ఒక ఆలోచన..ఒక మంచి ఆలోచన ప్రపంచ గమనాన్ని మారుస్తుంది .
అలెగ్జాండర్ గ్రాహమ్ బెల్ కు వచ్చిన ఆలోచన కమ్యూనికేషన్ వ్యవస్థలో పెనుమార్పును తీసుకువచ్చింది.టెలిఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్స్ వరకూ మార్గాన్ని ఏర్పరిచింది
రైట్ సోదరులకు వచ్చిన ఆలోచన విమానాలను కనిపెట్టేలా చేసి దూరాభారాలను తగ్గించింది.
అక్షరం వేనవేల అణ్వాయుధాల కన్నా శక్తివంతమైనది.మానవ వికాసం ,శాస్త్రపరంగా సాంకేతిక సృజన ,మేథోపరమైన విద్వత్తు,ఇలా ప్రపంచాన్ని ముందుకు తీసుకువెళ్లే అక్షరం విద్యకు మూలం.
విద్యతోనే వికాసం
విద్యతోనే సాంకేతిక నైపుణ్యాలు విజయాలు సాధ్యం
ఒక మంచి ఆలోచనతోనే ఎన్నో అసాధ్యాలను సుసాధ్యాలుగా మార్చుకోవచ్చు.
ఎవరో వస్తారని ఎదురు చూడకండి
ఎవరో చేస్తారని చేయాలనీ మీరు ఆగిపోకండి.మనతోనే మొదలుపెట్టాలి.
మనమే ఒక మంచి ఆలోచనకు శ్రీకారం చుట్టాలి.
ఒక మొక్కను పెంచితే నీడను ఇస్తుంది
చల్లటి గాలిని ఇస్తుంది
ఫలాలను ఇస్తుంది .ఒక విద్యార్థిని తీర్చిదిద్దితే …
ఆ విద్యార్ధి భావిభారతానికి ఒక జవాను కావచ్చు..
ఒక జైకిసాన్ కావచ్చు.
తనలాంటి వారిని తీర్చిదిద్దే ఉపాధ్యాయుడు కావచ్చు.
ఒక అబ్దుల్ కలాం కావచ్చి.
ఒక రామానుజన్ కావచ్చు.
మనమే పూనుకోవాలి
మనమే ఆలోచించాలి
మనం కూచున్న భారతదేశమనే వృక్షాన్ని మనమే కాపాడుకోవాలి.
రేపటి భవిష్యత్తుకు మేధావులను అందించాలి.
విద్యతోనే వికాసం
వ్యక్తిత్వంతోనే విజయం
ఒక మంచి ఆలోచనతోనే ఇది సాధ్యం.
ఇది నా మాట..
ఇది నేను నమ్మిన నా బాట
ఒక్కసారి ఆలోచించండి.
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/author/Vijayarke
ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్