కరోనా మహమ్మారి విజృంభించింది.మనదేశం ఎన్నో అటుపోటులను సవాళ్ళను ఎదుర్కొంది.ప్లేగు మహమ్మారిని తరిమికొట్టింది ఇప్పుడు కరోనా మనకు సవాలు విసురుతుంది.ప్రజలంతా అప్రమత్తం కావాలి.ప్రపంచాన్ని చుట్టుముట్టిన కరోనాను సమూలంగా తరిమికొట్టాలి.
శుభ్రత పట్ల జాగ్రత్త వహించాలి.కరోనా వైరస్ ను ఎదుర్కునే దిశగా ముందడుగు వేద్దాం.
కనీసజాగ్రత్తలు పాటిద్దాం.తప్పనిసరి ఐతేతప్ప బయటకు తిరగొద్దు.ఏమాత్రం కరోనా లక్షణాలు కనిపించినా ప్రాథమికంగా తగుజాగ్రత్తలు తీసుకుంటూ,వైద్యనిపుణులు సంప్రదించాలి.
ఈ ఆదివారం ప్రధాని మోడీజీ ఇచ్చిన ‘జనతా కర్ఫ్యూ ’ సందేశాన్ని పాటిద్దాం …స్వచ్ఛందంగా అందరం ఇళ్లలోనే ఉందాం.ఈ ఒక్కరోజు మీ కుటుంబానికి మనఃస్ఫూర్తిగా కేటాయించండి.కరోనాకు ఉరి వేద్దాం…
రాష్ట్రప్రభుత్వం చేపట్టిన కరోనా నివారణ చర్యలకు మద్దత్తుగా నిలుద్దాం.
క్వారంటైన్ ( నిర్బంధంగా దూరంగా ఉండడం ) ఐసోలేషన్ ( ఒంటరిగా ఉంచడం ) మన ఆరోగ్యం కోసమే అని మర్చిపోవద్దు.
ఒక్కసారి ఇళ్లు దాటాలనిపిస్తే ఇటలీని గుర్తు తెచ్చుకోండి
” భారత్‌లో కొవిడ్-19 కేసులు ఎక్కువగా నమోదేమీ కావడం లేదని నిర్లక్ష్యం వహించొద్దు. ఈ విశ్వ మహమ్మారి విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే సోకిందని, ఇక్కడున్న వారికెవరికీ సోకలేదని అప్రమత్తత వీడొద్దు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం జాతినుద్దేశించిన చేసిన ప్రసంగంలో ఇదే చెప్పారు.
*ఆదివారం రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 వరకు జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారు. జనతా కర్ఫ్యూ అంటే ఎవరికి వారే ఇంటివద్ద ఐసోలేట్ కావడం. దీనివల్ల జరిగే లాభాలు చాలా ఉన్నాయి. కరోనా వైరస్ గాల్లో 3 గంటలు, రాగి పాత్రలపై 4 గంటలు, కార్డ్‌బోర్డులపై 24 గంటలు, స్టీల్ పాత్రలపై 2-3 రోజులు, ప్లాస్టిక్ పాత్రలపై 4 రోజులు బతికుంటుందని న్యూ ఇంగ్లాండ్ జర్నల్‌లో వచ్చిన పరిశోధన వెల్లడించింది.
*ఆదివారం రోజు 14 గంటలు అందరం ఇంట్లోనే ఉండటం వల్ల గాల్లోని వైరస్ ఎవరికీ సోకే ప్రమాదం ఉండదు. వైరస్ వ్యాప్తి గొలుసు తెగిపోతుంది. అంటే మూడో దశను దాదాపు అడ్డుకున్నట్టు అవుతుంది. ఆ తర్వాత కరోనా సోకిన వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తే పరిస్థితి మెరుగుపడుతుంది.”
ఈ విషయాలను మర్చిపోవద్దు
విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి అందించే అక్షరాల భవిష్యత్తు గీత…” పిల్లలు విద్యార్థులు తల్లిదండ్రులు “… పుస్తకరూపంలో మీ ముందుకు వస్తుంది
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/author/Vijayarke
ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్