లోటస్ ల్యాప్ బడి …చదువులతల్లి ఒడి …దేవుడి గుడి…రేపటి భవితకు పునాది …డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి

హైదరాబాద్ ( మేన్ రోబో బ్యూరో ) జులై 12
ఒక విద్యాలయం అత్యున్నత విశ్వవిద్యాలయస్థాయిలో ఎదిగి,
విద్యార్థుల్లోని సృజనాత్మకతకు పెద్దపీట వేస్తూ ,
తరగతిగదిలో పుస్తకాల్లోని పాఠాలను,
వ్యవసాయక్షేత్రంలో రైతన్నల జీవనవిధానాన్ని,
నగరం నడిబొడ్డున ట్రాఫిక్ పాఠాలను,సాహితీ సంప్రదాయాలను కలగలిపి కలబోసి ..
పిల్లల్లో మేథో వికాసాన్ని,వ్యక్తిత్వ లక్షణాలను ప్రోది చేస్తూ,
అహర్నిశలు విద్యావిధానాన్ని నవీన మార్గం వైపు నడిపించే బృహత్తర ప్రయత్నాన్ని కొనసాగిస్తున్న ..
లోటస్ ల్యాప్ విద్యాసంస్థల చైర్మన్ ,వ్యక్తిత్వవికాస రచయిత లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న లోటస్ ల్యాప్ పాఠశాల 21 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘లోటస్ ల్యాప్ ” స్కూల్ లో అంగరంగ వైభవంగా సంబరాలు జరిగాయి.
ఈ సందర్భంగా .డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ” తన దృష్టిలో లోటస్ ల్యాప్ ఒక బడి మాత్రమే కాదని చదువులతల్లి ఒడి..దేవుడి గుడి..రేపటి పిల్లల భవిష్యత్తుకు వేసే పునాది  కావాలని, ఆ లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నామని ” అన్నారు.
విద్యార్థులు ఉపాధ్యాయులు సిబ్బంది పేరెంట్స్ ..ఈ సంబరాల్లో పాలుపంచుకున్నారు.
ప్రిన్సిపాల్ రాధ,వైస్ ప్రిన్సిపాల్ కుముదవల్లి సుభాషిణి,కో ఆర్డినేటర్ జయ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY