కుటుంబాల్లో విషాదాన్ని నింపే కిడ్నాపింగ్ ఘోరాలు …ఆందోళన కలిగించే గణాంకాలు …హైద్రాబాద్ నుంచి శ్రీమతి సుధ.వి …అందించిన ప్రత్యేక కథనం.

త్వరలో కినిగె లో విడుదల కానున్న …మిస్టీరియస్ కిడ్నాప్…బాబూ వికాస్ ..నువ్వెక్కడ ?పుస్తకంలో (eBOOK) లో ఈ కథనాన్ని చూడవచ్చు…చీఫ్ ఎడిటర్ 
పొద్దున్నే బడికి వెళ్తూ చిరునవ్వుతో టాటా చెప్పిన బిడ్డ సాయంత్రమయ్యేసరికి తిరిగి రాకపోతే…బిడ్డ కోసం ఎదురుచూసే తల్లి…కంటికి రెప్పలా కాపాడే తండ్రి. ఆ కుటుంబం పడే ఆందోళన చెప్పడానికి మాటలెక్కడ దొరుకుతాయి.?
మిస్సింగ్/కనబడుటలేదు 
తప్పి పోవడం వేరు ..కిడ్నాప్ కు గురవ్వడం వేరు..రెఁడూ బాధాకరమే..కిడ్నాప్ విషాదభరితం కూడా…
వ్యక్తిగత విద్వేషాలు…పగ ప్రతీకారాలు…
డబ్బు కోసం కిడ్నాప్ లు….
అన్నెపున్నెం తెలియని చిన్నారులు…గదిలో నిర్బంధించి తల్లిదండ్రులతో బేరసారాలు సాగించి..ఒకోసారి చివరికి చంపి…
తల్చుకుంటుంటే మనసు భారమవుతోంది.
టైమ్స్ అఫ్ ఇండియా కథనం ప్రకారం ..
*2013 మరియు 2015 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా కనిపించకుండా పోయిన పిల్లల సంఖ్య 84 శాతం పెరిగింది. ఢిల్లీ, మహారాష్ట్రల్లో ఇటువంటి కేసులు నమోదయ్యాయి.
*CRY (Child Rights and You)  అంచనా ప్రకారం ప్రతిరోజూ 180 మంది పిల్లలు సగటునకనిపించకుండా పోతున్నారు., వీరిలో 22 మంది దేశ రాజధాని నుండి..ఇందులో అక్రమ రవాణా కోణం కూడా వుంది.కిడ్నాపర్లు అతి దారుణంగా పిల్లలను పొట్టన బెట్టుకుంటున్నారు.
*ప్రతీ ఎనిమిది నిమిషాలకు ఒక చైల్డ్ కిడ్నాప్ జరుగుతుందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం తెలుస్తుంది.
*దాదాపు 40% మంది పిల్లలు కనిపించలేదు.
కారణాలు ఏవైనా పిల్లల కిడ్నాపైన అమానుషం..అమానవీయం…
తల్లిదండ్రులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.తమ పిల్లల కదలికలపై చూపు సారించాలి.అపరిచితులను నమ్మకూడదు.మీ పిల్లల స్నేహితులే కిడ్నాపర్లు అయ్యే ప్రమాదం వుంది..అలాంటి వార్తలూ చదువుతున్నాం.స్కూల్ యాజమాన్యానికి ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలి.అపరిచితులను స్కూల్ కు పంపించవద్దు.
మీ డ్రైవర్స్ గురించి పూర్తిగా తెలుసుకోండి.కారు డ్రైవర్స్ కిడ్నాప్ కేసులో నిందితులు అయిన సందర్భాలు వున్నాయి.పనివాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
ముఖ్యంగా మీ పిల్లలు కనిపించని మరుక్షణమే పోలీస్ లను సంప్రదిస్తే మంచిది.వేచిచూద్దాం అనే ధోరణీ మనకు విషాదాన్ని మిగిల్చవచ్చు.
మీ పిల్లల భద్రతపై దృష్టిని సారించండి.ముఖ్యంగా సంపన్నవర్గాల పిల్లలకు ఈ ప్రమాదం పొంచివుంది.బ్లాక్ మెయిల్ కు పాల్పడే ముఠాలు వీళ్ళను టార్గెట్ చేసుకుంటాయి.
కొన్ని కిడ్నాప్స్ కు వ్యక్తిగత వృత్తిపరమైన కారణాలు ద్వేషాలు కారణమవుతాయి.ఈ విషయాలను పరిగణలోకి తీసుకోవాలి.
కిడ్నాప్స్ లేని రోజును స్వాగతిద్దాం..కిడ్నాపర్లు కు వ్యతిరేకంగా పోరాడుదాం .అప్రమత్తంగా ఉందాం.

NO COMMENTS

LEAVE A REPLY