సేవాభావం స్నేహభావం మానవతావాదం….అతని అజెండా…ఉపాధ్యాయ బృందం అతని సర్వసైన్యం ..ప్రపంచం…డాక్టర్ విద్యారత్న లయన్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి కి పుట్టినరోజు శుభాకాంక్షలు

అమ్మ నాకు జన్మనిచ్చింది.సమాజం నాకు హోదానిచ్చింది.ఈ ప్రపంచం నాకు ఓ గుర్తింపుని ఇచ్చింది దేవుడు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు…డాక్టర్ విద్యారత్న లయన్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి
                                 ***
వేలాది విద్యార్థులను నూతన విధానంలో…థింక్ రూమ్ ప్రయోగంతో నవ్యపథంలోకి తీసుకువెళ్లిన అభ్యుదయ పథగామి.
డాక్టర్ విద్యారత్న లయన్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి 
లోటస్ లాప్ విద్యాసంస్థల చైర్మన్
సేవాభావం  స్నేహభావం మానవతావాదం…అతని అజెండా
ఉపాధ్యాయ బృందం  అతని సర్వసైన్యం …ప్రపంచం
విద్యార్థులకు తరగతిగదిలో పాఠాలే కాదు జీవిత పాఠాలు చెబుతాడు.ట్రాఫిక్ మీద అవగాహన కలిగిస్తూ పిల్లలను ట్రాఫిక్ సైన్యంగా మార్చి పెద్దలో వాహనదారుల్లో అవగాహన కలిగించి ట్రాఫిక్ పోలీసుల నుంచి ప్రశంసలు అందుకుంటాడు.
రైతేరాజు అన్న గొప్పదనాన్ని చాటుతూ పిల్లలకు జైకిసాన్ గొప్పతనాన్ని చూపిస్తూ పచ్చని పంటపొలాల్లో ప్రకృతి పాఠాలు నేర్పిస్తాడు.
లోటస్ లాప్   విద్యాసంస్థల్లో అడుగుపెడితే…అక్కడో అద్భుతదృశ్యం కనిపిస్తుంది.
డాక్టర్ విద్యారత్న లయన్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డిని విద్యార్థులు చుట్టుముడుతారు…అల్లరి చేస్తారు ఆనందంతో గెంతులేస్తారు…పండుగలా భావిస్తారు.
అక్కడ ఆ స్కూల్ లో కుటుంబ వాతావరణం కనిపిస్తుంది.ఉపాధ్యాయులు పిల్లలు సరదాగా వుంటారు.
క్రమశిక్షణ పేరుతో శిక్షలు వుండవు…మేథస్సును తీర్చిదిద్దే యజ్ఞం ఆ ప్రాంగణంలో నిర్విఘ్నంగా కొనసాగుతుంది.
తన పుట్టినరోజును “తన బిడ్డలుగా భావించే” విద్యార్థుల సమక్షంలోనే జరుపుకుంటారు.
ఉపాధ్యాయులకు ఆ రోజు మరో పండుగరోజు…
డాక్టర్ విద్యారత్న లయన్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి కి మేన్ రోబో హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది.
పుట్టినరోజు సందర్భంగా డాక్టర్ విద్యారత్న లయన్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి మనసులోని మాటలు.
*కాలచక్రంలో ఎన్నో పుట్టినరోజులు జరుపుకున్నాను.పిల్లలు దైవంతో సమానం.ఆ పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలి.
*పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయులకు సముచిత గౌరవం కలిగించాలి.
*దేవుడా..క్రమశిక్షణతో కూడిన స్వచ్ఛమైన జీవితాన్ని మాకు ప్రసాదించు.
*ఈర్షాసూయ ద్వేషాలకు దూరంగా ఉందాం.
*పిల్లల హృదయాలను కలుషితం కాకుండా కాపాడుదాం.
*మంచి అలవాట్లను పిల్లలకు నేర్పిద్దాం.సరికొత్త నవసమాజాన్ని,స్వచ్ఛభారత ఉజ్వలభవిష్యత్తు ప్రపపంచాన్ని ఆహ్వానిద్దాం.
*జననమరణాలు సహజమే..కానీ మనం సాధించిన విజయాలు,మనం చేసిన మంచి మనల్ని మరణం తర్వాత కూడా బ్రతికిస్తుంది.మరొకరికి వెలుగును స్ఫూర్తిని ఇస్తుంది.

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

 

NO COMMENTS

LEAVE A REPLY