిందని నిర్ధారణ కాగానే జేమ్స్ అనిరుద్ర దగ్గరికి వచ్చాడు.
“ఇపుడు నన్నేం చేయమంటారు సర్ ?అడిగాడు
“మీరు స్వాప్నికను ఫాలో అవ్వండి.ఆమె ప్రాణాలకు ముప్పు పొంచి వుంది.తన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని తెలియక నా ప్రాణాలు తీయాలని వెంట పడుతోంది…”చెప్పాడు అనిరుద్ర.
“ష్యూర్ …మీరు చెప్పినట్టే చేస్తాను…’ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జేమ్స్
ఐసియులో అనిరుద్ర ఎర్విక్ ఇద్దరే వున్నారు.పరిసర ప్రాంతంలో మఫ్టీలో పోలీసులు వున్న విషయం ఎవ్వరికీ తెలియదు..ఒకేఒక వ్యక్తికీ తప్ప..ఆ ఒక్కరు ఎవరు?
***
“ఎర్విక్ మనం ఇప్పుడు ఒకవ్యక్తిని కలవాలి…కాదు కాదు అతడినే ఇక్కడికి తీసుకురావాలి”చెప్పాడు అనిరుద్ర
“ఎవరా వ్యక్తి ?అన్నట్టు చూసింది ఎర్విక్
“డాక్టర్ పరమహంస సైంటిస్ట్ …అతను సైకాలజిస్ట్ కూడా…నార్త్ అవెన్యూ లో ఆత్మలు వున్నాయన్న ప్రచారం వుంది.అయితే ఆత్మలు ఉన్నాలేకున్నా..ఒక శక్తి వుంది.ఆ శక్తి ఏమిటో తెలియాలి.నార్త్ అవెన్యూ గురించి పరమహంస రీసెర్చ్ చేసినట్టు మనదగ్గర ఇన్ఫర్మేషన్ వుంది”చెప్పాడు అనిరుద్ర.
“మనమే డైరెక్ట్ గా నార్త్ అవెన్యూ కు వెళ్లొచ్చు కదా”ఎర్విక్ అడిగింది.
“వెళ్లొచ్చు..కానీ ఈ లోగా కొందరు జారుకోవచ్చు…అంతేకాకుండా నార్త్ అవెన్యూ వెళ్లి బ్రతికి వచ్చిన ఒకేఒకవ్యక్తి సైంటిస్ట్ పరమహంస..ఈ విషయం ఎవరికీ తెలియదు.ఆటను కూడా ఈ విషయాన్నీ చెప్పడానికి ఆసక్తి చూపించలేదు.నార్త్ అవెన్యూ లో ఎదో భయంకరమైన శక్తి ఉందని అతని నమ్మకం”
చిన్నగా నవ్వి అంది”సైంటిస్ట్ కూడా శక్తులను నమ్ముతారా?
“హాస్పిటల్ లో దేవుడికి పూజలు చేస్తారు.అంతరిక్షంలోకి రాకెట్ ని పంపించే ముందూ పూజలు చేస్తాం..నమ్మకం పర్లేదు ..మూఢనమ్మకం అయితేనే ప్రమాదకరం.చొద్దం సైంటిస్ట్ పరమహంసది నమ్మకమో…మూఢనమ్మకమో. ..అని ఆగి..భవిష్యత్తే చెబుతుంది “అన్నాడు.
సరిగ్గా అదేసమయంలో..
తన టూ వీలర్ మీద వెళ్తుంది స్వాప్నిక….ఆమె మనసంతా గజిబిజిగా వుంది.ఆ ఆలోచనల్లో రోడ్డుకు ఓ పక్కగా టూ వీలర్ మీద వెళ్తుంది.మూలమలుపు తిరుగుతుండగా ఓ లారీ రోడ్డు మీదికి వచ్చింది.రోడ్డు మధ్యలో కాకుండా..రోడ్డు పక్కగా స్పీడ్ గా వస్తుంది.స్వాప్నిక వైపు మృత్యుశకటంలా దూసుకువస్తుంది.క్రమక్రమంగా లారీ కి స్వాప్నిక వెహికల్ కు మధ్య దూరం తగ్గుతుంది.కేవలం కొన్ని అడుగుల దూరమే…అప్పుడే స్వాప్నిక మొబైల్ రింగ్ అయ్యింది.
బ్రేక్ వేసి టూ వీలర్ ని ఆపే ప్రయత్నం చేయబోతూ… వెహికల్కు ముందు వున్న అద్దంలో చూసింది.మృత్యువుకు క్షణాల దూరంలో వున్న లారీ.
***
ఈ హత్యాప్రయత్నం వెనుక ఉన్నదెవరు?స్వాప్నిక ఈ ప్రమాదం నుంచి బయటపడుతుందా? వచ్చేవారం వరకూ…బీ అలర్ట్
తేజారాణి తిరునగరి రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/ksearch.php?searchfor=tejarani
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్
http://kinige.com/ksearch.php?searchfor=tejarani
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్