హన్మకొండ ,ఫిబ్రవరి 18 ( మేన్ రోబో )
హన్మకొండలోని నేరెళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణం లో సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ వరంగల్ ,తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ మరియు తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర రంగస్థల అభివృద్ధి సంస్థల సౌజన్యంతో “ప్రేమతో నాన్న” నాటిక ప్రదర్శించారు.
నాన్న గొప్పతనాన్ని,కూతురి సాహసాన్ని,జీవితం తాలూకు ఔన్నత్యాన్ని చాటిచెప్పే విధంగా,స్ఫూర్తిని కలిగించే కథాంశంతో పలువురిని ఆకట్టుకుంది.
స్వాతి సాహస కథల పోటీలో బహుమతి పొందిన విజయార్కె ” ప్రేమతో నాన్న ” కథ,
విశాఖపట్నం తెలుగు కళాసమితి నిర్వహించిన జాతీయ స్థాయి నాటక పోటీలో ప్రథమ బహుమతి పొందింది.
” ప్రేమతో నాన్న ” మూలకథ ..విజయార్కె
నాటకీకరణ రావి నాగేశ్వరరావు ,దర్శకత్వం గోపరాజు విజయ్.
ప్రేమతో నాన్న నాటిక,హైదరాబాద్,నంద్యాల,ఖమ్మం పట్టణాల్లో విజయవంతంగా ప్రదర్శించబడింది.మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా హన్మకొండలో శనివారం నాడు ఈ నాటికను ప్రదర్శించారు.