తెల్లవారితే ఈ అక్షరాలు ఊపిరిపోసుకుని లక్షలాది చదువరులను పలకరిస్తాయి….విసురజ సృష్టించిన సంచలనం

ప్రారంభానికి ముందు….

సిన్సియర్లీ… మీ విసురజ
“నా ఆలోచనలో ఊపిరిపోసుకున్న అక్షరమా… నా భావోద్వేగాలను తర్జుమా చేసే నా నేస్తమా… పాఠకాభిమానుల హృదయాల్లో నా పేరును చిరంజీవిని చేసే ప్రాణమ… నువ్వు వర్ధిలు”
                                                                                                                              ….. విసురజ
“చిన్నపాటి ప్రకంపనం…. ఢిల్లీ నగరం నిద్రలోకి జారుకున్న సమయం. అర్ధరాత్రి ఒంటిగంట దాటింది. కిటికీలో నుంచి వీచే చల్లగాలిని ఆహ్వానిస్తూ, ఏసీకి గుడ్ బై చెప్పాను.
కీబోర్డు మీద చేతివేళ్ళు కదులుతున్నాయి. తెల్లవారితే ఈ అక్షరాలు ఊపిరిపోసుకుని లక్షలాది చదువరులను పలకరిస్తాయి….
“ముగ్ధమోహనం” నా తొలి కాల్పనిక రచన. ఆ మాటకొస్తే రచయితగా నా తొలి ప్రయత్నం… నిశ్శబ్దంగా నా ప్రపంచంలో… నాతో చెలిమి చేసే కవితలతో ముచ్చట్లాడుతూ, మ్యూజింగ్స్ లో షేర్ చేసుకుంటూ, కదిలే కాలంతోపాటు నడిచే అక్షరబాటసారిని.
ఒక ఆన్ లైన్ మేగజైన్ లో “డైలీ సీరియల్” రాయడమంటే… “ఒక ముడివేస్తూ, మరో ముడి విప్పుతూ, పాత్రల మధ్య వైవిధ్యాన్ని మిస్సవకుండా రాయాలి. రచయితకు స్వేచ్ఛ అపారమే… కానీ పాత్రలు రచయితను డామినేట్ చేస్తాయి. కథాకథన కుతూహలం వీక్షకులను మెస్మరైజ్ చేయాలని నా తపన. ఇదంతా నాకు సాధ్యమా, వీలయ్యే పనేనా.?
కస్టమ్స్ అధికారిగా ఉద్యోగ నిర్వహణ వేరు.. రచయితగా రూపెత్తి వేలాది / లక్షలాది చదువరును ఆకట్టుకోవాలంటే కొంచెం కంగారు.
ఢిల్లీ అత్యాచార సంఘటన ఇంకా నా స్మృతిపథంనుంచి కనుమరుగవ్వలేదు. క్రైమ్ రేటింగ్… అత్యాచార సంఘటనల పునరావృతం… ఇవన్నీ ఆందోళన కలిగించే విషయాలు.
వీటిని కలగలిపిన అల్లికతో…
స్వచ్ఛమైన అమ్మాయకపు అమ్మాయి (ముగ్ధ) పాత్రతో…
మోస్ట్ పవర్ ఫుల్ పాయిజన్ లాంటి విషకన్య లాంటి ప్రతినాయికతో “డీ” కొనే హీరోదాత్త (కార్తికేయ) పాత్రతో చేసిన ప్రయోగమే “ముగ్ధమోహనం”
నా ఆలోచనల్లో ఊపిరిపోసుకున్న ముగ్ధ పాత్ర నన్ను డామినేట్ చేసింది. హంట్ చేసింది. కలవర పెట్టింది.
ఫస్ట్ చాఫ్టర్ రాసేప్పుడు ఒక చిన్నపాటి ఉద్వేగం. ముగ్ధ పాత్రతో నాకు తెలియకుండానే ప్రేమలో పడిపోయా…
ముగ్ధ కుసుమరమైన కన్యకామణితో ప్రేమలో పడని వారెవరు…..?

మేన్ రోబో లో సీరియల్ గా వచ్చి సంచలనం సృష్టించిన మెస్మరైజింగ్ రైటర్ విసురజ ముగ్ధమోహనం ఇప్పుడు ఇ బుక్ గా/పుస్తకరూపంలో (ప్రింటెడ్ బుక్)గానూ లభ్యమవుతుంది.

కినిగె ద్వారా ఈ పుస్తకాలు,వీటితో పాటు విసురజ ఆధ్యాత్మిక రచనలు పంచరత్నాలు,మేలుకొలుపు ముచ్చట్లు కూడా అందుబాటులో వున్నాయి.
ఈ క్రింది లింక్ ద్వారా ఈ పుస్తకాలు కొనుక్కోవచ్చు…లేదా అద్దెకు తీసుకోవచ్చు.

http://kinige.com/book/Mugdhamohanam

NO COMMENTS

LEAVE A REPLY