ప్రముఖ కన్నడ రచయిత అనువాదకులు యం. యల్ .రాఘవేంద్రరావు కన్నుమూత

ప్రముఖ సాహితీవేత్త కన్నడ రచయిత అనువాద రచనలో మేటి అయిన  యం.యల్ రాఘవేంద్రరావు స్వల్ప అనారోగ్యంతో బెంగుళూరులో మరణించారు.కవిత్వంలో సాహిత్యంలో తనదైన ముద్రవేశారు.ప్రసిద్ధ రచయితగా .అనువాద రచయితగా కన్నడ పాఠకులకు సుపరిచితం 
తెలుగులో ప్రముఖ రచయితల రచనలను కన్నడంలోకి అనువదించి కన్నడ పాఠకులకు తెలుగు రచయితలను దగ్గర చేసారు.
స్వాతిలో వచ్చిన ప్రముఖ రచయిత విజయార్కె నిర్ణయం నవలను ” జీవనసంధ్య “పేరుతో కన్నడంలోకి అనువదించారు.ఈ నవల కన్నడ పత్రిక రాగసంగంలో ధారావాహికగా వచ్చింది.మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి.అసంతృప్తిని జయించండి,( వ్యక్తిత్వ వికాస రచనలు ) సెక్షన్ 494 , రాజీనామా నవలలు కన్నడ భాషలోకి అనువదించారు.మధుర ప్రకాశన ప్రచురణ సంస్థ ద్వారా వీరు ఎన్నో తెలుగు కన్నడ రచనలు కన్నడ పాఠకులకు చేరువ చేసారు.
యం.యల్.రాఘవేంద్రరావు కుమారులు యం.హరిప్రసాద్ కూడా రచయితే.విక్రం ప్రకాశన ప్రచురణ సంస్థ ద్వారా దాదాపు మూడువందల పుస్తకాలు ప్రచురించారు.
యం.యల్.రాఘవేంద్రరావు మృతి సాహితీలోకానికి లోటుగానే ఉంటుంది.

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY