అంబరాన్నంటిన సంబరాలు జన్మదినవేడుకల్లో జేజేలు జయజయధ్వానాలు ,అభిమానమే పుష్పవర్షం..అభినందనలే ఆశీస్సుల ఆశీర్వాదం ..ఇది అపూర్వం ఇది అద్భుతం ..ఇది మహోజ్వలఘట్టం

” అమ్మా నేనేరోజున పుట్టాను ” ఓ బిడ్డ అడిగిన ప్రశ్నకు ..ఆ తల్లి సమాధానం ” ఆ తారీఖులు గట్రా నాకేటి తెలుస్తది బిడ్డా ..నిండుగా ఊరంతా దీపాల వెలుగులు…కార్తీక పౌర్ణమి రోజు భూమ్మీద పడ్డావు..నువ్వు పెద్దయ్యాక ఈ తల్లికే కాదు అందరికీ వెలుగునివ్వాలా ” అంది.
ఆ తల్లి ఆశీస్సులు ,అతడి తపన..ఆ తపనలో కృషి అతడిని ” మహావృక్షంగా మార్చింది …వేనవేల దీపాల వెలుగును ఈ లోకానికి పంచింది.”
అతడే కార్తీకపూర్ణమి దీపాల వెలుగుల్లో తన పుట్టినరోజును ..
దేవుడి స్వరూపమైన వందలాది విద్యార్థులు మధ్య..
గురుదేవోభవ అని కీర్తించే ఉపాధ్యాయుల మధ్య…
వారి అభిమానం సాక్షిగా…వినూత్నంగా కన్నుల పండువుగా ..
పుట్టినరోజు శుభాకాంక్షలు అందుకున్నారు.
విద్యార్థులు భవిష్యత్తుకు నిరంతరం తపించే విద్యారత్న…లోటస్ ల్యాప్ విద్యాసంస్థల చైర్ పర్సన్
లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి


ఈ సంవత్సరం రెండు కార్తీక పౌర్ణమిలు అనిపించేలా…తలపించేలా .లోటస్ ల్యాప్ బోడుప్పల్ దిల్ సుఖ్ నగర్ పాఠశాలల్లో
డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను విద్యార్థులు ఉపాధ్యాయులు పేరెంట్స్ ఘనంగా జరిపారు.ఇది ఒక అద్భుతం పిల్లలంతా గుంపులుగా చేరి తమ మార్గదర్శకుడిని చుట్టుకుని ” హ్యాపీ బర్త్ డే ” అని చెబుతుంటే..చాచా నెహ్రూజీని పిల్లలు చేరినట్టుగా వుంది ఆ దృశ్యం.
తమ సృజనాత్మకతకు తమ అభిమానాన్ని జోడించి రాసిన కవితలు ..తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషల్లో వ్యక్తం చేసిన భావాలూ..వారి అపరిమితమైన అభిమానానికి చిహ్నాలు .
ఉపాధ్యాయులు సైతం ఆటపాటలతో చిన్నారులకి తమ చైర్మన్ కు శుభాకాంక్షలు చెప్పారు.అందరూ ముక్తకంఠంతో చెప్పే మాట ఒక్కటే.
” మీరే మాకు స్ఫూర్తి మీరే మాకు మార్గదర్శి మీరే మాకు వెలుగుచూపు దివిటీ ”


బోడుప్పల్ బ్రాంచి ప్రిన్సిపాల్ శ్రీమతి షెహనాజ్ అలీ మాట్లాడుతూ..
” ఇరవయ్యేళ్ళుగా ఇక్కడే పని చేస్తున్నాను.ఒక గొప్ప బాండింగ్ ..ఉపాధ్యాయులకు సర్ ఇచ్చే గౌరవం,వారు కనబరిచే శ్రద్ధ ,,గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ” అన్నారు.
కో ఆర్డినేటర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ” మా సర్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు.గొప్ప పాషన్ … ఎన్నో ప్రత్యేకతలు కలిస్తే మా సర్..ముఖ్యంగా ఎడ్యుకేషన్ సిస్టం లో కొత్త ఒరవడి తీసుకువచ్చారు.” అని చెప్పారు.
పుట్టినరోజు ప్రత్యేకతలు
* స్కూల్ విద్యార్థులు తయారుచేసిన చేసిన బర్త్ డే కేక్ కట్ చేస్తే తప్ప తెలియనంతగా వుంది
* ఉపాధ్యాయులు పాటలు పాడారు .స్వంతంగా పాటలు రాసి పాడి వినిపించారు.
* విద్యార్థులు చిట్టి చేతులతో తమ అభిమానాన్ని కవితలుగా రాసారు
* బొమ్మలు తయారు చేసారు

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

 

NO COMMENTS

LEAVE A REPLY