మృత్యువు వేగంగా తమని తరుముతూ తమ దగ్గరికి వచ్చేస్తోన్న ఫీలింగ్…వండర్ ఫుల్ రైటర్ తేజారాణి తిరునగరి సస్పెన్స్ థ్రిల్లర్ నార్త్ అవెన్యూ (05-02-2017)

                                                (15)
ఒక చీకటి రహస్యాన్ని చేధించడానికి వ్యూహం మొదమైంది.ఒక విధ్వంస రచనకు ముగింపు పలకడానికి యుద్ధం మొదలైంది.నేరానికి చెక్..ఘోరాలకు అడ్డుకట్ట…అమానుష కృత్యాలకు తెరపడబోతుంది.
అనిరుద్ర ఎర్విక్ వంక,స్వాప్నిక వంక చూసాడు.
ఎర్విక్ అన్నింటికీ సిద్ధంగా వుంది.తన చెల్లెలిని చంపినవారి మీద పగతీర్చుకునే ప్రయత్నంలో ప్రమాదాలతో తలపడిన అనుభవం వుంది.కానీ స్వాప్నిక ఆలా కాదు.కేవలం తన అన్నయ్య చావుకు కారణమైన వారి మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఆవేశమే తప్ప,ప్రమాదాన్నిచూసిన,ఎదుర్కున్న అనుభవం కానీ,ప్రమాదాన్ని ఎదుర్కునే మెళుకువలు కానీ తెలియవు.
క్రితంరోజు రాత్రి అనిరుద్ర తప్పనిసరి ప్రమాదకర పరిస్థితుల్లో రివాల్వర్ ఎలా ఉపయోగించాలో చూపించాడు.ఒక విధంగా స్వాప్నిక ను తమ వంట తీసుకుపోవడం ఇష్టంలేదు అనిరుద్రకు.కానీ స్వాప్నిక పట్టుబట్టడం,అదీకాక స్వాప్నికను అడ్డుపెట్టుకుని శత్రువుల ఆలోచనని డైవర్ట్ చేయవచ్చనే కారణంతో తీసుకు వెళ్తున్నాడు.
ఎర్విక్ వంక స్వాప్నిక వంక చూసి చెప్పాడు అనిరుద్ర”ప్రమాదం ఎటువైపు నుంచైనా పొంచి ఉండవచ్చు.మనం ప్రతీ క్షణం అలర్ట్ గా ఉండాలి.మీ దుస్తులకు అమర్చిన సీక్రెట్ డివైసెస్ ద్వారా మనం విడిపోయినా కాంటాక్ట్ లో ఉంటాం.రిమెంబర్ వన్ థింగ్ .ఎప్పుడు మనం కూతవేటు దూరంలోనే ఉండాలి.మీ ఇద్దరిలో ఎవరు ప్రమాదానికి దగ్గరగా వున్నా మీ డివైస్ ని గట్టిగా ప్రెస్ చేయండి.దాని సౌండ్ పరిసర ప్రాంతాల్లో వున్న నాకు సైరెన్ లా వినిపిస్తుంది.అంతే కాదు డివైస్ లో నుంచి స్మోక్ ..పొగ రీలీజ్ అవుతుంది.మీతో సహా అక్కడ ఎవరు వున్నా స్మోక్ ప్రభావంతో స్పృహతప్పి పడిపోతారు.డివైస్ వల్ల మిమల్ని ట్రేస్ చేయడం నాకు ఈజీ అవుతుంది..అని స్వాప్నిక వైపు తిరిగి”ముఖ్యంగా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి..ఎర్విక్ మార్షల్ ఆర్ట్స్ లో ఎక్స్పర్ట్ ..తనను తాను సేవ్ చేసుకోగలదు..అందుకే నువ్వు ఎర్విక్ ను అంటిపెట్టుకుని ఉండాలి….ఎందుకంటే…ఆగి కొనసాగించాడు…
“మా డిపార్ట్మెంట్ మీ అన్నయ్యలాంటి సిన్సియర్ ఆఫీసర్ ను కోల్పోయింది…నిన్ను కోల్పోవడానికి మేము సిద్ధంగా లేము”
ఆ ఒక్కమాటతోనే స్వాప్నిక కళ్ళలో నీళ్లు తిరిగియి.చీకటిలో చిన్న వెలుతురు కూడా దారి చూపిస్తుంది.ధైర్యాన్ని కలిగిస్తుంది.
“మనం డాక్టర్ పరమహంసతో పాటు బయలుదేరుతున్నాం…కానీ ఒక్క విషయం మనం ఎవ్వరినీ నమ్మొద్దు..నమ్మినట్టు నటించాలంతే… “చెప్పాడు.
మరో ముప్పై నిమిషాల్లో వాళ్ళ ప్రయాణం మొదలవుతుంది.యుద్ధంలో చివరి అంకం..ఒక చీకటి రహస్యానికి మృతుశాసనం.
***
రాత్రి పదకొండు గంటలు
నార్త్ అవెన్యూ కు వాళ్ళ ప్రయాణం మొదలైంది.అనిరుద్ర డాక్టర్ పరమహంస కారులో ముందు కూచున్నారు.డాక్టర్ పరమహంస డ్రైవ్ చేస్తున్నాడు.ఎర్విక్ స్వాప్నిక వెనుక సీట్లో కూచున్నారు.కారు సిటీ లిమిట్స్ దాటింది.నిర్మానుష్యమైన ప్రాంతంలోకి ఎంటర్ అయ్యింది.అందరూ సైలెంట్ గా వున్నారు.ఎర్విక్ ఏ క్షణమైనా ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా వుంది.అనిరుద్రకు ప్రమాదాలు కొత్తకాదు..వాటిని ఎదుర్కోవడం కష్టం కాదు.స్వాప్నిక ఇదివరలా భయపడలేదు…అనిరుద్ర వున్నాడన్న ధీమా…కొన్ని ఫీలింగ్స్,కొందరి సమక్షం మన సమస్తాన్ని వాళ్ళ ముందు పరచాలనిపిస్తుంది.
***
కారు సిటీ లిమిట్స్ దాటడం వల్ల నిర్మానుష్యమైన పరిసరప్రాంతం భయాన్ని కలిగిస్తుంది.మట్టిరోడ్లు ఎగుడుదిగుడు ప్రయాణం…కారు అడవిలోకి ప్రవేశించింది..భయాన్ని రెట్టింపు చేస్తూ…కొంత కంకరరోడ్డు కొంత మట్టిరోడ్లు,,,రోడ్డుకు ఇరువైపులా చెట్లు..గుబురు చెట్లు గుబులు పుట్టిస్తూ….చలికాలం కావడం,అడవిప్రాంతం గాలి రివ్వుమని వీస్తూ ఉండడం… ఒక భయానక వాతావరణానికి సిగ్నేచర్ లా వుంది.
నార్త్ అవెన్యూ బయల్దేరే ముందు డాక్టర్ పరమహంస అనిరుద్ర ఎర్విక్ స్వాప్నికాలకు మూడు డివైసెస్ ఇచ్చాడు.అవి కాలర్ మైక్స్ లా వున్నాయి.
“వీటిని నేను స్పెషల్ డిజైన్ చేశాను.ప్రమాదంలో వున్నపుడు ఎవరు ఎక్కడున్నారో తెలియజేస్తుంది.అంతేకాదు ఒకరితో ఒకరు సంభాషించుకోవచ్చు”అని చెప్పాడు.
కానీ ఆ డివైసెస్ కాలర్ మైక్స్ పర్పస్ వేరేనని పరమహంసకు మాత్రమే తెలుసు.
“డాక్టరుగారూ మీరు ఇంతకూ ముందు కూడా వచ్చారుగా..ఈ అడవిలోకి ప్రవేశించాక మీకేమైనా భయంకరమైన అనుభవాలు ఎదురయ్యాయా? అడిగాడు అతని మొహంలోకి సూటిగా చూస్తూ అనిరుద్ర.
కారు నార్త్ అవెన్యూ వైపు వెళ్తుంది.పరమహంస అనిరుద్రకు సమాధానం చెప్పకుండా కారును సడెన్ బ్రేక్ తో ఆపాడు..కారు ఆపుతూనే డోర్ తెరిచి అనిరుద్ర వైపు,వెనగ్గా వున్న ఎర్విక్ స్వాప్నికల వైపు చూస్తూ “పారిపోండి”ప్రమాదం ముంచుకు వస్తోంది.అంటూనే వెనక్కి పరుగెత్తాడు.
అనిరుద్ర ముందుకు చూసాడు.స్వాప్నిక ఆ షాక్ నుంచి తేరుకోకుండానే ఎదురుగా చూసి భయంతో కేకేసింది.
ఎదురుగా ముసుగులు ధరించిన వ్యక్తులు దూసుకువస్తున్నారు.వాళ్ల వేగంలో తెగింపు కనిపిస్తోంది.
మృత్యువు వేగంగా తమని తరుముతూ తమ దగ్గరికి వచ్చేస్తోన్న ఫీలింగ్.
ఆ షాక్ లో నుంచి ముందుగా తేరుకుంది అనిరుద్ర.
వచ్చేవారం వరకూ…బీ అలర్ట్
మిమ్మల్ని అలరిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్ నార్త్ అవెన్యూ కినిగే ద్వారా ఈ బుక్ గా మీ ముందుకు వచ్చింది.
ఈ నవల మీద మీ స్పందన తెలియజేయండి.
నార్త్ అవెన్యూ నవల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/book/North+Avenue

తేజారాణి తిరునగరి రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/ksearch.php?searchfor=tejarani
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY