పొత్తిళ్ళల్లోని బిడ్డ పెద్దయి తప్పటడుగులు వేస్తూ ఉంటే ఎక్కడ పడిపోతాడో అని తల్లిదండ్రులు చేయి పట్టుకుని నడిపిస్తారు.
అదే బిడ్డను బడికి పంపి ప్రయోజకుడిని చేయాలని తపిస్తారు.
ఆ బిడ్డే అడ్డదిడ్డంగా పెరిగి,ఒక రేపిస్ట్ అయితే
ఆ బిడ్డే అనాగరికంగా మారి అమానుషంగా ప్రవర్తించి ఒక ఉన్మాది అయితే
ఆ బిడ్డే ఒక ఖూనీకోరు అయితే ..
ఈ తప్పెవరిది? ఈ పాపం ఎవరిది? కనిపెంచిన తల్లిదండ్రులదా?
విద్యాబుద్ధులు నేర్పిన గురువులదా?సమాజానిదా?
ఈ బేతాళప్రశ్నకు సమాధానం ఏమిటి ?
నిర్భయలు ,నిస్సహాయ దిశలు ,యాసిడ్ బాధితులు .ఇంకా నా దేశంలో కన్నీటితో ప్రశ్నిస్తూ నిలదీస్తూనే వున్నారు.
తోటకూర దొంగతనం చేసినప్పుడే ” బిడ్డ చెంప చెళ్లుమనిపిస్తే …బిడ్డ హంతకుడై ఉరికంబం ఎక్కేవాడు కాదు.
బిడ్డ దారి తప్పుతున్నాడన్న విషయం గమనించి తల్లిదండ్రులు బిడ్డను అప్పుడే నిలదీసి శిక్షిస్తే ఈ విషాదాలు వుండవు.
బడిలో మాస్టారు దండిస్తే ” దండయాత్ర ” చేసే అదేదో మహా అపరాధం అనుకుంటారు.తప్పుదారిలో నడిచే విద్యార్థిని,.తప్పటడుగులు వేసే శిష్యుడిని దండించడం ..తప్పని ఆ గురువులను నిందించే వ్యవస్థలోని రాచపుండు..ఎవరి పాపం ?
పలకబలపంతో పాటే ఖరీదైన సెల్ ఫోన్స్ కొనిపెట్టి పిల్లల్లోని సృజనాత్మకత పాతిపెట్టి.స్మార్ట్ ఫోన్ లో అశ్లీల దృశ్యాలు,ప్రమాదకర గేమ్స్ ఆడుకుంటూ దారితప్పే బాల్యం నడతకు కారణం ముమ్మాటికీ తల్లిదండ్రులే
మైనర్లు బండి నడిపితే తల్లిదండ్రులను బాధ్యులను చేసే చట్టం ..పిల్లలు దారితప్పితే అందుకు కూడా తల్లిదండ్రులను బాధ్యులను చేయాలి…ఎందుకంటే ఇంట్లో తిరిగే బిడ్డ ప్రవర్తన కదలికలు వ్యక్తిత్వంగమనిస్తూ బిడ్డను సరైన వారిలో పెట్టకపోతే మీ బిడ్డ భవిష్యత్తులో నేరస్తుడు అవుతాడు.,చట్టం చేతిలో శిక్షకు గురవుతాడు.ఎందరో నిస్సహాయ ఆడబిడ్డల కన్నీళ్లకు శాపాలకు గురవుతాడు.
ఆలోచించండి…
విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి అందించే అక్షరాల భవిష్యత్తు గీత…” పిల్లలు విద్యార్థులు తల్లిదండ్రులు “… పుస్తకరూపంలో మీ ముందుకు వస్తుంది
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/author/Vijayarke
ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్