మరణానికి అనిరుద్ర కు మధ్య కొద్ది క్షణాల వ్యవధి దూరమే…వండర్ ఫుల్ రైటర్ తేజారాణి తిరునగరి సస్పెన్స్ థ్రిల్లర్ నార్త్ అవెన్యూ (08-01-2017)

సంక్రాంతి శుభాకాంక్షలు
   (11)
మనసులోని కసి,తన అన్నయ్యను చంపినవాడిని చంపాలన్న ప్రతీకారం ఆమెను మరోక్షణం కూడా ఆలోచించేలా చేయలేదు.ఎలా చంపాలి?కోమాలో వున్న వ్యక్తిని చంపడం పెద్ద కష్టం కాదు.అందులోనూ తను డాక్టర్..ఊపిరిఆడకుండా గిలగిల కొట్టుకుని చావాలి…ఊహూ కాదు కత్తితో పొడిస్తే ?పేగులు బయటకు రావాలి…అంత క్రూరంగా ఆలోచిస్తోంది స్వాప్నిక.
అన్నయ్య మరణం ఆమెను ఆలా మార్చేసింది.పక్కనే టీపాయ్ మీద కత్తి వుంది.కత్తిని చేతిలోకి తీసుకుంది.ఆమె చేతులు వణుకుతున్నాయి.డాక్టర్ గా కత్తితో సర్జరీలుచేసి ప్రాణాలు కాపాడిన తను…ఓ వ్యక్తిని అదీ కోమాలో వున్న వ్యక్తిని నిర్ధాక్షిణ్యంగా చంపాలా?
ఆమెలో ఎథిక్స్ ఇంకా బ్రతికే వున్నాయి.అలాగే ఒక మాములు సగటు చెల్లెలు..అన్నయ్యను చంపినవాడి మీద ప్రతీకారం తీర్చుకోవాలని అనుకునే సాధారణ బలహీనత కూడా బ్రతికే వుంది.
రెండింటి మధ్య సంఘర్షణలో ఆమె ఓ బలహీనక్షణం తన అన్నయ్య చావుకు కారణమైన వ్యక్తిని చంపాలనే బలమైన నిర్ణయానికి వచ్చింది.కత్తిని పైకి ఎత్తింది.
మరణానికి అనిరుద్ర కు మధ్య కొద్ది క్షణాల వ్యవధి దూరమే.కత్తి వేగంగా అతని ఛాతీవైపుకు దూసుకువస్తోంది.అనిరుద్ర అప్పుడు కళ్ళు తెరిచాడు.
“మీ కసి కళ్ళలోనే కాదు కత్తిని పట్టుకున్న చేతిలో కూడా కనిపిస్తోంది స్వాప్నిక”అన్నాడు.
అతని ఛాతీకి వెంట్రుకవాసి దూరంలో వున్న కత్తి అలాగే ఆగిపోయింది.ఒక్కక్షణం స్వాప్నిక చేయి విభ్రాంతికి గురైంది.
“మీ అన్నయ్యను చంపినవాడిని నువ్వు చంపాలనుకోవడం సినిమా థియరీ ప్రకారం ఓకే.కానీ అలోచించి చూస్తే కరెక్ట్ కాదు స్వాప్నిక.మరో విషయం “మీ అన్నయ్యను ఎవరు చంపారో,మీ అన్నయ్య చావుకు ఎవరు కారణమో కూడా తెలుసుకోలేని నీ తొందరపాటుకు సారీ…”చాలా కామ్ గా అన్నాడు.
ఇంకా స్వాప్నిక షాక్ నుంచి కోలుకోనేలేదు.కోమాలో వ్యక్తి బయటకు రావడం,తన గురించి,తన మనసులోని మాట గురించి,తన పగ గురించి అన్నీ చెప్పేయడం…
అప్పుడే పక్కనే వున్న కర్టెన్ చాటునుంచి ఎర్విక్ వచ్చింది.అనిరుద్ర లేచి మంచానికి ఒరిగి కూచున్నాడు…పక్కనే వున్న లాప్ టాప్ ఓపెన్ చేసి స్వాప్నిక వైపు తిరిగి “ఇలా రా”అన్నట్టు చూసాడు.మంత్రముగ్ధలా అతను చెప్పినట్టే చేసింది.
లాప్ టాప్ లో ఓ వీడియో ప్లే అవుతుంది.అందులో నార్త్ అవెన్యూ దగ్గర తన అన్నయ్య డెడ్ బాడీనీ పోలీసులు తీసుకువెళ్తోన్న క్లిప్ వుంది.పోలీసులు గబగబా రావడం…తన అన్నయ్య డెడ్ బాడీని అంబులెన్సు లోకి షిఫ్ట్ చేయడం…
ఆ దృశ్యం కాదు ఆమెను మరింత విస్మయానికి గురి చేసింది.అంబులెన్సు లోకి తన అన్నయ్యను షిఫ్ట్ చేస్తున్నప్పుడు వంశీకృష్ణ అక్కడే వున్నాడు..అతనే స్వయంగా అన్నయ్య బాడీని అంబులెన్సులోకి చేరుస్తున్నాడు.అతని కళ్ళలో కన్నీళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మీ అన్నయ్య సిబిఐ ఆఫీసర్.నార్త్ అవెన్యూ కేసును సాల్వ్ చేయడానికి నాకన్నా ముందు వచ్చిన ఆఫీసర్…ఈ కేసు పూర్తయ్యాక తనెవరో నీకు చెబుతానన్నారు.
మీ అన్నయ్య చనిపోయే ముందు నన్ను కాంటాక్ట్ చేసాడు.బాడ్ లక్ అతడిని మేము రక్షించుకోలేపోయాం.ఈ విషయాన్నీ మీకు చెప్పాలని అనుకున్నాం.కానీ ఈ విషయం శత్రువులకు తెలిస్తే మీ ప్రాణాలకే ప్రమాదం..ఈ లోగా అపోహతో నామీద ఎటాక్ చేసారు.రివాల్వర్ తో నన్నుషూట్ చేసారు.ఆ బులెట్ మీ అన్నయ్య రివాల్వర్ లో నుంచి వచ్చిందని తెలుసు.నేనే మఫ్టీలో వున్న మా మనిషితో నాపేరు వంశీకృష్ణ అని చెప్పించాను.ఇది మిమ్మల్ని మోసం చేయడానికి కాదు.శత్రువు అటెన్షన్ మీ మీద పడకుండా ఉండడానికి…మీ అన్నయ్యకు ప్రభుత్వలాంఛనాలతో అంత్యక్రియలు చేసాం…తప్పలేదు..”బాధగా నిట్టూర్చి చెప్పాడు అనిరుద్ర.
అప్పటికే స్వాప్నిక కళ్ళు ధారాపాతంగా కన్నీళ్లను వర్షిస్తున్నాయి.
ఆ క్షణమే ఆమె నిర్ణయించుకుంది అన్నయ్యను చంపిన నార్త్ అవెన్యూ రహస్యాన్ని చేధించాలి.అన్నయ్య మరణానికి కారణమైన వారిని వెతికి మరీ చంపాలి.
“మీకోరిక తప్పక నెరవేరుతుంది”ఆమె మనసులో మాటలు చదివినట్టు అన్నాడు అనిరుద్ర.
“సారీ మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను”అంది స్వాప్నిక.
“కసిదీరా పొడిచేసి సారీ చెప్పలేదు..అందుకు థాంక్స్ “నవ్వుతూ వాతావరణాన్ని తేలిక చేస్తూ అన్నాడు అనిరుద్ర.
ఆ క్షణమే ఆ ముగ్గురో ఒక్కటయ్యారు..నార్త్ అవెన్యూ రహస్యాన్ని చేధించడానికి.
అప్పుడే ఇన్స్పెక్టర్ జేమ్స్ ఫోన్ చేసాడు.”పరమహంస అక్కడికి వస్తున్నట్టు” సమాచారం ఇచ్చాడు.
వెంటనే స్వాప్నికను ,ఎర్విక్ ను అక్కడి నుంచి తప్పుకోమని చెప్పాడు అనిరుద్ర,
అదేసమయంలో సైంటిస్ట్ పరమహంస హాస్పిటల్ లోకి ప్రవేశించాడు.
పరమహంస రాకతో ఈ కథ కీలకమైన మలుపు తిరుగుతుందా?
వచ్చేవారం వరకూ…బీ అలర్ట్

తేజారాణి తిరునగరి రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/ksearch.php?searchfor=tejarani
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY