(మేన్ రోబో) నవంబర్ 21
మా చిన్నాన్న , బడికెళ్లే రోజుల్లో నా స్నేహితుడు, నా సహచరుడు ..ఎప్పుడూ నాకు ఆప్తుడు …ప్రజల హృదయాల్లో నిలిచే ఒకేఒక్కడు …
చిన్నప్పుడు స్కూల్ లో మా ఇద్దరిపేర్లు చూసి కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు.
కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి
కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి…
అతడిపేరులో రాజ్ వుంది.అందుకే ప్రజల హృదయాల్లో ” రాజు ” లా వున్నాడు.
రాజకీయాలు పక్కన పెడితే
బంధుత్వాలు పక్కనపెడితే
వ్యక్తిగత రాజకీయాల రాగద్వేషాలకు అతీతంగా ..
అతడు అందరివాడు…అందరికీ కావలిసివాడు.
” మానవత్వం నా అభిమతం” అంటాడు
” ప్రజలకు సేవచేయడమే నా అజెండా ” అంటాడు
ప్రజల సేవకు ఎప్పుడూ ముందుంటాడు
పట్టుదల దీక్షాదక్షతలకు మారుపేరు.
ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తాడు.
ఇచ్చినమాట తప్పని మడమ తిప్పని నిఖార్సైన నాయకుడు.
సాహసంలో అతనికి అతనే సాటి.
ఈ ఎన్నికల్లో విజయం వరించాలి.
” నీవల్లే నాకు పేరు వచ్చిందిరా..మన పేర్లు ఒక్కటే..కొందరు నువ్వే నేను అనుకంటారు..నీ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఉన్నతస్థానంలో వున్నారు.లోటస్ ల్యాప్ విద్యాసంస్థలకు గుర్తింపును తెచ్చి మన తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చావు ..విద్యార్థులు భవిష్యత్తుకు కొత్తరంగులు అద్ది వారి భవిష్యత్తుకు కొత్తదనాన్ని చూపించావు ” అన్నప్పుడు మనసు తడి అయ్యింది.
ప్రజలంతా అతడి సేవలను గుర్తించి అభివృద్ధికే ఓటువేసి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అనే ప్రజల అభిమాన నేతకు గెలుపును అందించాలని మనసారా కోరుకుంటున్నాను.
మేరా బారత్ మహాన్
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/author/Vijayarke
ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్