(గత సంవత్సరం ఇదే రోజు కోవిడ్ విషాదంతో లాక్ డౌన్ మొదలైంది.కోవిడ్ గుణపాఠాన్ని ఒక పాఠంగా మార్చుకుని పరిశుభ్రతను ఆయుధంగా మార్చి కోవిడ్ ను ఎదుర్కోవాలని ఆకాంక్షిస్తూ…విద్యావేత్త రచయిత డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి ప్రత్యేక కథనం )
డియర్ పేరెంట్స్డి…డియర్ టీచర్స్ …మై డియర్ సొసైటీ ..
ఒక సినీకవి చెప్పినట్టు…
నిగ్గదీసి అడగాలా? నిప్పుతోటి కడగలా?
సిగ్గుతో తల దించుకోవాలా?
ఎటు వెళ్తున్నాం ? ఏ సందేశాన్ని ఇస్తున్నాం?
కోవిడ్ మహమ్మారి మన మొహాలు కనిపించకుండా మాస్కుల ముసుగులు తొడిగింది.
మనకు సవాలు విసిరింది.
అయినా సరే మనం మారం…
మన పక్కన చెత్త లేకుంటే చాలు,
ఆ చెత్తను పక్కవాడి దగ్గరికి జరిపిస్తే చాలు
మనం బాగుంటే చాలు,పక్కవాడు ఎట్టా పొతే మనకేమిటి?
మనం రోజూ శుభ్రంగా ఉంటాం ,
మన పరిసరాలు మాత్రం పట్టించుకోము.
ఇలాగే ఉందామా?
మనం కూచున్న కొమ్మను మనమే నరుక్కుందామా?
డియర్ పేరెంట్స్
డియర్ టీచర్స్
మై డియర్ సొసైటీ ..
ఆలోచించండి.
బాధ్యతను గుర్తించండి.
మనమంతా ఆలోచిస్తే,
శుభ్రతను గుర్తిస్తే,
పచ్చదనం ఆరోగ్యం ఆనందం అన్నీ మన వెంటే…
విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి అందించే అక్షరాల భవిష్యత్తు గీత…” పిల్లలు విద్యార్థులు తల్లిదండ్రులు “… పుస్తకరూపంలో మీ ముందుకు వస్తుంది
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/author/Vijayarke
ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్