పీస్ ఆఫ్ మైండ్ తో విజయం సాధ్యం …పోలీస్ కమీషనర్ .సి వి ఆనంద్

( మేన్ రోబో బ్యూరో)
హైదరాబాద్
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు,మైండ్ పవర్ లో ప్రపంచ రికార్డు గ్రహీత డాక్టర్ టి.వేణుగోపాల్ రెడ్డి,ప్రముఖ రచయిత జర్నలిస్ట్ విజయార్కె రాసిన “పీస్ ఆఫ్ మైండ్ ” ఇంగ్లీష్ వెర్షన్ ను హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సి వి ఆనంద్ ఆవిష్కరించారు.
“తెలుగులో పాఠకాదరణ పొందిన “పీస్  ఆఫ్ మైండ్”  ఇంగ్లీష్ వెర్షన్ ను ఆవిష్కరించిన కమీషనర్ సి వి ఆనంద్ మాట్లాడుతూ” పీస్ ఆఫ్ మైండ్ ” తోనే విజయం సొంతం అవుతుంది.మన ఆరోగ్యం మానసిక ప్రశాంతత మీదే ఆధారపడి ఉంటుంది .ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరిగి ” పీస్ ఆఫ్ మైండ్” ను అలవర్చుకోవాలని ఆకాంక్షించారు.
” యువతకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా “ఈ పుస్తకాన్ని రాసిన రచయితలను  కమీషనర్ సి వి ఆనంద్ అభినందించారు.
“పీస్ ఆఫ్ మైండ్” లేకుండా ఏ వ్యక్తి విజయాన్ని సాధించ లేరని,అలాగే ప్రశాంతగా జీవించ లేరని ,అలాంటి పరిస్థితి నుంచి ఎలా బయటపడి ,పీస్ ఆఫ్ మైండ్ ను ఎలా సాధించాలో ” ఈ పుస్తకంలో వివరించినట్టు పుస్తక రచయితలు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మెగాసిటీ స్కూల్ డైరెక్టర్ సుబ్బారెడ్డి  పాల్గొన్నారు

ప్రముఖ రచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

https://kinige.com/author/Vijayarke

https://www.youtube.com/watch?v=MvO2LvqNIu4

 

NO COMMENTS

LEAVE A REPLY